రోజు లవంగాలు తింటే ఎన్ని ప్రయోజనాలో..!

రోజు లవంగాలు తింటే ఎన్ని ప్రయోజనాలో..!

సుగంధద్రవ్యాల్లో లవంగాలు ఒకటి. దీనిని వంటల్లో ఎక్కువగా ఉపయోగిస్తారు. ఇవి లేని పోపుల డబ్బా ఉండనే ఉండదు. అటు మసాలా కూరలతో పాటుగా, మాంసాహార కూరల్లో, బిర్యానీ తయారీలో దీన్ని ఎక్కువగా ఉపయోగిస్తారు. అంతేకాదు దీనిని నార్మల్‌గా కూడా తింటారు. ఎందుకంటే లవంగాలు వంటల్లో రుచినే కాదు. .ఆరోగ్యాన్ని కూడా కాపాడుతుంది. లవంగాల్ని కూరలతోపాటూ… కాస్మొటిక్స్, ఫార్మాస్యూటికల్, వ్యవసాయ ఉత్పత్తుల్లో కూడా ఎక్కువగా వాడతారు. అయితే ఈ లవంగాలు తినడం వల్ల కలిగే ప్రయోజనాలు ఎంటో చూద్దాం. […]

TV9 Telugu Digital Desk

| Edited By: Anil kumar poka

Oct 18, 2019 | 3:48 PM

సుగంధద్రవ్యాల్లో లవంగాలు ఒకటి. దీనిని వంటల్లో ఎక్కువగా ఉపయోగిస్తారు. ఇవి లేని పోపుల డబ్బా ఉండనే ఉండదు. అటు మసాలా కూరలతో పాటుగా, మాంసాహార కూరల్లో, బిర్యానీ తయారీలో దీన్ని ఎక్కువగా ఉపయోగిస్తారు. అంతేకాదు దీనిని నార్మల్‌గా కూడా తింటారు. ఎందుకంటే లవంగాలు వంటల్లో రుచినే కాదు. .ఆరోగ్యాన్ని కూడా కాపాడుతుంది. లవంగాల్ని కూరలతోపాటూ… కాస్మొటిక్స్, ఫార్మాస్యూటికల్, వ్యవసాయ ఉత్పత్తుల్లో కూడా ఎక్కువగా వాడతారు. అయితే ఈ లవంగాలు తినడం వల్ల కలిగే ప్రయోజనాలు ఎంటో చూద్దాం.

లవంగాల వల్ల కలిగే ప్రయోజనాలు…

* లవంగాలను తినడం వల్ల మన పళ్లు, చిగుళ్లు దెబ్బతినకుండా ఉంటాయి. * దంత సమస్యలు, చిగుళ్ల సమస్యల నుంచి ఉపశమనం పొందేందుకు లవంగాలను పొడిగా చేసి ఉపయోగిస్తే నొప్పి నుంచి ఉపశమనం కలుగుతుంది. * నోటి నుంచి ఎక్కువగా దుర్వాసన వస్తే.. రెండు మూడు లవంగాలు నమిలితే చాలు.. ఆ దుర్వాసనకు చెక్ పెట్టొచ్చు * కొందరికి దూర ప్రయాణాలు చేయడం పడదు. ప్రయాణాల్లో మధ్యలోనే వాంతులు చేసుకుంటుంటారు. అలాంటి వారి సమస్యను కూడా లవంగాలతో చెక్ పెట్టొచ్చు. ప్రయాణానికి ముందు ఓ రెండు లవంగాలు తీసుకుంటే సరి. తిన్న ఆహారం జీర్ణం అవ్వడంతో పాటుగా.. వికారం లాంటివి పోతాయి. దీంతో ప్రయాణాల్లో ఎలాంటి ఇబ్బందులు ఉండవు. * ఇక వర్షంలో తడిసినా.. చల్లని పదార్థాలు, స్వీట్లు తీసుకున్నా.. చాలా మందికి వెంటనే జలుబు, దగ్గు పట్టేస్తుంది. అయితే ఇలాంటి సమయంలో రోజులో ఓ అయిదు లవంగాలను తీసుకుంటే.. త్వరగా ఉపశమనం కలుగుతుంది.

* అంతేకాదు.. ఇవి వ్యాధుల్ని నియంత్రిచడంలో కూడా పనిచేస్తాయి. శరీరంలోని విష పదార్థాల్ని బయటకు పంపడంలో ఇవి బాగా పనిచేస్తాయి. * రెగ్యులర్‌గా తలనొప్పి వచ్చేవారు.. లవంగాలను తినడం ద్వారా తలనొప్పిని నుంచి బయటపడతారు. అంతేకాదు ఇది బీపీని, షుగర్‌ లెవల్స్‌ను కూడా కంట్రోల్‌‌లో ఉంచుతాయి. * లివర్, స్కిన్ సమస్యలకు కూడా చెక్ పెట్టొచ్చు * లవంగాల్లో యూజెనాల్ అనే నూనె ఉంటుంది. దీని ద్వారా నొప్పి, వాపు, మంటల్ని తగ్గిస్తుంది. * అల్సర్ సమస్యలకు కూడా లవంగాలతో ఉపశమనం పొందవచ్చు.

అయితే నియమితంగా కాకుండా.. అదే పనిగా వీటిని తింటే ఇబ్బందులు తప్పవు. ఎక్కువగా తింటే నోరు పాడయ్యే అవకాశం ఉంది. రోజుకు నాలుగైదు కంటే మించకుండా తీసుకోవాలి. పిల్లలకు వీలైనంత తక్కువగా ఇస్తే అంత మంచిది. లవంగాలు మంచివి కదా అని అతిగా వాడితే.. సమస్యలు ఎదురవుతాయి. అందువల్ల నియమితంగా తీసుకుంటే ఏ సమస్య దరిచేరదు.

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu