Black Tea Uses: కొలెస్ట్రాల్‌ను కంట్రోల్ చేసే బ్లాక్ టీ.. డోంట్ మిస్..
బ్లాక్ టీ అంటే ఎంతో మంది ఇష్టంగా తాగుతూ ఉంటారు. బ్లాక్ టీలో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. బ్లాక్ టీని రెగ్యులర్‌గా తాగడం వల్ల అధిక బరువు, బ్యాడ్ కొలెస్ట్రాల్, జీర్ణ సంబంధిత సమస్యలను కంట్రోల్ చేసుకోవచ్చు. బ్లాక్ టీతో చాలా రకలా ఆరోగ్య సమస్యలను కంట్రోల్ చేసుకోవచ్చు. రుచి కోసం ఇందులో తేనె కలుపుకుని తాగితే చాలా బావుంటుంది..
ఉదయం ఒక సిప్ టీ తాగనిదే చాలా మందికి రోజు గడవదు. టీకి ఎన్నో వేల సంవత్సరాల చరిత్ర ఉంది. టీ పొడిలో చాలా వెరైటీలు ఉంటాయి. అలాగే టీలు తయారు చెసే వాటిల్లో కూడా ఎన్నో రకాలు ఉన్నాయి. పాలతో తయారు చేసిన టీలు కొన్ని ఉంటే.. పాలు వేయకుండా తయారు చేసే టీలలో మరిన్ని రకాలు ఉన్నాయి. వాటిల్లో బ్లాక్ టీ ఒకటి. ఇందులో కేవలం టీ పొడి, పంచదార, నీళ్లు మాత్రమే వేసి తయారు చేస్తారు. ఇది తాగడానికి చేదుగా ఉన్నా ఆరోగ్యానికి మాత్రం చాలా మంచిది. చాలా మంది బ్లాక్ టీ తాగేందుకు చాలా ఇష్ట పడుతూ ఉంటారు. దీన్ని సాధారణంగా టీ డికాషన్ అని అంటారు. ప్రపంచ వ్యాప్తంగా ఆదరణ పొందిన టీలలో బ్లాక్ టీ కూడా ఒకటి. బ్లాక్ టీ తాగడం వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. మరి బ్లాక్ టీ తాగడం వల్ల ఎలాంటి ప్రయోజనాలు ఉన్నాయో ఇప్పుడు చూద్దాం.
గట్ ఆరోగ్యం:
బ్లాక్ టీ తాగడం వల్ల గట్ ఆరోగ్యం మెరుగు పడుతుంది. ఇది బరువు తగ్గేందుకు హెల్ప్ చేస్తుంది. బ్లాక్ టీలో గట్ మైక్రోబయోమ్ ఉంటుంది. ఇది శరీర ఆరోగ్యాన్ని కాపాడటంలో, జీవక్రియను మెరుగు పరచడంలో.. గట్ మైక్రోబయోమ్ కీలకంగా పని చేస్తుంది.
వెయిట్ లాస్:
బ్లాక్ టీ తాగడం వల్ల త్వరగా వెయిట్ లాస్ అవుతారు. పాల టీతో పోల్చితే బ్లాక్ టీలో కేలరీలు అనేవి చాలా తక్కువగా ఉంటాయి. అలాగే బ్యాడ్ కొలెస్ట్రాల్‌ను కూడా త్వరగా కరిగిస్తుంది. అలాగే మల బద్ధకం సమస్యను దగ్గరకు రానివ్వకుండా చూస్తుంది. కాబట్టి ఈజీగా వెయిట్ లాస్ అవుతారు. బరువు తగ్గాలి అనుకునేవారు బ్లాక్ టీ తాగితే మంచి ఫలితం ఉంటుంది.
బ్యాడ్ కొలెస్ట్రాల్ కంట్రోల్:
బ్లాక్ టీ తరచూ తీసుకోవడం వల్ల రక్తంలో పేరుకు పోయిన బ్యాడ్ కొలెస్ట్రాల్ అనేది ఈజీగా కరిగిపోతుంది. కొలెస్ట్రాల్ సమస్యతో ఇబ్బంది పడేవారు బ్లాక్ టీ తాగడం మంచిది. దీంతో గుండె సంబంధిత సమస్యలు కూడా రాకుండా ఉంటాయి. గుండె పని తీరు మెరుగు పడుతుంది.
ట్రైగ్లిజరైడ్ స్థాయిలు కంట్రోల్:
బ్లాక్ టీలో ఫ్లేవనాయిడ్స్ ఉంటాయి. వీటిలో యాంటీ ఇన్ ఫ్లమేటరీ గుణాలు పుష్కలంగా ఉంటాయి. ఇవి శరీరంలోని ట్రైగ్లిజరైడ్స్ స్థాయిలను కంట్రోల్ చేస్తాయి. మలినాలు, వ్యర్థ పదార్థాలను బయటకు పంపుతంది. బాడీలో ట్రైగ్లిజరైడ్స్ స్థాయిలు ఎక్కువగా ఉంటే అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది.
(NOTE: ఇంటర్నెట్‌లో సేకరించిన సమాచారం ఆధారంగా ఈ వివరాలు మీకు అందించటం జరిగింది. ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే.)
మరిన్ని లైఫ్ స్టైల్ వార్తల కోసం క్లిక్ చేయండి..