weight loss: వాకింగ్, జాగింగ్ లలో ఏది బెస్ట్? బరువు వేగంగా తగ్గాలంటే ఏం చేయాలి? ఇవిగో ఫ్యాక్ట్స్.. మీరు ఓ లుక్కేయండి

ముఖ్యంగా కార్డియోవాస్కులర్ వ్యాధులపై ఇవి అస్త్రంలా పనిచేస్తాయి. అయితే వాకింగ్ లేదా జాగింగ్ రెండూ చేయాలా? లేక ఏదో ఒకటి చేస్తే సరిపోతుందా? అనే అనుమానాలు చాలామందిలో ఉండే ఉంటాయి. అలాంటి వారి కోసం ఈ కథనం.

weight loss: వాకింగ్, జాగింగ్ లలో ఏది బెస్ట్? బరువు వేగంగా తగ్గాలంటే ఏం చేయాలి? ఇవిగో ఫ్యాక్ట్స్.. మీరు ఓ లుక్కేయండి
Walking Jogging
Follow us

|

Updated on: Dec 23, 2022 | 10:35 AM

మారుతున్న జీవన విధానంలో అధిక బరువు అందరినీ వేధిస్తున్న సమస్య. శారీరక శ్రమ లేని టెక్ ఉద్యోగాలు.. ఎక్కువ సేపు కూర్చొని చేసే పనుల కారణంగా చాలా మంది ఊరకనే బరువు పెరిగిపోతున్నారు. ఫలితంగా బీపీ, షుగర్ వంటి వ్యాధుల బారిన పడుతున్నారు. దీంతో బరువును తగ్గించుకోడానికి ఇక జిమ్ ల బాట పడుతున్నారు. లేదా డైటీషీయన్ ల చుట్టూ తిరుగుతుంటారు. అయితే ఎటువంటి ఖర్చులేకుండా జిమ్ లకు వెళ్లాల్సిన పని లేకుండా సులభంగా బరువు తగ్గడానికి అద్భుతమైన పద్ధతులు రెండు ఉన్నాయి. అదే వాకింగ్, జాగింగ్.. అవునండి నిజమే మీ బరువు వేగంగా అదుపులోకి రావాలంటే ఈ రెండింటిని మించిన పద్ధతులు మరోకటి లేదు. ఈ విషయాన్ని నిపుణులు సైతం అంగీకరిస్తారు. ముఖ్యంగా కార్డియోవాస్కులర్ వ్యాధులపై ఇవి అస్త్రంలా పనిచేస్తాయి. అయితే వాకింగ్ లేదా జాగింగ్ రెండూ చేయాలా? లేక ఏదో ఒకటి చేస్తే సరిపోతుందా? అనే అనుమానాలు చాలామందిలో ఉండే ఉంటాయి. అలాంటి వారి కోసమే ఈ కథనం. వాకింగ్, జాగింగ్ ఏదీ చేస్తే మీ శరీరానికి మేలు చేస్తుంది.. వాటిని ఎలా చేయాలి అన్న విషయాలపై నిపుణుల సలహాలు, సూచనలు ఇవి..

అద్భుతమైన పరిష్కారాలు..

వాకింగ్ అనేది అందుబాటులో ఉన్న ఎక్సర్ సైజ్ లలో ది బెస్ట్ అని చెప్పాలి. దీనిని ప్రధానంగా కార్డియోవాస్కులర్ ఫిజికల్ యాక్టివిటీ కింద చేయిస్తారు. వాకింగ్ చేయడం వల్ల రక్త ప్రసరణ పెరిగి.. బీపీ అదుపులోకి వస్తుంది. అలాగే మీ స్టామినా పెరుగుతుంది. అధిక కేలరీలను కరిగించి మీకు మంచి ఆరోగ్యాన్ని ఇస్తుంది. అలాగే రన్నింగ్ చేయడం కష్టమైతే జాగింగ్ అనేది కూడా మీకు మంచి ఆప్షన్. ఇది కూడా వాకింగ్ లాగానే ఉంటుంది గానీ కొంచెం వేగంగా నడవాల్సి చేయాల్సి ఉంటుంది.

ఏది బెస్ట్ ఆప్షన్..

