AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Cherry Tomato: రైతులను ధనవంతులను చేస్తోన్న చెర్రీ టమోటా సాగు.. విదేశాల్లో భలే గిరాకీ.. ఎలా పండించాలంటే

చెర్రీ టొమాటో తీగ 20 అడుగుల ఎత్తు వరకు పెరుగుతుందని మహేంద్ర చెప్పారు. ఒక గుత్తుకు దాదాపు 120 టమోటాలు వస్తాయి. ఈ టమాటా తీగ 40 రోజులలో టమాటాలను ఇవ్వడం ప్రారంభిస్తుంది. సరైన సంరక్షణతో పంటను సాగు చేస్తే ఉత్పత్తి 10 నెలల పాటు కొనసాగుతుంది. దుబాయ్, చైనా, అమెరికా, జపాన్ వంటి దేశాల్లో చెర్రీ తమటాకు విపరీతమైన డిమాండ్ ఉందని చెప్పారు. ఈ తమటాకు బహిరంగ మార్కెట్లలో కిలో సుమారు రూ.400 వరకు ఉంది.

Cherry Tomato: రైతులను ధనవంతులను చేస్తోన్న చెర్రీ టమోటా సాగు.. విదేశాల్లో భలే గిరాకీ.. ఎలా పండించాలంటే
Cherry Tomato Farming
Surya Kala
|

Updated on: Aug 28, 2024 | 4:19 PM

Share

ప్రతి వంట ఇంట్లో టమాటాలు ఉండాల్సిందే.. టమాటా లేని కూరను తయరు చేయరు కొందరు. అలాంటి టమాటాలలో అనేక రకాలున్నాయి. వాటిల్లో ఒకటి చెర్రీ టమాటా. వీటిని సాగు చేస్తూ ఉత్తరప్రదేశ్‌లోని రైతులు భారీ ఆదాయన్ని పొందుతున్నారు. రాష్ట్రంలోని హర్దోయ్ జిల్లాలో చెర్రీ టమోటాల సాగు వైపు రైతులు మొగ్గు చూపుతున్నారు. ఇందుకు జిల్లా ఉద్యానవన శాఖ రైతులకు సహకరిస్తోంది. చెర్రీ రకం టమాటా యాపిల్ ధరకు విక్రయిస్తున్నారు. దీని సాగు శాస్త్రీయంగా చేస్తే లాభం మరింత పెరుగుతుందని చెబుతున్నారు.

కూరగాయల సాగుపై ప్రత్యేక పరిశోధనలు చేస్తున్న మహేంద్ర మాట్లాడుతూ కాలానుగుణంగా రైతులు తమ పద్ధతులను మార్చుకోవాల్సిన అవసరం ఉందన్నారు. కూరగాయల సాగులో చెర్రీ టమాటా సాగు అత్యంత లాభదాయకమని చెప్పారు. ఈ టమోటా చెర్రీ సాగుని డ్రిప్ ఇరిగేషన్ పద్ధతిలో టమాటా సాగును చేస్తారు.

చెర్రీ టమోటాలు ఎలా ఉంటాయంటే

చెర్రీ టొమాటో తీగ 20 అడుగుల ఎత్తు వరకు పెరుగుతుందని మహేంద్ర చెప్పారు. ఒక గుత్తుకు దాదాపు 120 టమోటాలు వస్తాయి. ఈ టమాటా తీగ 40 రోజులలో టమాటాలను ఇవ్వడం ప్రారంభిస్తుంది. సరైన సంరక్షణతో పంటను సాగు చేస్తే ఉత్పత్తి 10 నెలల పాటు కొనసాగుతుంది. దుబాయ్, చైనా, అమెరికా, జపాన్ వంటి దేశాల్లో చెర్రీ తమటాకు విపరీతమైన డిమాండ్ ఉందని చెప్పారు. ఈ తమటాకు బహిరంగ మార్కెట్లలో కిలో సుమారు రూ.400 వరకు ఉంది.

ఇవి కూడా చదవండి

చెర్రీ టొమాటోను ఎలా, ఎప్పుడు పండించాలంటే

జూలై, ఆగస్టు ప్రారంభంలో ఇసుక, లోమీ నేలలో చెర్రీ టమోటాలు సాగు చేస్తారని వ్యవసాయ శాఖ, ఉద్యానవన శాఖకు చెందిన రైతు ఓపీ మౌర్య తెలిపారు. భూమి pH విలువ 7. టొమాటో తీగ పెరిగిన భూమి కలుపు మొక్కలను రక్షించాలి. అప్పుడు 40 నుండి 60 రోజులలో తీగపై చెర్రీ టమాటాలు గుత్తులు గుత్తులుగా కాయడం మొదలవుతాయి ఆయన చెప్పారు. టమాటాకు బిందు సేద్యం పద్ధతిలో అవసరాన్ని బట్టి నీరుని అందించాలి. ఈ పంట కాలానుగుణంగా చీడపీడలను అరికట్టడంతోపాటు సరైన ఎరువులు, నీరు అందించడం ద్వారా రైతులకు మంచి లాభాలను ఇస్తుంది.

సూర్యకాంతి అవసరం

తేలికపాటి, వెచ్చని వాతావరణంలో టమోటా సాగు ఉత్తమమని అందువల్ల చెట్టుకు ఎక్కువ సూర్యరశ్మి అవసరమని ఆయన చెప్పారు. లక్నో పక్కనే ఉన్న శాండిలా, గ్రామాలలో దీని సాగు రైతులకు లాభదాయకమైన పంటగా నిరూపించబడింది. లక్నో మార్కెట్‌లో మంచి ధర పలుకుతోంది. ఎక్కువ మంది వ్యాపారులు చెర్రీ టమాటా కొనుగోలు చేసి విదేశాలకు విక్రయిస్తున్నారు.

అనేక రంగులలో చెర్రీ టమోటాలు

జిల్లా ఉద్యానవన శాఖ అధికారి సుభాష్ చంద్ర మాట్లాడుతూ చెర్రీ టొమాటో ఇతర టమాటా కంటే చిన్నదని.. 90శాతం నీరు సమృద్ధిగా ఉంటుందని తెలిపారు. ఇందులో విటమిన్ సి పుష్కలంగా లభిస్తుంది. నలుపు, ఎరుపు, పసుపు, ఆకుపచ్చ, నారింజ , ఊదా రంగులలో ఈ టమోటాలో వివిధ రకాలు ఉన్నాయి. ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, బీహార్, రాజస్థాన్, పశ్చిమ బెంగాల్, పంజాబ్, ఒరిస్సా మొదలైన రాష్ట్రాల్లో చెర్రీ టమోటాలను పంటను పండించి అద్భుతంగా ఉత్పత్తి చేయవచ్చు. అయితే సన్ షుగర్ అనే వెరైటీ చెర్రీ టొమాటో బెస్ట్ అని ఉద్యవన అధికారులు చెబుతున్నారు.

మరిన్ని లైఫ్ స్టైల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..