AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Polala Amavasya: పితృ దోషం తొలగడానికి పోలాల అమావాస్య రోజున పిండ ప్రదానం ఎలా చేయాలంటే

పోలాల అమావాస్య రోజున పిండదానం ప్రదానం చేయడం వల్ల పూర్వీకుల ఆశీస్సులు లబిస్తాయని.. వారికీ మోక్షం లభిస్తుందని నమ్మకం. పోలాల అమావాస్య రోజున పిండ ప్రదానం చేయడం ద్వారా పూర్వీకులు మోక్షాన్ని పొందుతారు. తద్వారా ప్రజలు పితృ దోషం నుండి విముక్తి పొందుతారు. జీవితంలో సంతోషాన్ని, శ్రేయస్సును కలిగి ఉంటారు. అంతే కాదు జీవితంలో వచ్చే సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది.

Polala Amavasya: పితృ దోషం తొలగడానికి పోలాల అమావాస్య రోజున పిండ ప్రదానం ఎలా చేయాలంటే
Polala Amavasya
Surya Kala
|

Updated on: Aug 28, 2024 | 3:53 PM

Share

ఉత్తరాది వారి హిందూ నెలలు పౌర్ణమి తర్వాత వచ్చే పాడ్యమి తిధి నుంచి మొదలై పౌర్ణమి తిధితో ముగుస్తాయి. అదే సమయంలో దక్షిణాదిలో తెలుగు నెలలు అమావాస్య తిది తర్వాత వచ్చే పాడ్యమి తిధితో మొదలై అమావాస్యతో ముగుస్తాయి. ఈ నేపధ్యంలో శ్రావణ మాసం చివరి రోజు అమావాస్య ఈ ఏడాది సెప్టెంబరు 03వ తేదీన వచ్చింది. ఈ అమావాస్యని ఉత్తారదివారు సోమవతి అమావాస్య అని పిలిస్తే తెలుగు వారు పోలాల అమావాస్య అని పిలుస్తారు. ఈ పోలాల అమావాస్య హిందూ మతంలో ఒక ప్రత్యేక రోజుగా పరిగణించబడుతుంది. పిల్లలకు అయుస్సుని పెంచే రోజుగానే కాదు పూర్వీకుల శ్రాద్ధ కర్మలు చేయడం, పిండ ప్రదానం చేయడం ప్రత్యేక ప్రాముఖ్యతను కలిగి ఉంది. పోలాల అమావాస్య రోజున పిండదానం ప్రదానం చేయడం వల్ల పూర్వీకుల ఆశీస్సులు లబిస్తాయని.. వారికీ మోక్షం లభిస్తుందని నమ్మకం. పోలాల అమావాస్య రోజున పిండ ప్రదానం చేయడం ద్వారా పూర్వీకులు మోక్షాన్ని పొందుతారు. తద్వారా ప్రజలు పితృ దోషం నుండి విముక్తి పొందుతారు. జీవితంలో సంతోషాన్ని, శ్రేయస్సును కలిగి ఉంటారు. అంతే కాదు జీవితంలో వచ్చే సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది.

పంచాంగం ప్రకారం శ్రావణ మాసంలో చివరి రోజు అమావాస్య తిథి సెప్టెంబర్ 3వ తేదీ ఉదయం 5.21 గంటలకు ప్రారంభమై సెప్టెంబర్ 4వ తేదీ ఉదయం 7.24 గంటలకు ముగుస్తుంది. దీంతో సెప్టెంబరు 03 మంగళవారం మొత్తం అమావాస్య ఘడియలున్నాయి. ఈ రోజున పోలాల అమావాస్యని జరుపుకుంటారు. సెప్టెంబరు 04 వ ఉదయం 6 గంటవ 7 నిముషాల వరకూ అమావాస్య ఘడియలున్నాయి. అంటే.. సూర్యోదయానికి అమావాస్య ఉండడంతో ఈ రోజుని కూడా అమావాస్యగానే పరిగణిస్తారు. ఈ అమావాస్య రోజున పూర్వీకులకు శ్రాద్ధం, తర్పణం, పిండ ప్రదానం చేయడం ద్వారా జీవితంలోని అన్ని బాధలు, కష్టాలు తొలగిపోతాయని విశ్వాసం.

