AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Kitchen Hacks: బేకింగ్ సోడా, బేకింగ్ పౌడర్ మధ్య తేడా ఏమిటి? వీటిని ఎలా ఉపయోగించాలో తెలుసా

మన వంటగదిలో వివిధ రకాల వంట పదార్థాలు ఉంటాయి. వాటిల్లో కొన్ని చూడడానికి ఒకేలా కనిపిస్తాయి. అంతేకాదు కొన్ని వస్తువుల పేర్లు దగ్గరదగ్గరగా ఉంటాయి. అటువంటి వస్తువుల్లో బేకింగ్ సోడా, బేకింగ్ పౌడర్ ఒకటి. ఈ రెండిటిని చూస్తే చాలా దగ్గర పోలికలు ఉంటాయి. కనుక వీటిని గుర్తు పట్టడంలో కొంచెం అయోమయంలో పడిన వ్యక్తులు తప్పుగా ఉపయోగిస్తారు కూడా.. అయితే ఈ రోజు బేకింగ్ సోడా, బేకింగ్ పౌందర్ మధ్య తేడాను ఎలా గుర్తించాలి? వాటిని ఎప్పుడు ఉపయోగించాలి తెలుసుకుందాం..

Kitchen Hacks: బేకింగ్ సోడా, బేకింగ్ పౌడర్ మధ్య తేడా ఏమిటి?  వీటిని ఎలా ఉపయోగించాలో తెలుసా
Baking Soda Vs Baking Powd
Surya Kala
|

Updated on: Sep 23, 2025 | 12:16 PM

Share

వంట గదిలో ఉండే బేకింగ్ సోడా, బేకింగ్ పౌడర్ అనేవి చాలా దగ్గర పోలిక ఉండే రెండు పదార్థాలు. ఇవి ఒకే విధమైన రంగు, ఆకృతి, రుచిని కలిగి ఉంటాయి. శనగలు, రాజ్మా వంటి పప్పుల ను వండడానికి చాలా మంది బేకింగ్ సోడాను ఉపయోగిస్తారు. అయితే కొన్నిసార్లు ప్రజలు గందరగోళానికి గురవుతారు. అప్పుడు బేకింగ్ సోడాకు బదులుగా బేకింగ్ పౌడర్‌ను ఉపయోగిస్తారు.

బేకింగ్ సోడా లేదా బేకింగ్ పౌడర్‌ను తప్పుగా వంటకాల్లో వేయడం వలన ఆహార రుచి చెడిపోతుంది. ఈ నేపధ్యంలో బేకింగ్ సోడా, బేకింగ్ పౌడర్ కి మధ్య తేడా తెలియక ఇబ్బంది పడుతుంటే ఈ రోజు ఆ గందరగోళం నుంచి బయటపడేలా బేకింగ్ సోడా , బేకింగ్ పౌడర్ మధ్య వ్యత్యాసాన్ని.. దేనిని ఎప్పుడు ఉపయోగించాలి? ఏయే ప్రయోజనాలను కలిగి ఉంది తెలుసుకుందాం..

బేకింగ్ సోడా ఎలా ఉంటుందంటే?

హెల్త్‌లైన్ ప్రకారం బేకింగ్ సోడా శాస్త్రీయ నామం సోడియం బైకార్బోనేట్. ఇది ఆల్కలీన్ రుచి కలిగిన తెల్లటి, స్ఫటికాకార పొడి. పుల్లని దానితో కలిపినప్పుడు బేకింగ్ సోడా సక్రియం అవుతుంది. అప్పుడు కార్బన్ డయాక్సైడ్‌ను విడుదల చేస్తుంది. ఇది వస్తువులను మృదువుగా చేస్తుంది, ఉబ్బిపోయేలా చేస్తుంది. అందువల్ల బేకింగ్ సోడాను ఉపయోగించే ఏదైనా వంటకానికి నిమ్మరసం లేదా మజ్జిగ జతచేస్తారు.

ఇవి కూడా చదవండి

బేకింగ్ పౌడర్‌ని ఏమంటారు?

బేకింగ్ సోడాను కేవలం వస్తువులను పులియబెట్టడానికి మాత్రమే ఉపయోగిస్తారు. బేకింగ్ పౌడర్‌లో సోడియం బైకార్బోనేట్ , యాసిడ్ ఉంటాయి. ఇది పిండి పులియడానికి సహాయపడుతుంది. కార్న్‌స్టార్చ్ కొన్నిసార్లు బేకింగ్ పౌడర్‌లో కూడా కనిపిస్తుంది.

బేకింగ్ పౌడర్‌లో రెండు రకాలు ఉన్నాయి

ఈ బేకింగ్ పౌడర్ లో సింగిల్-యాక్టింగ్ , డబుల్-యాక్టింగ్ అనే రెండు రకాలున్నాయి. సింగిల్-యాక్టింగ్ బేకింగ్ పౌడర్‌ను ఆహార తయారీలో ఉపయోగిస్తారు. డబుల్-యాక్టింగ్ బేకింగ్ పౌడర్‌ను ఎక్కువగా బేకరీ ఐటమ్స్ తయారీలో ఉపయోగిస్తారు. అంటే దీనిని సాధారణంగా కేకులు, కుకీలు, బ్రెడ్‌ తయారీల్లో ఉపయోగిస్తారు.

బేకింగ్ పౌడర్, బేకింగ్ సోడా మధ్య తేడా ఏమిటి?

రెండింటి మధ్య గణనీయమైన తేడాలు ఉన్నాయి. బేకింగ్ సోడాలో సోడియం బైకార్బోనేట్ మాత్రమే ఉపయోగించబడుతుంది. అయితే బేకింగ్ పౌడర్‌లో సోడియం బైకార్బోనేట్, క్రీమ్ ఆఫ్ టార్టార్, కార్న్‌స్టార్చ్ అనే మూడు పదార్థాలు ఉపయోగించబడతాయి. ఈ రెండింటినీ వేర్వేరు వంటకాల్లో ఉపయోగిస్తారు. ఉత్తమ ఫలితాల కోసం బేకింగ్ సోడాను పుల్లని పదార్థంతో కలుపుతారు. అయితే బేకింగ్ పౌడర్‌ను ఉపయోగించాలంటే ఎటువంటి వస్తువులను అదనంగా ఉపయోగించాల్సిన అవసరం లేదు.

బేకింగ్ సోడాను ఎక్కువగా వాడటం వల్ల ఆహార రుచి చెడిపోతుంది. మరోవైపు, బేకింగ్ పౌడర్ ఆహారం రుచిలో పెద్దగా తేడాను కలిగించదు. ఆకృతి పరంగా చూస్తే బేకింగ్ పౌడర్ మెత్తగా, మృదువుగా ఉంటుంది.. అంటే పౌడర్ లాగా. మరోవైపు బేకింగ్ సోడాని పరిశీలిస్తే.. ఇది ఉప్పు లాగా ముతకగా ఉంటుంది. బేకింగ్ పౌడర్‌ను శనగలు, చిక్కుళ్ళు, రాజ్మా వంటి అనేక వంటకాల తయారీలో ఉపయోగిస్తారు. బేకింగ్ పౌడర్‌ను కేకులు, కుకీలు, బ్రెడ్ తయారీలో ఉపయోగిస్తారు.

మరిన్ని లైఫ్ స్టైల్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..

(NOTE: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణులు అందించిన సమాచారం ప్రకారం ఇక్కడ తెలియజేయడమైనది. ఆరోగ్యరీత్యా ఎలాంటి సమస్యలు ఉన్నానేరుగా వైద్య నిపుణులను సంప్రదించడం మంచిది)