Bathing: నీటిలో దీన్ని కలిపి తలస్నానం చేస్తే ఆ సమస్యలన్నీ మటుమాయం.. అదేంటో తెలుసుకోండి..

టిలో ఉప్పు వేసి స్నానం చేయడం వల్ల అనేక సమస్యలు తొలగిపోతాయన్న విషయం మీకు తెలుసా..? తెలియకపోతే తెలుసుకోవాలని ఆయుర్వేద నిపుణులు సూచిస్తున్నారు.

Bathing: నీటిలో దీన్ని కలిపి తలస్నానం చేస్తే ఆ సమస్యలన్నీ మటుమాయం.. అదేంటో తెలుసుకోండి..
Bathing
Follow us

|

Updated on: Jul 07, 2022 | 9:45 PM

Bathing with Salt Water Benefits: వర్షాకాలం ప్రారంభం అయింది. వాతావరణంలో మార్పుల కారణంగా ఆరోగ్యం దృష్టిసారించాలని నిపుణులు సూచిస్తున్నారు. సాధారణంగా చాలా మంది వేడి లేదా చల్లటి నీటితో స్నానం చేస్తారు. అయితే నీటిలో ఉప్పు వేసి స్నానం చేయడం వల్ల అనేక సమస్యలు తొలగిపోతాయన్న విషయం మీకు తెలుసా..? తెలియకపోతే తెలుసుకోవాలని ఆయుర్వేద నిపుణులు సూచిస్తున్నారు. ఉప్పునీటితో స్నానం చేయడం వల్ల కీళ్ల నొప్పులు దూరమవడంతోపాటు ఒత్తిడి తగ్గుతుంది. అంతే కాకుండా ఉప్పు నీళ్లతో స్నానం చేయడం వల్ల ఎలాంటి లాభాలు కలుగుతాయో తెలుసుకుందాం.

కీళ్ల నొప్పులు దూరమవుతాయి: ఉప్పునీరు కీళ్ల నొప్పులను తగ్గిస్తుంది. తలస్నానం చేసేటప్పుడు ఆ నీళ్లలో చిటికెడు ఉప్పు కలిపి స్నానం చేస్తే చిన్నపాటి శరీర నొప్పులు తగ్గిపోతాయి. ఇది కాకుండా పాదాలలో నొప్పి ఉంటే.. పాదాలను గోరువెచ్చని ఉప్పు నీటితో కడుక్కోవడం వల్ల కూడా ప్రయోజనం చేకూరుతుంది.

ఇన్ఫెక్షన్ ప్రమాదం తగ్గుతుంది : ఎలాంటి ఇన్ఫెక్షన్ అయినా తొలగించడానికి ఉప్పునీరు చాలా ఉపయోగపడుతుంది. వాస్తవానికి ఉప్పులో ఉండే మినరల్స్ అనేక రకాల ఇన్ఫెక్షన్ల నుంచి రక్షిస్తాయి. ఉప్పు నీటితో స్నానం చేయడం వల్ల శరీరంలోని అన్ని రంధ్రాలు తెరుచుకుంటాయి. దీంతో శరీరంలో ఇన్ఫెక్షన్ వచ్చే ప్రమాదాన్ని తగ్గిస్తుంది.

ఇవి కూడా చదవండి

మొటిమలు : మొహంపై మొటిమలను వదిలించుకోవడానికి ఉప్పునీరు కూడా చాలా ఉపయోగకరంగా ఉంటుంది. ఉప్పు నీటితో స్నానం చేయడం వల్ల శ్వేత రంద్రాలు తెరుచుకుంటాయి. ఆ తర్వాత శరీరంలోని మురికి సులభంగా బయటకు వస్తుంది. ఇలా చేస్తే బాడీ డిటాక్స్ వల్ల ముఖంపై మచ్చలు, మొటిమలు కూడా తగ్గుతాయి. అలాగే, ఈ నీరు చర్మాన్ని హైడ్రేట్ చేయడంలో చాలా మేలు చేస్తుంది.

ఒత్తిడి తక్కువ అవుతుంది: ఏదైనా విషయంలో ఎక్కువ ఒత్తిడికి గురవుతుంటే, ఖచ్చితంగా ఉప్పు నీటితో స్నానం చేయాలి. దీని నుంచి ఖచ్చితంగా ప్రయోజనం పొందుతారు. ఉప్పు నీటిలో ఉండే మినరల్స్ శరీరంలో శోషించబడతాయి. సోడియం మెదడుపై కూడా ప్రభావం చూపుతుందని పేర్కొంటారు. ఇది కాకుండా శరీరం డిటాక్స్ చేసినప్పుడు శరీరం నుంచి ఒత్తిడి కూడా విడుదల అవుతుంది. ఇది మెదడుపై ప్రత్యక్ష ప్రభావాన్ని చూపుతుంది. ఈ నీటితో స్నానం మంచి అనుభూతి చెందుతారు.

(నోట్‌: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. ఆరోగ్య నిపుణుల సలహాల మేరకు అందించడం జరుగుతుంది. ఏదైనా సందేహాలు ఉంటే వైద్య నిపుణులను సంప్రదించండి.)

హెల్త్ వార్తల కోసం