AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Toothpaste: ఇకపై టూత్‌పేస్టులు కొనేటప్పుడు జాగ్రత్త .. క్యాన్సర్ ముప్పు తప్పదు!

ఎప్పుడు ఎటు నుంచి ఎలాంటి అనారోగ్య సమస్యలు ఎటాక్ చేస్తాయో చెప్పలేకపోతున్నాం. అన్నిట్లో కూడా డేంజరస్ రసాయనాలు కలుస్తాయి. ఏది మంచిదో.. ఏది అనారోగ్య సమస్యల్ని తెచ్చిపెడుతుందో చెప్పలేకపోతున్నాం. తాజాగా నిపుణులు చేసిన అధ్యయనాల్లో టూత్‌పేస్టుల వల్ల కూడా నోటి క్యాన్సర్ వస్తుందని తేలింది. మీరు ఉపయోగించే టూత్ పేస్టుల్లో నురగ రావడానికి, సులభంగా బ్రష్ కదలడానికి వీలుగా సోడియం లారిల్ సల్ఫేట్ అనే రసాయనాన్ని..

Toothpaste: ఇకపై టూత్‌పేస్టులు కొనేటప్పుడు జాగ్రత్త .. క్యాన్సర్ ముప్పు తప్పదు!
Toothpast
Chinni Enni
|

Updated on: Apr 17, 2024 | 11:03 AM

Share

ఎప్పుడు ఎటు నుంచి ఎలాంటి అనారోగ్య సమస్యలు ఎటాక్ చేస్తాయో చెప్పలేకపోతున్నాం. అన్నిట్లో కూడా డేంజరస్ రసాయనాలు కలుస్తాయి. ఏది మంచిదో.. ఏది అనారోగ్య సమస్యల్ని తెచ్చిపెడుతుందో చెప్పలేకపోతున్నాం. తాజాగా నిపుణులు చేసిన అధ్యయనాల్లో టూత్‌పేస్టుల వల్ల కూడా నోటి క్యాన్సర్ వస్తుందని తేలింది. మీరు ఉపయోగించే టూత్ పేస్టుల్లో నురగ రావడానికి, సులభంగా బ్రష్ కదలడానికి వీలుగా సోడియం లారిల్ సల్ఫేట్ అనే రసాయనాన్ని కలుపుతారు. అలాగే మరికొన్ని టూత్ పేస్టుల్లో డైతనోలమైన అనే కెమికల్ కూడా కనిపిస్తుంది. దీని వల్ల హార్మోన్లు అసమతుల్యతకు, కిడ్నీ, లివర్ వ్యాధులకు, ఊబకాయానికి, క్యాన్సర్‌కు కారణం అవుతుంది.

భయంకరమైన డోతనోలమైన్ కెమికల్:

టూత్ పేస్ట్‌‌లో నురగ వచ్చేలా చేయడానికి డి, ఈ, ఏ అనే రసాయనాన్ని ఉపయోగిస్తున్నారు. ఇవి ఆరోగ్యానిక ఎంతో ప్రమాదకరమని ఆరోగ్య నిపునులు చెబుతున్నారు. అలాగే శాస్త్రవేత్తల పరిశోధనల్లో డైతనోలమైన్ అనే రసాయనం క్యాన్సర్ కారకంగా గుర్తించారు. కాబట్టి టూత్ పేస్టులు కొనేటప్పుడు జాగ్రత్తలు వహించాలి.

రంగులను చూసి తీసుకోండి:

సాధారణంగా టూత్‌ పేస్టుల వాడకం బట్టి రంగులు ఉంటాయి. ఎరుపు, ఆకు పచ్చ, నలుపు, నీలం వంటి రంగుల కొలతలు ఉంటాయి. వీటిని బట్టి టూత్ పేస్టులు తీసుకోవాలి. ఎరుపు రంగు టూత్ పేస్టులు.. రసాయనికంగా కొద్దిగా మిళితమై ఉంటాయి. ఆకు పచ్చ రంగు టూత్ పేస్టులు సహజ సిద్ధమైనవి. ఇక నీలం రంగు టూత్ పేస్టులు కొంత నేచురల్, మరికొంత రసాయనాలు కలిపి ఉంటాయి. బ్లాక్ మార్క్ ఉన్న టూత్ పేస్టులు మాత్రం పూర్తిగా రసాయనాలతో కలిపి ఉంటాయి. కాబట్టి వీటిని అస్సలు తీసుకోండి.

ఇవి కూడా చదవండి

సహజ సిద్ధంగా తయారైన టూత్ పేస్టులు కొనుగోలు చేసేందుకు ట్రై చేయండి. నలుపు మార్క్ ఉన్న టూత్ పేస్టులు తీసుకోకపోవడమే బెటర్. వీటి వల్ల క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది. ప్రతీ ఒక్కరూ టూత్ పేస్టులు కొనే ముందు కాస్త జాగ్రత్తలు వహించి తీసుకోవడం బెటర్.

(NOTE: ఇంటర్నెట్‌లో సేకరించిన సమాచారం ఆధారంగా ఈ వివరాలు మీకు అందించటం జరిగింది. ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. తదుపరి జరిగే ఎలాంటి పరిణామాలకు TV9 Telugu.com బాధ్యత వహించదు.)

మరిన్ని లైఫ్ స్టైల్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..