Cholesterol Reduce Foods: ఈ ఆహారాలు తింటే.. కొలెస్ట్రాల్ ఈజీగా కంట్రోల్ అవుతుంది..
ప్రస్తుతం ఇప్పుడున్న కాలంలో ప్రతీ అనారోగ్య సమస్య సాధారణంగా మారిపోయింది. ఇప్పుడు వయసుతో సంబంధం లేకుండా అందరికీ బీపీ, షుగర్లు వచ్చేస్తున్నాయి. అలాగే అందరూ కొలెస్ట్రాల్‌తో కూడా ఇబ్బంది పడుతున్నారు. బయట ఫుడ్ ఎక్కువగా తినే వారిలో ఈ కొలెస్ట్రాల్ స్థాయిలు అనేవి విపరీతంగా పెరిగిపోతున్నాయి. చాలా మంది ఆయిలీ, స్పైసీ ఫుడ్స్‌ని ఎక్కువగా తింటున్నారు. దీంతో శరీరంలో కొలెస్ట్రాల్ అనేది విపరీతంగా పెరిగిపోతుంది. కొలెస్ట్రాల్ పెరగడం వల్ల ముఖ్యంగా..
ప్రస్తుతం ఇప్పుడున్న కాలంలో ప్రతీ అనారోగ్య సమస్య సాధారణంగా మారిపోయింది. ఇప్పుడు వయసుతో సంబంధం లేకుండా అందరికీ బీపీ, షుగర్లు వచ్చేస్తున్నాయి. అలాగే అందరూ కొలెస్ట్రాల్‌తో కూడా ఇబ్బంది పడుతున్నారు. బయట ఫుడ్ ఎక్కువగా తినే వారిలో ఈ కొలెస్ట్రాల్ స్థాయిలు అనేవి విపరీతంగా పెరిగిపోతున్నాయి. చాలా మంది ఆయిలీ, స్పైసీ ఫుడ్స్‌ని ఎక్కువగా తింటున్నారు. దీంతో శరీరంలో కొలెస్ట్రాల్ అనేది విపరీతంగా పెరిగిపోతుంది. కొలెస్ట్రాల్ పెరగడం వల్ల ముఖ్యంగా గుండె జబ్బులు, బీపీ, షుగర్, ఊబకాయం వంటి సమస్యలు కూడా వస్తున్నాయి. కొలెస్ట్రాల్ తగ్గించడం అంత సులభం కాదు. చాలా కష్ట పడాలయి. ప్రతి రోజూ ఎక్సర్‌సైజులు చేయడం వల్ల కొంత ఫలితం ఉంటుంది. అలాగే మీరు తీసుకునే ఆహారంలో కూడా మార్పులు చేర్పులు చేయడం ఇలా చేస్తేనే కొలెస్ట్రాల్ అనేది తగ్గుతుంది. మరి కొలెస్ట్రాల్‌ను తగ్గించే ఆహారాలు ఏవో ఇప్పుడు చూద్దాం.
నానబెట్టిన బాదం:
ప్రతి రోజూ ఉదయం నానబెట్టిన బాదం తినడం వల్ల.. శరీరంలో ఉన్న చెడు కొలెస్ట్రాల్ తగ్గుతుంది. అంతే కాకుండా బరువు కూడా అదుపులోకి వస్తుంది. ఇందులో ప్రోటీన్లు, ఫైబర్, ఓమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ పోషక లోపాలను సరి చేసి.. ఆరోగ్యంగా ఉండేలా హెల్ప్ చేస్తాయి.
ఆరెంజ్ జ్యూస్:
కొలెస్ట్రాల్ సమస్యతో బాధ పడేవారు ప్రతి రోజూ ఆరెంజ్ జ్యూస్ తాగడం వల్ల మంచి ఫలితం ఉంటుంది. ఇది శరీరంలోని కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గించడంలో ప్రభావవంతంగా పని చేస్తుంది. అంతే కాకుండా మీ ఇమ్యూనిటీ కూడా బలపడుతుంది. ఇతర అనారోగ్య సమస్యలు కూడా దరి చేరకుండా ఉంటాయి.
వేరు శనగ:
వేరు శనగలు కూడా ఆరోగ్యానికి చాలా మేలు చేస్తాయి. వీటిల్లో పల్లీలు, ప్రోటీన్లు, విటమిన్లు అన్నీ లభిస్తాయి. వీటిని తింటే శరీరానికి కావాల్సిన పోషకాలన్నీ లభిస్తాయి. ఇవి శరీరంలో పేరుకుపోయిన కొలెస్ట్రాల్‌ను తగ్గించడంలో ఎఫెక్టీవ్‌గా పని చేస్తాయి. కాబట్టి ప్రతి రోజూ పల్లీలు తింటే మంచి ఫలితం ఉంటుంది.
మొలకెత్తిన పప్పులు:
మొలకెత్తిన రాజ్మా, సోయా బీన్స్, శనగలు, పెసర్లు తినడం వల్ల.. శరీరంలో పేరుకుపోయిన కొవ్వు అనేది బాగా కరుగుతుంది. అంతే కాకుండా వీటిల్లో ఎక్కువగా ఫైబర్, ప్రోటీన్స్ ఉంటాయి. కాబట్టి ఇవి కొద్దిగా తిన్నా.. కడపు నిండిన భావన కలిగి, ఇతర ఆహారాలు తీసుకోలేరు. అంతే కాకుండా ఇవి పొట్ట ఆరోగ్యాన్ని కూడా కాపాడతాయి.
(NOTE: ఇంటర్నెట్‌లో సేకరించిన సమాచారం ఆధారంగా ఈ వివరాలు మీకు అందించటం జరిగింది. ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. తదుపరి జరిగే ఎలాంటి పరిణామాలకు TV9 Telugu.com బాధ్యత వహించదు.)
మరిన్ని లైఫ్ స్టైల్ వార్తల కోసం క్లిక్ చేయండి..