Lifestyle: మంచిదని నిమ్మరసం తెగ తాగుతున్నారా.? ఏమవుతుందో తెలుసా.?
బరువు తగ్గడంతో పాటు, యాంటీ ఏజింగ్ లక్షణాలు నిమ్మరసంలో ఉంటాయి. విటమిన్ సీ, జింక్, ఫోలిక్ యాసిడ్‌లు పుష్కలంగా ఉంటాయి. ఇది మన రోగనిరోధక శక్తిని బలోపేతం చేసుకోవచ్చు. అయితే మంచి చేసే నిమ్మరసం కొందరికి మాత్రం మంచిది కాదని నిపుణులు చెబుతున్నారు. నిమ్మరసం ఎక్కువగా తీసుకోవడం వల్ల కలిగే దుష్ప్రభావాలు...
నిమ్మరసం ఆరోగ్యానికి ఎంతలా మేలు చేస్తుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ముఖ్యంగా సమ్మర్‌లో ఎండ దెబ్బ తగలకుండా ఉండడానికి, శరీరం డీహైడ్రేషన్‌కు గురికాకుండా ఉండడానికి నిమ్మరసాన్ని తీసుకోవాలని నిపుణులు చెబుతుంటారు. అంతేకాదు బరువు తగ్గడంలో కూడా నిమ్మరసం కీలక పాత్ర పోషిస్తుంది. అందుకే కచ్చితంగా నిమ్మరసాన్ని తీసుకోవాలని నిపుణులు సూచిస్తుంటారు. అయితే ఆరోగ్యానికి మంచి చేసే నిమ్మరసం ఎక్కువగా తీసుకోవడ వల్ల అనారోగ్య సమస్యలు కూడా తప్పవని నిపుణులు చెబుతున్నారు. నిమ్మరసం అధికంగా తీసుకుంటే కలిగే నష్టాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం..
బరువు తగ్గడంతో పాటు, యాంటీ ఏజింగ్ లక్షణాలు నిమ్మరసంలో ఉంటాయి. విటమిన్ సీ, జింక్, ఫోలిక్ యాసిడ్‌లు పుష్కలంగా ఉంటాయి. ఇది మన రోగనిరోధక శక్తిని బలోపేతం చేసుకోవచ్చు. అయితే మంచి చేసే నిమ్మరసం కొందరికి మాత్రం మంచిది కాదని నిపుణులు చెబుతున్నారు. నిమ్మరసం ఎక్కువగా తీసుకోవడం వల్ల కలిగే దుష్ప్రభావాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం..
* నిమ్మరసాన్ని ఎక్కువగా తీసుకోవడం వల్ల పళ్లపై ప్రభావం పడుతుంది నిపుణులు చెబుతున్నారు. నిమ్మకాయలలో సిట్రిక్ యాసిడ్ ఎక్కువగా ఉంటుంది. ఇది మీ దంతాలపై సున్నిన్నితత్వ సమస్యలను కలిగిస్తుంది. పంటిపై ఉండే ఎనామెల్‌ను కూడా దెబ్బ తీస్తుంది.
* ఇప్పటికే గ్యాస్ లేదా అసిడిటీ సమస్యలతో బాధపడేవారు నిమ్మరసం తాగడం మానేయాలి. ఇందులో సిట్రిక్ యాసిడ్ ఎక్కువగా ఉండటం వల్ల ఎసిడిటీ పెరిగే ప్రమాదం ఉంది. ఎసిడిటీ సమస్య ఉన్నవారు ఖాళీ కడుపుతో నిమ్మరసం తాగకూడదు.
* కిడ్నీ సంబంధిత సమస్యతో బాధపడుతున్న వారు నిమ్మరసం ఎక్కువగా తీసుకోకూడదు. ఇది మూత్రపిండాలపై అదనపు ఒత్తిడిని కలిగిస్తుంది. అలాగే ఖాళీ కడుపుతో నిమ్మరసం తీసుకోకూడదు. దీర్ఘకాలిక మూత్రపిండ వ్యాధితో బాధపడేవారు ఖాళీ కడుపుతో నిమ్మరసం తాగకూడదు.
* నిమ్మరసంలో టైరమైన్ అనే అమైనో ఆమ్లం ఉంటుంది. ఇది మెదడుకు రక్త ప్రసరణను పెంచుతుంది. దీంతో మైగ్రేన్ సంబంధిత నొప్పులు వేధిస్తాయి. కాబట్టి తలనొప్పి ఉన్న వారు నిమ్మరసానికి దూరంగా ఉండాలి.
నోట్: పైన తెలిపిన విషయాలు కేవలం ప్రాథమిక సమాచారం మేరకు మాత్రమే. ఆరోగ్యానికి సంబంధించి వైద్యుల సూచనలు పాటించడమే ఉత్తమం.
మరిన్ని లైఫ్ స్టైల్ వార్తల కోసం క్లిక్ చేయండి..