Chintha Chiguru: ఇందులో ఏముందిలే అని తీసిపారేయకండి.. ఊహించని లాభాలు మీ సొంతం!

గ్రామాల్లో ఎక్కువగా లభించే ఈ చింత చిగురుతో ఎలాంటి వంటలు చేసినా చాలా రుచిగా ఉంటాయి. చింత చిగురుతో వెజ్ లేదా నాన్ వెజ్ వంటలు కూడా తయారు చేసుకోవచ్చు. చింత చిగురు పచ్చడి.. వేడి వేడి అన్నంలో వేసుకుని తింటే ఎంతో కమ్మగా ఉంటుంది. సీజనల్‌గా లభించే ఈ చింత చిగురు తింటే ఎలాంటి ఆరోగ్య లాభాలు ఉన్నాయో చూడండి..

Chintha Chiguru: ఇందులో ఏముందిలే అని తీసిపారేయకండి.. ఊహించని లాభాలు మీ సొంతం!
Chintha Chiguru
Follow us
Chinni Enni

|

Updated on: Nov 07, 2024 | 2:15 PM

చలికాలంలో ఎక్కువగా లభించే వాటిల్లో వాటిల్లో చింత చిగురు కూడా ఒకటి. ఈ వింటర్ సీజన్‌లో చింత చిగురు ఎక్కువగా లభిస్తుంది. చింత చిగురుతో చేసే వంటలు ఎంతో రుచిగా ఉంటాయి. చింత చిగురు పప్పు, చింత చిగురు గుడ్లు, చింత చిగురు చికెన్, మటన్ ఇలా నాన్ వెజ్ మాత్రమే కాదు.. వెజ్‌ వంటలు కూడా చాలా రుచిగా ఉంటాయి. చింత చిగురుతో కేవలం రుచి మాత్రమే కాదు ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. ఇందులో అనేక మంచి పోషకాలు లభిస్తాయి. సీజనల్‌గా లభిస్తుంది కాబట్టి.. తప్పకుండా తినడం చాలా మంచిది. ముఖ్యంగా గ్రామాల్లో చింత చెట్లు ఎక్కువగా ఉంటాయి. దీంతో కోసుకుని తీసుకొచ్చి వండుతూ ఉంటారు. సిటీల్లో ఉండే వారు అయితే కొనుక్కుని వండుతారు. ఇంతకు ముందు చింత చిగురు ఎక్కువగా తీసుకునేవారు. కానీ ప్రస్తుత కాలంలో చాలా వరకు తగ్గించేశారు. చింత చిగురు పుల్లగా ఉంటుంది. కాబట్టి ఏ వంటల్లో వేసి మంచి రుచి వస్తుంది. వేడి వేడి అన్నంలోకి చింత చిగురు పచ్చడి వేసుకుని తింటే ఆహా ఆ రుచే వేరు. మరి చింత చిగురు తినడం వల్ల ఎలాంటి ఆరోగ్య లాభాలు ఉన్నాయో ఇప్పుడు చూద్దాం.

చింత చిగురులోని పోషకాలు:

చింగ చిగురులో శరీరానికి కావాల్సిన పోషకాలు పుష్కలంగా లభిస్తాయి. ఇందులో విటమిన్ సి, యాంటీ ఆక్సిడెంట్లు, ఐరన్, ఫైబర్, ప్రోటీన్, క్యాల్షియం, ఫాప్పరస్, మెగ్నీషియంలు లభిస్తాయి.

బ్యాడ్ కొలెస్ట్రాల్ కంట్రోల్:

చింత చిగురు తినడం వల్ల శరీరంలో పేరుకు పోయిన బ్యాడ్ కొలెస్ట్రాల్‌ని కరిగించి.. మంచి కొలెస్ట్రాల్‌ని పెంచుతుంది. కాబట్టి గుండె సంబంధిత సమస్యలు రాకుండా ఉంటాయి.

ఇవి కూడా చదవండి

రోగ నిరోధక శక్తి పెరుగుతుంది:

చింత చిగురులో యాంటీ ఆక్సిడెంట్లు, యాంటీ ఇన్ ఫ్లమేటరీ గుణాలు, విటమిన్ సి లభిస్తుంది. కాబట్టి శరీరంలో ఇమ్యూనిటీ వ్యవస్థ అనేది పటిష్టంగా మారుతుంది. దీంతో త్వరగా ఇన్ఫెక్షన్స్ అవి రాకుండా ఉంటాయి. రోగాలతో పోరాడే శక్తి కూడా లభిస్తుంది.

