Lifestyle: కర్పూరం వాసన పీల్చుకుంటే ఏమవుతుందో తెలుసా.?
ప్రతీరోజూ కర్పూరం వాసనను కాసేపు పీల్చుకుంటే ఒత్తిడి, ఆందోళన వంటివి దూరమవుతాయని నిపుణులు చెబుతున్నారు. అలాగే జలుబు, దగ్గుతో దీర్ఘకాలంగా ఇబ్బంది పడుతుంటే కూడా కర్పూరం వాసన పీల్చుకోవడం వల్ల ఉపశమనం లభిస్తుంది. అంతేకాదు మైగ్రేన్ తలనొప్పితో ఇబ్బంది పడే వారికి కూడా కర్పూరం ఎంతో ఉపయోగపడుతుంది...
కర్పూరం ఈ పేరును ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన పనిలేదు. పూజ గదిలో కచ్చితంగా కర్పూరాన్ని ఉపయోగించాల్సిందే. ఎన్నో ఔషధ గుణాలకు కర్పూరం పెట్టింది పేరు. కర్పూరం లేనిది పూజ పూర్తవ్వదు. అయితే కేవలం పూజలో మాత్రమే కాకుండా కర్పూరం వల్ల ఎన్నో రకాల ఆరోగ్య ప్రయోజనాలు కూడా ఉన్నాయని మీకు తెలుసా.? ముఖ్యంగా ప్రతీరోజూ కర్పూరం వాసన పీల్చుకుంటే కలిగే ప్రయోజనాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం..
ప్రతీరోజూ కర్పూరం వాసనను కాసేపు పీల్చుకుంటే ఒత్తిడి, ఆందోళన వంటివి దూరమవుతాయని నిపుణులు చెబుతున్నారు. అలాగే జలుబు, దగ్గుతో దీర్ఘకాలంగా ఇబ్బంది పడుతుంటే కూడా కర్పూరం వాసన పీల్చుకోవడం వల్ల ఉపశమనం లభిస్తుంది. అంతేకాదు మైగ్రేన్ తలనొప్పితో ఇబ్బంది పడే వారికి కూడా కర్పూరం ఎంతో ఉపయోగపడుతుంది. మైగ్రేన్ తలనొప్పి ఇట్టే తగ్గుతుంది. ఇక కర్పూరం వాసన పీల్చుకుంటే జీర్ణ సంబంధిత సమస్యలు కూడా తగ్గుతాయని నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా పచ్చ కర్పూరాన్ని నీటిలో కొంచెం కలుపుకొని తీసుకోవడం వల్ల మంచి ఫలితం ఉంటుంది.
అందుకే దేవాలయాల్లో తీర్థంలో కర్పూరాన్ని కలుపుతుంటారు. కర్పూరంలో యాంటీ బాక్టీరియల్ మరియు యాంటీ ఫంగల్ లక్షణాలు ఉన్నాయి, ఇవి ప్రమాదకరమైన సూక్ష్మక్రిములను నాశనం చేస్తాయి. ఇక జలుబుతో ఇబ్బంది పడుతుంటే కర్పూరాన్ని ఒక క్లాత్‌లో పెట్టుకొని వాసన చూడాలి ఇలా చేయడం వల్ల బ్లాక్ అయిన ముక్కు సమస్య నుంచి ఉపశమనం లభిస్తుంది. కర్పూరం వాసనను చూస్తుంటే శరీరంలో శక్తి కూడా పెరుగుతుంది. నిద్రలేమి సమస్య నుంచి కూడా బయటపడొచ్చు. అయితే కర్పూరాన్ని ఎట్టి పరిస్థితుల్లో నేరుగా నోటిలో వేసుకోకూడదు.
నోట్: పైన తెలిపిన విషయాలు కేవలం ప్రాథమిక సమాచారం మేరకు మాత్రమే. ఆరోగ్యానికి సంబంధించి వైద్యుల సూచనలు పాటించడమే ఉత్తమం.
మరిన్ని లైఫ్ స్టైల్ వార్తల కోసం క్లిక్ చేయండి..