పూర్వీకులకు పిండ ప్రదానం చేయడానికి నియమాలు ఏమిటంటే?

  1. పూర్వీకుల మోక్షం కోసం, పిండి ప్రదానం చేసే ముందు, స్నానం చేసి శుభ్రమైన తెల్లని బట్టలు ధరించండి.
  2. సూర్యోదయ సమయంలో పిండ ప్రదానం చేయడం శుభప్రదంగా పరిగణించబడుతుంది. అందువల్ల సూర్యోదయం తర్వాత మాత్రమే పిండి ప్రదానం చేయండి.
  3. ఇవి కూడా చదవండి
  4. పరిశుభ్రమైన ప్రదేశంలో పూర్వీకుల చిత్రపటాన్ని లేదా విగ్రహాన్ని ప్రతిష్టించి, పూర్వీకులకు నీటిని సమర్పించండి.
  5. ఆవు పేడ, పిండి, నువ్వులు, అన్నం కలిపి ముద్దలుగా తయారు చేసి పూర్వీకులకు సమర్పించండి.
  6. ఇలా తయారు చేసిన ఆహార ముద్దలను పూర్వీకుల పేరుతో శ్రాద్ధ కర్మ నిర్వహించి ప్రవహించే నది నీటిలో నిమజ్జనం చేయాలి.
  7. పోలాల అమావాస్య రోజున పూర్వీకుల శాంతి కోసం బ్రాహ్మణులకు దానం చేయడం చాలా పవిత్రమైనదిగా భావిస్తారు.
  8. దానానికి నువ్వులు, నల్ల నువ్వులు, నీరు, పెరుగు, తేనె, ఆవు పాలు, గంగాజలం, బట్టలు, ధాన్యం మొదలైనవి ఉండాలి.
  9. పితృదోషం నుండి బయటపడటానికి పిండ ప్రదానం చేస్తున్నప్పుడు మంత్రాలను పఠించండి. మతపరమైన గ్రంథాలను చదవండి.

ఈ విషయాలపై ప్రత్యేక శ్రద్ధ వహించండి

ఎవరి  కుటుంబంలో నైనా మగవారు లేకుంటే వారి బంధువులు కూడా పిండ ప్రదానం చేయవచ్చు. ఈ పిండ ప్రదానం మతపరమైన ప్రదేశానికి లేదా నది ఒడ్డుకు వెళ్లి చేయవచ్చు. సంవత్సరానికి ఒకసారి పొలాల అమావాస్య రోజున పిండ ప్రదానం చేయడం తప్పనిసరి.

పిత్ర దోషం చాలా తీవ్రంగా ఉంటే జ్యోతిష్కుని సలహాతో పిండ ప్రదానం ఒకటి కంటే ఎక్కువసార్లు చేయవచ్చు. పిండ ప్రదానం చేస్తున్నప్పుడు నిర్మలమైన మనస్సుతో పూర్వీకులను స్మరించుకోండి. పిండ ప్రదానం తరువాత, బ్రాహ్మణులకు ఆహారం అందించండి. పిండ ప్రదానం తర్వాత దానం చేయండి.

పిండ ప్రదానం చేసే ముందు పండితుని సలహా తీసుకోవడం మంచిది. పిండ ప్రదానం సమయంలో అన్ని నియమాలను పాటించడం చాలా ముఖ్యం. ఎందుకంటే పిండ ప్రదానం అనేది పూర్వీకులను విముక్తి చేయడానికి ఒక పవిత్రమైన ఆచారం. ఈ రోజున మన పూర్వీకులను స్మరించుకోవడం, వారికి నివాళులు అర్పించడం ద్వారా ఆశీర్వాదం పొందడంతో పాటు పితృ దోషం నుండి కూడా విముక్తి పొందవచ్చు.

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల  కోసం ఇక్కడ క్లిక్ చేయండ్

గమనిక: పైన పేర్కొన్న అంశాలను మత గ్రంథాల ఆధారంగా ప్రజల సాధారణ ఆసక్తులను దృష్టిలో ఉంచుకుని ఇవ్వడం జరిగింది. దీనిని టీవీ9 తెలుగు ధృవీకరించడం లేదు