Health: పిల్లల ముందు అస్సలు అలా చేయకండి.. వాళ్లన్నీ గమనిస్తారు.. అలవాటు మార్చుకోకుంటే ఇక అంతే
చిన్నపిల్లల(Children) పట్ల తల్లితండ్రులు ఎంతో శ్రద్ధ తీసుకుంటారు. చిన్నారి పుట్టినప్పటి నుంచి పెద్దయ్యేవరకు ప్రతి క్షణం అప్రమత్తంగా ఉంటారు. తల్లిదండ్రులు తమ బిడ్డకు మంచి పోషకాహారం అందించేందుకు వారికి రక్షణ కల్పించేందుకు ప్రతిక్షణం...
చిన్నపిల్లల(Children) పట్ల తల్లితండ్రులు ఎంతో శ్రద్ధ తీసుకుంటారు. చిన్నారి పుట్టినప్పటి నుంచి పెద్దయ్యేవరకు ప్రతి క్షణం అప్రమత్తంగా ఉంటారు. తల్లిదండ్రులు తమ బిడ్డకు మంచి పోషకాహారం అందించేందుకు వారికి రక్షణ కల్పించేందుకు ప్రతిక్షణం తమ జీవితాన్ని ధారబోస్తారు. అయినప్పటికీ కొంతమంది తల్లిదండ్రులు తమ పిల్లలను పెంచడంలో కొన్ని తప్పులు చేస్తారు. అవి కొన్నిసార్లు తీవ్రమై చిన్నారులపై దుష్ప్రభావం పడే అవకాశానికి దారి తీస్తుంది. అయితే పిల్లలకు 2 సంవత్సరాల వయస్సు వచ్చినప్పుడు, వారు తమ తల్లిదండ్రుల (Parents) ప్రతి కదలికలను గమనిస్తారు. అంతే కాకుండా వాటిని చేసేందుకు ప్రయత్నిస్తారు. తల్లిదండ్రులు ఏదైనా తప్పు చేస్తే వాళ్లు కూడా అదే చెడు అలవాటును అలవర్చుకుంటారు. నిపుణుల అభిప్రాయం ప్రకారం తల్లిదండ్రులు పిల్లల ముందు ఓంతో సాధారణంగా, ప్రేమగా ఉండాలని చెబుతున్నారు. తల్లితండ్రుల మధ్య గొడవలు వస్తే పిల్లల ముందు ఒకరినొకరు దూషించుకోకూడదు. మీరు వాడే అసభ్య పదాలకు వాళ్లూ నేర్చుకునే ప్రమాదం ఉంది.
కొంతమంది తల్లిదండ్రులు కోపంతో వస్తువులను విసిరే అలవాటు కలిగి ఉంటారు. మీ ఈ అలవాటు మీకే కాదు మీ బిడ్డకు కూడా హాని కలిగిస్తుంది. ఎప్పుడూ అలాంటి వైఖరిని అవలంబించవద్దు. అంతే కాకుండా పిల్లల ముందు ఈ తప్పును చేయవద్దు. మిమ్మల్ని చూసినప్పుడు, మీ పిల్లవాడు సాధారణ పరిస్థితిలో కూడా ఖరీదైన వస్తువులను విసిరేసే ప్రమాదం ఉంది. కాబట్టి పిల్లల ముందు నవ్వుతూ, హాయిగా, సంతోషంగా ఉండాలని నిపుణులు చెబుతున్నారు. తద్వారా పిల్లల్లో మంచి ఆలోచనలు పెరిగి, సమాజంలో అభివృద్ధి వైపు అడుగులు వేసే విధంగా తయారు చేయవచ్చని సూచిస్తున్నారు.
నోట్.. ఇందులో పేర్కొన్న విషయాలు కేవలం అవగాహన కోసం మాత్రమే.. వీటిని పాటించే ముందు నిపుణుల సూచనలు తీసుకోవడం మంచిది.