Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Christmas Cake: క్రిస్మస్ వేళ కేక్ లేకపోతే ఎలా..? ఇంట్లోనే అత్యంత సులభంగా చేసుకోగల 5 రకాలైన కేకుల వివరాలు మీ కోసం..

వేడుకలయినా, ఆత్మీయుల కలయిక అయినా కేక్ లేకపోతే కష్టమే. అది కూడా క్రిస్మస్ వేళ కేక్ లేకపోతే ఎలా..? మరి ఈ క్రిస్మస్ వేడుకల కోసం కేక్‌ను కొనుగోలు చేస్తున్నారా..? కేకులను కొనుగోలు..

Christmas Cake: క్రిస్మస్ వేళ కేక్ లేకపోతే ఎలా..? ఇంట్లోనే అత్యంత సులభంగా చేసుకోగల 5 రకాలైన కేకుల వివరాలు మీ కోసం..
Christmas Cake
Follow us
శివలీల గోపి తుల్వా

|

Updated on: Dec 23, 2022 | 10:32 AM

చూస్తుండగానే ప్రస్తుతం సంవత్సరం ముగింపు దశకు వచ్చేసింది. సంవత్సరాంతం అనగానే ప్రపంచమంతా గుర్తుకు వచ్చేది క్రిస్మస్ కాక మరేముంది..? క్రిస్మస్ అంటేనే కేకులు, స్నాక్స్, వేడుకలు,  ఆత్మీయుల కలయికలు. వేడుకలయినా, ఆత్మీయుల కలయిక అయినా కేక్ లేకపోతే కష్టమే. అది కూడా క్రిస్మస్ వేళ కేక్ లేకపోతే ఎలా..? మరి ఈ క్రిస్మస్ వేడుకల కోసం కేక్‌ను కొనుగోలు చేస్తున్నారా..? కేకులను కొనుగోలు చేసే ప్లాన్‌లోనే ఉన్నట్లయితే అక్కడే ఆగిపోండి. ఎందుకంటే అత్యంత సులభంగా, అతి తక్కువ ఖర్చుతో తయారు చేసుకోగల కేక్ వివరాలు తెలుసుకుంటే సరిపోతుంది కదా.. మరి అలా తయారుచేసుకోగల కేక్ ఐడియాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం..

1. క్రిస్మస్ ప్లం కేక్:

క్రిస్మస్, ప్లం కేక్‌ల మధ్య సంబంధం విడదీయరానిది. ప్లం కేక్‌లు అనేవి క్రిస్మస్ వేడుకలలో సాంప్రదాయక భాగం అని చెప్పుకోవాలి. ఈ రుచికరమైన కేక్‌ను ఆల్కహాల్‌తో లేదా ఆల్కహాల్ లేకుండా కూడా తయారు చేసుకోవచ్చు. దీనిని డ్రైఫ్రూట్స్ లేదా డ్రైనట్స్‌తో సహా ఇతర పదార్థాలతో తయారు చేయవచ్చు. దీని రుచి ఎంతో అద్భుతంగా ఉంటుంది. ఇక దీనిని అతి తక్కువ ఖర్చుతో ఇంట్లోనే చేసుకోండి.

2. వైట్ చాక్లెట్ చీజ్

వైట్ చాక్లెట్ కేక్ దాని రుచి, మృదువైన ఆకృతికి ఎంతో ప్రసిద్ధి. చీజ్‌ కేక్‌లలో చాలా రకాలు ఉన్నాయి. మీకు నచ్చిన ఫ్లేవర్‌తో కేక్‌ను తయారు చేసుకొని క్రిస్మస్ వేళ ఆనందంగా ఆస్వాదించండి.

ఇవి కూడా చదవండి

3. మార్బుల్ కేక్

‘మెల్ట్ ఇన్ ది మౌత్’ అనేలా ఉండే ఈ మార్బుల్ కేక్ మీ నాలుక రుచిని పెంచుతుంది. దీనిని వెనిల్లా, కోకో, చాక్లెట్ ఫ్లేవర్లను ఉపయోగించి తయారు చేస్తారు. గుడ్లు అవసరం లేకుండానే ఈ కేక్‌ను చేసుకోవచ్చు.భోజనం తర్వాత తినడానికి ఈ కేక్ ఉత్తమమైనదని చెప్పవచ్చు.

4. రిచ్ చాక్లెట్ కేక్:

చాక్లెట్ కేక్ అంటే ఎవరికి ఇష్టం ఉండదు.? ముఖ్యంగా పిల్లలకు చాక్లెట్ అంటే పంచప్రాణం.  క్రిస్మస్ వేళ పిల్లల కోసం ఏమైనా కొత్తగా ఇవ్వాలని ప్లాన్ చేస్తుంటే ఇది మీకు ఉత్తమమైన చాయిస్. దీనిని చూడగానే పిల్లలు ఎగిరి గంతులెయ్యాల్సిందే..

5. చాక్లెట్ బనానా కేక్:

చాక్లెట్ బనానా కేక్ తయారు చేయడానికి చాలా సమయం, ఇంకా చాలా పదార్థాలు అవసరమనే అపోహాలతో కొందరు ఉంటారు. కానీ మీరు అనుకున్నంత కష్టపడకుండానే  ఈ కేక్‌ను చేసుకోవచ్చు. అరటిపండు, వేరుశెనగల వెన్న, కోకో పౌడర్ పదార్థాలను ఉపయోగించి నోరూరించే చాక్లెట్ బనానా కేక్‌ను తయారు చేయవచ్చు.

క్రిస్మస్ సందర్భంగా ఇంట్లోనే కేక్‌లను తయారుచేసుకోవడం ద్వారా దుకాణాల్లోని చిరుతిళ్లకు దూరంగా ఉండండి. అది మీ ఆరోగ్యాన్ని ఎంతగానో కాపాడుతుంది.

మరిన్ని లైఫ్ స్టైల్ వార్తల కోసం చూడండి..