AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Gold jewellery: బంగారు నగలకు ఇంట్లోనే పాలిష్.. ఈ సింపుల్ చిట్కాలు మీకు తెలుసా..

మహిళలు మెడ చేతుల చుట్టూ బంగారు ఆభరణాలను ఎక్కువసేపు ధరించినప్పుడు, అది నల్లగా మారుతుంటాయి. మీ బంగారు ఆభరణాలను పాలిష్ చేయడానికి బంగారం షాపుకు తీసుకెళ్తే, వీటికి మెరుగు పెట్టడానికి వందల రూపాయలు ఖర్చు చేయాల్సి ఉంటుంది. ఈ అవసరం లేకుండానే మీరు ఇంట్లో ఉన్న కొన్ని వస్తువులతో వాటిని మెరిసేలా చేయవచ్చు. దీంతో మీ నగలు కొత్త వాటిలా మెరవడమే కాకుండా అదనంగా ఖర్చు పెట్టాల్సిన అవసరం రానేరాదు.

Gold jewellery: బంగారు నగలకు ఇంట్లోనే పాలిష్.. ఈ సింపుల్ చిట్కాలు మీకు తెలుసా..
Gold Jewelry Cleaning Home
Bhavani
|

Updated on: Mar 29, 2025 | 3:45 PM

Share

మనలో కొందరు పెళ్లిళ్లు, వేడుకల్లో బంగారాన్ని ధరించే ముందు వాటిని పాలిష్ చేసేందుకు స్వర్ణకారుల వద్దకు వెళుతుంటారు. స్వర్ణకారులు తమ నగలలోని బంగారాన్ని తీసివేస్తారేమోనన్న భయంతో కొందరు తమ నగలను దుకాణాల్లో క్లీన్ చేసుకోకుండా అలాగే వాడేస్తుంటారు. కాబట్టి, ఈ ప్రమాదాలన్నింటినీ నివారించడానికి ఇంట్లో మీ బంగారాన్ని పాలిష్ చేయడం మంచిది కాదా.? దీనికి మీ ఇంట్లో ఉన్న ఈ వస్తువులు చాలు. అయితే, ముందుగా బంగారు నగలు ఎందుకు నల్లగా మారుతాయో తెలుసుకోవటం ముఖ్యం. సాధారణంగా, బంగారు ఆభరణాలు శరీరం నుండి విడుదలయ్యే చెమట, ధూళితో తాకినప్పుడు అవి నల్లగా మారుతాయి. ఇదీ కాకుండా, మీ బంగారు ఆభరణాలు మెరుపును కోల్పోవడానికి మరొక కారణం మేకప్. అవును, మీరు ఉపయోగించే పెర్ఫ్యూమ్, మాయిశ్చరైజర్ లేదా సౌందర్య సాధనాలు బంగారు ఆభరణాలను చెడగొడతాయి. ఇది ప్రకాశాన్ని తగ్గిస్తుంది.

మీ పాత బంగారాన్ని మళ్లీ కొత్తదిగా మార్చడానికి ఈ కొన్నిఇంటి చిట్కాలు పాటిస్తే సరిపోతుంది. బంగారాన్ని రోజూ ధరిస్తే, దాని మెరుపు క్రమంగా తగ్గుతుంది. అదేవిధంగా ఇప్పుడు మీ అమ్మమ్మ బంగారు నగలను చూస్తే అవి చాలా పాతవిగా కనిపించడమే కాకుండా మెరుపు కూడా తగ్గిపోయి ఉంటుంది. అయితే, ఇక్కడ ఒక్క విషయం మాత్రం ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా గుర్తించుకోవాలి… ఎందుకంటే.. బంగారం ఎంత పాతదైనా బంగారం మాత్రం బంగారమే. బంగారం ప్రతి ఒక్కరూ ఇష్టపడే విలువైన లోహం. మన దేశంలో మహిళలు బంగారాన్ని ఎక్కువగా ఇష్టపడతారు. కాబట్టి, బంగారాన్ని ఎలా దాచుకోవాలి. ఎలా మెరుగు పెట్టుకోవాలో నేర్చుకోవడం చాలా ముఖ్యం.

బేకింగ్ సోడాతో మెరుపు..

బేకింగ్ సోడాను సాధారణంగా వంటలో ఉపయోగిస్తారు. బేకింగ్ సోడా వంటల్లో మాత్రమే కాదు.. ఇతర వస్తువులను శుభ్రం చేయడానికి కూడా ఉపయోగించవచ్చు. బేకింగ్ సోడాతో నగలను శుభ్రం చేసుకోవచ్చు. ఇందుకోసం మీరు చేయాల్సిందల్లా 2 టేబుల్ స్పూన్ల బేకింగ్ సోడాను గోరువెచ్చని నీటిలో కరిగించి పేస్ట్ తయారు చేసి అందులో మీ నగలను అరగంట నానబెట్టండి. తర్వాత శుభ్రం చేయడానికి స్పాంజితో మెల్లగా రుద్దండి.

నగలను పాలిష్ చేయడానికి

నీరు, పసుపు పొడి, సబ్బు పొడి తీసుకోండి. ఆభరణాన్ని శుభ్రమైన నీటిలో వేసి 2 నిమిషాలు వేడి చేయండి. తరువాత ఒక చెంచా పసుపు పొడి, ఒక చెంచా సబ్బు పొడి వేసి కలపాలి. నీరు వేడెక్కిన తర్వాత, దానిని స్టవ్ మీద నుండి తీసి, నగలను తీసి, వాటి స్థానంలో శుభ్రమైన నీటిని పోయాలి. ఇప్పుడు టూత్ బ్రష్ తో లోపల మరియు వెలుపల స్క్రబ్ చేయండి. దీని తరువాత, దానిని ఒక గుడ్డతో పొడిగా తుడవండి. బంగారు ఆభరణాలు కొత్తవాటిలా మెరుస్తాయి.

మరో సింపుల్ చిట్కా..

ఒక గిన్నెలో గోరువెచ్చని నీరు తీసుకోండి. దానికి డిటర్జెంట్ పౌడర్ లేదా వాషింగ్ లిక్విడ్ వేసి కలపాలి. అందులో నగలు వేసి 15-20 నిమిషాలు నానబెట్టండి. ఇప్పుడు దానిని మంచినీటితో రుద్ది చల్లటి నీటితో కడగాలి. జుట్టు మెరిసేలా చేయడానికి, షాంపూ వేసి, 2 నిమిషాలు అలాగే ఉంచి, తర్వాత శుభ్రం చేసుకోండి.