Water Bottle Cleaning Tips: మీ వాటర్ బాటిల్ ఇలా శుభ్రం చేశారంటే.. వ్యాధులను ఆహ్వానించినట్లే!
పాఠశాల పిల్లల నుంచి కార్యాలయ ఉద్యోగులు, కాలేజీ విద్యార్థుల వరకు అందరికీ వాటర్ బాటిల్ అవసరమే. ముఖ్యంగా పాఠశాల ప్రారంభమైన తర్వాత ప్రతిరోజూ పిల్లల బాటిళ్లను కడగడం,నింపడం దినచర్యలో ఒక భాగంగా మారుతుంది. కానీ చాలా మంది చేసే ఒక సాధారణ తప్పు ఏంటంటే..

నేటి జీవనశైలిలో ప్రతి ఒక్కరూ ఎక్కడికి వెళ్లినా తమతో పాటు వాటర్ బాటిల్ తీసుకెళ్లడం సర్వసాధారణమై పోయింది . పాఠశాల పిల్లల నుంచి కార్యాలయ ఉద్యోగులు, కాలేజీ విద్యార్థుల వరకు అందరికీ వాటర్ బాటిల్ అవసరమే. ముఖ్యంగా పాఠశాల ప్రారంభమైన తర్వాత ప్రతిరోజూ పిల్లల బాటిళ్లను కడగడం,నింపడం దినచర్యలో ఒక భాగంగా మారుతుంది. కానీ చాలా మంది చేసే ఒక సాధారణ తప్పు ఏంటంటే.. ప్రతిరోజూ బాటిల్‌ను నీటితో కడగడం. బాటిల్ బయటకు లోపల శుభ్రంగా కనిపించినప్పటికీ, దాని లోపల వివిధ రకాల బ్యాక్టీరియా పెరిగే అవకాశం ఉంది. దీర్ఘకాలంలో ఈ నిర్లక్ష్యం ఆరోగ్యంపై హానికరమైన ప్రభావాన్ని చూపుతుంది.
బాటిల్‌ను వెంటనే నీళ్లతో నింపకుండా ముందుగా శుభ్రంగా కడగడం ముఖ్యం. బాటిల్ లోపలి భాగాన్ని పూర్తిగా కడగడానికి బాటిల్ బ్రష్‌ను ఉపయోగించాలి. ఇది ఏదైనా బ్యాక్టీరియా లేదా జిగట ఉంటే దానిని పూర్తిగా తొలగిస్తుంది.వారానికి ఒకసారి ప్రత్యేక శుభ్రపరిచే ప్రక్రియను నిర్వహించాలి. బాటిల్ ని వేడి నీటితో నింపి, కొద్దిగా ఉప్పు వేయాలి. బాటిల్ మూతను పెట్టి, పై నుండి క్రిందికి బలంగా కదిలించాలి. తర్వాత బ్రష్ తో మళ్ళీ కడిగి, శుభ్రమైన నీటితో బాగా కడగాలి.
పిల్లలు పాఠశాల నుంచి ఇంటికి వచ్చిన వెంటనే వారి బాటిలోని నీటిని ఖాళీ చేయాలి. మూత తీసి కొన్ని గంటలు బాటిల్ తెరిచి ఉంచాలి. ఇది లోపల తేమ పేరుకుపోకుండా, దుర్వాసన రాకుండా నిరోధించడానికి సహాయపడుతుంది. మరుసటి రోజు ఉదయం బాటిల్ కడిగి నీటితో నింపాలి. బాటిల్ నేరుగా నోటి వద్దకు చేరుతుంది. అది శుభ్రంగా లేకపోతే అది తెలియకుండానే అనేక వ్యాధులకు ఆహ్వానం పలుకుతుంది. అందువల్ల నిర్లక్ష్యం చేయకుండా బాటిల్ క్లీనింగ్ నిర్వహణ ఆరోగ్యకరమైన జీవనశైలిలో అంతర్భాగం చేసుకోవడం చాలా ముఖ్యం.
మరిన్ని ఆరోగ్య కథనాల కోసం క్లిక్ చేయండి.