రక్త హీనత:

రక్త హీనత సమస్య ఉన్నవారు కూడా చింతచిగురు తినడం వల్ల ఈ సమస్య నుంచి బయట పడొచ్చు. ఎందుకంటే ఇందులో ఐరన్ శాతం ఎక్కువగా లభిస్తుంది. కాబట్టి రక్త హీనతతో బాధపడేవారు చింత చిగురు తిన్నా మంచిదే.

రక్తం శుద్ధి:

చింత చిగురు తినడం వల్ల రక్తం అనేది శుద్ధి అవుతుంది. రక్తంలో, శరీరంలో ఉండే మలినాలు, విష పదార్థాలను బయటకు పంపి.. రక్తాన్ని శుద్ధి చేయడంలో చింత చిగురు చక్కగా పని చేస్తుంది. అలాగే బరువు కూడా తగ్గొచ్చు.

(NOTE: ఇంటర్నెట్‌లో సేకరించిన సమాచారం ఆధారంగా ఈ వివరాలు మీకు అందించటం జరిగింది. ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే.)

మరిన్ని లైఫ్ స్టైల్ వార్తల కోసం క్లిక్ చేయండి.

అందరు చూస్తుండగానే ముక్కలైన మూగ జీవి!
అందరు చూస్తుండగానే ముక్కలైన మూగ జీవి!
రెండో రోజుకు న్యూస్9 గ్లోబల్ సమ్మిట్..
రెండో రోజుకు న్యూస్9 గ్లోబల్ సమ్మిట్..
హీరో ప్రభాస్‌ ఎవరో నాకు తెలియదు.. ఆయనతో ఎలాంటి సంబంధం లేదు
హీరో ప్రభాస్‌ ఎవరో నాకు తెలియదు.. ఆయనతో ఎలాంటి సంబంధం లేదు
శీతాకాలం సూపర్ ఫుడ్‌.! పోషకాలు పుష్కలం తేగలతో ఎన్నో ఆరోగ్య ప్రయోజ
శీతాకాలం సూపర్ ఫుడ్‌.! పోషకాలు పుష్కలం తేగలతో ఎన్నో ఆరోగ్య ప్రయోజ
అల్లు అర్జున్‌పై సెటైరికల్ కామెంట్ ఇది.. విశ్వక్ క్లారిటీ.!
అల్లు అర్జున్‌పై సెటైరికల్ కామెంట్ ఇది.. విశ్వక్ క్లారిటీ.!
అంతరించిపోతున్న ఇండియన్‌ వైల్డ్‌ డాగ్స్..కెమెరాకు చిక్కినదృశ్యాలు
అంతరించిపోతున్న ఇండియన్‌ వైల్డ్‌ డాగ్స్..కెమెరాకు చిక్కినదృశ్యాలు
కన్నడ బిగ్ బాస్‌లోనూ.. ఓవర్‌ యాక్షన్.! ఇక మారవా శోభ షెట్టి.!
కన్నడ బిగ్ బాస్‌లోనూ.. ఓవర్‌ యాక్షన్.! ఇక మారవా శోభ షెట్టి.!
అది.. అదుంటే.. నిందించిన వారికి సమాధానం చెప్పొచ్చు.! సమంత పోస్ట్!
అది.. అదుంటే.. నిందించిన వారికి సమాధానం చెప్పొచ్చు.! సమంత పోస్ట్!
అందవిహీనంగా మారే రోగంతో బాధపడుతున్న హీరోయిన్.! వీడియో..
అందవిహీనంగా మారే రోగంతో బాధపడుతున్న హీరోయిన్.! వీడియో..
వైల్డ్ ఫైర్‌ పుష్ప రాజ్ కి బెస్ట్ విషెస్.. నంద్యాల వైసీపీ Ex-MLA
వైల్డ్ ఫైర్‌ పుష్ప రాజ్ కి బెస్ట్ విషెస్.. నంద్యాల వైసీపీ Ex-MLA