సాధారణంగా బరువు తగ్గడానికి చాలా మంది జిమ్కి వెళ్తుంటారు. చురుకైన నడకతోపాటు జాగింగ్ అలాగే సైక్లింగ్, ట్రెడ్ మిల్ వంటి వాటిపై ఎక్సర్ సైజ్లు చేస్తుంటారు. అయితే వాకింగ్ కన్నా కూడా జాగింగ్ అయితేనే బరువు వేగంగా తగ్గడానికి సాయపడుతుందని నిపుణులు చెబుతున్నారు. అది ఎందుకో ఇప్పుడు చూద్దాం.

ఇవి కూడా చదవండి

అసలు వాకింగ్ అంటే ఏమిటి?

వాకింగ్ లేదా నడకను కాస్త చురుగ్గా చేయాలి. కనీసం గంటలో 3 నుంచి 4 మైళ్ల దూరం వెళ్లేంత వేగంగా నడవాలి. సింపుల్ చెప్పాలంటే నింపాదిగా వెళ్లడం కాకుండా కాస్త వేగంగా నడవాలి. వాకింగ్ చేసే టప్పుడు మీరు మాట్లాడగలరు గాని.. పాడలేరు. ఆ విధమైన స్పీడ్ ఉంటే చాలు.

జాగింగ్ అంటే..

జాగింగ్ అంటే సాధారణంగా నడచిన దాని కన్నా వేగంగా.. పరుగెత్తడం కన్నా తక్కువగా ఒక రిథమిక్ స్పీడ్ తో వెళ్లడం. వాకింగ్ తో పోల్చితే జాగింగ్ చేసినప్పుడు ఎక్కవ శక్తిని వినియోగిస్తారు. అలాగే రన్నింగ్ పోల్చితే తక్కువ శక్తిని వినియోగిస్తారు. అలాగే ఒత్తిడి కూడా తక్కువగా ఉంటుంది.

వాకింగ్ Vs జాగింగ్ ఏది ఉపయుక్తం..

జాగింగ్ తో పోల్చితే వాకింగ్ లో తక్కువ శక్తిని వినియోగిస్తాం. ఎందుకంటే వాకింగ్ చేస్తున్నప్పుడు రెండు కాళ్లు తప్పనిసరిగా భూమికి ఆనుకుని ఉంటాయి. ఫలితంగా శరీర బరువు సమానంగా విభాగితం అయ్యి మొత్తం ప్రభావం తక్కువగా ఉంటుంది. అయితే జాగింగ్ చేసేటప్పుడు ఒక కాలు గాలిలో ఉన్నప్పుడు మరో కాలు భూమికి ఆనుకొని ఉంటుంది. ఫలితంగా ఒత్తిడి పెరిగి కేలరీలు కరగడానికి సాయపడుతుంది. అందువల్ల వాకింగ్ కన్నా జాగింగ్ చేసినప్పుడు శరీరంపై అధిక ప్రభావం పడుతుంది.

హార్ట్ రేట్ కూడా..

వాకింగ్ లేదా జాగింగ్ చేస్తున్నప్పుడు హార్ట్ రేట్ 50 నుంచి 70 శాతం పెరుగుతుంది. జాగింగ్ చేసేటప్పుడు 120 బీపీఎం నుంచి 140 బీపీఎం కు పెరుగుతుంది. కానీ వాకింగ్ చేసేటప్పుడు 120 బీపీఎం మాత్రమే ఉంటుంది. ఫలితంగా కేలరీలు ఖర్చు చేయడంలో జాగింగ్ అధికంగా ఉపయుక్తం అవుతుంది.

రెండింటితోనూ మేలే..

వాస్తవానికి వాకింగ్, జాగింగ్ ఏదైనా ఆరోగ్యానికి మంచి చేసేదే. కాకపోతే మీ శరీర తత్వాన్ని బట్టి మీరు ఎంపిక చేసుకోవచ్చు. ఒకవేళ బరువు మరి అధికంగా ఉంటే జాగింగ్ చేసేటప్పుడు కాళ్లపై ఒత్తిడి పెరిగిపోయి జాయింట్స్ వద్ద గాయాలయ్యే అవకాశాలుంటాయి. అలాంటి వారు వాకింగ్ అలవాటు చేసుకుని.. కొంత కాలం తర్వాత జాగింగ్ చేస్తే మేలు.

మరిన్ని లైఫ్ స్టైల్ వార్తల కోసం క్లిక్ చేయండి..