Christmas 2022: క్రిస్మస్ వేళ రుచికరమైన పదార్థాలను తినాలనుకుంటున్నారా..? అయితే ఈ వంటకం గురించి తెలుసుకోండి..
క్రిస్మస్ అంటేనే కేకులు, రుచికరమైన వంటకాలు. ఆ సందర్భంగా ఏయే రుచికరమైన వంటకాలను చేయాలనేది ఇప్పటి నుంచి ఆలోచిస్తే తప్ప అప్పటికి అవ్వవు. మరి మీరు కూడా..

క్రిస్మస్ వేడుకలకు ఇంకా రెండు రోజులు మాత్రమే సమయం మిగిలి ఉంది. క్రిస్మస్ అంటేనే కేకులు, రుచికరమైన వంటకాలు. ఆ సందర్భంగా ఏయే రుచికరమైన వంటకాలను చేయాలనేది ఇప్పటి నుంచి ఆలోచిస్తే తప్ప అప్పటికి అవ్వవు. మరి మీరు కూడా ఆలోచిస్తున్నారా.. క్రిస్మస్ రోజు తినాలనుకుంటున్న రుచికరమైన పదార్థాల గురించి..? ప్రతి ఒక్కరికీ లడ్డూలు, కేకులు, ఇంకా అనేక రుచికరమైన పదార్థాలను తినడం ఇష్టంగానే ఉంటుంది. మరి అలాంటి వారి ఇష్టాన్ని సంతృప్తి పరచగల రుచికరమైన పదార్థాలలో చాక్కెట్ వాల్‌నట్ బ్రౌనీ కూడా ఒకటి. దీనిని ఒక్కసారి తిన్నా.. మళ్లీ మళ్లీ కోరుకోకుండా ఉండలేరు. అయితే నోరూరించే ఈ రెసిపీని ఎలా చేసుకోవాలో ఇక్కడ తెలుసుకుందాం..
చాక్లెట్ వాల్‌నట్ బ్రౌనీ తయారీ కోసం కావలసినవి:
- వెన్న – 1½ టేబుల్ స్పూన్ లేదా 22 గ్రా
- డార్క్ చాక్లెట్ – 30 గ్రా
- చక్కెర (పొడి) – 1½ టేబుల్ స్పూన్ లేదా 10 గ్రాములు
- వెనిల్లా – కొన్ని చుక్కలు
- మైదా – 4½ టేబుల్ స్పూన్లు లేదా 35 గ్రాములు
- పాలు – 2 టేబుల్ స్పూన్లు లేదా 30 మి.లీ
- వేయించి పిండి చేసిన వాల్నట్స్ – చేతిలో సిరపడినన్ని
- చాక్లెట్ ముక్కలు -చేతిలో సిరపడినన్ని
- బట్టర్ పేపర్
తయారీ పద్ధతి:
చాక్లెట్‌ను చిన్న ముక్కలుగా కట్ చేసి, వెన్నతో పాటు మైక్రోవేవ్ బౌల్‌లో వేయండి. చాక్లెట్ పూర్తిగా కరిగేంతవరకు అలాగే ఉంచండి.
పంచదార, పాలు, వెనీలా, మైదా, వాల్‌నట్స్ వేసి మిశ్రమం మొత్తాన్ని పేస్ట్‌లా చేయండి. మీరు తీసుకున్న పాత్ర పరిమాణంలో బట్టర్ పేపర్‌ను కత్తిరించండి. బ్రౌనీని ఒకసారి కాల్చిన తర్వాత పాత్ర నుంచి సులభంగా తీయగలిగేలా అన్ని వైపులా చూసుకోండి.




పేస్ట్‌లా చేసిన మిశ్రమాన్ని మీరు తీసుకున్నపాత్రలో గాలి చేరకుండా జాగ్రత్తగా వేయండి. ఈ సమయంలో పేస్ట్ మందంగా, జిగటగా ఉంటే పాత్రలో సమానంగా విస్తరించగలదు. దానిపై వేయించిన వాల్‌నట్స్, ఇంకా రుచి కోసం చాక్లెట్ ముక్కలను అలంకరించండి.
చాక్లెట్ బ్రౌనీ పేస్ట్‌తో నింపిన పాత్రను మైక్రోవేవ్‌లొ రెండు నిముషాల పాటు ఉంచండి. తర్వాత తీసి కత్తి లేదా టూత్‌పిక్ ద్వారా బ్రౌనీ పూర్తిగా ఉడికిందో లేదో చూడండి. ఉడకకపోతే మరికొంత సమయం మైక్రోవేవ్‌పైనే ఉంచండి.
తర్వాత పాత్ర నుంచి చాక్లెట్ బ్రౌనీని తీయండి. బటర్ పేపర్‌ని తీసివేసి చాక్లెట్ బ్రౌనీని కాసేపు చల్లబరచండి. చల్లబడ్డాక సంతోషకరంగా తినవచ్చు. దానిని నిల్వ చేయాలనుకుంటే గాలి చొరబడని పాత్రలలో కేవలం రెండు మూడు రోజుల పాటు మాత్రమే ఉంచవచ్చు.