AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Numerology: ఈ తేదీల్లో పుట్టిన యువతులను పెళ్లి చేసుకుంటే.. లైఫ్ ని హ్యాపీగా గడిపేస్తారట

జ్యోతిష్య శాస్త్రానికి ఎంత ప్రాముఖ్యత ఉందో.. న్యూమరాలజీకి కూడా అంతే ప్రాముఖ్యత ఉంది. దీని ద్వారా మనిషికి సంబంధించిన అనేక విషయాలను తెలుసుకోవచ్చు. మూల సంఖ్య ద్వారా మనుషుల ప్రవర్తన, వ్యక్తిత్వం, అనుకూల, ప్రతికూల అనేక విషయాలను తెలుసుకోవచ్చు. అదే విధంగా సంఖ్యాశాస్త్రం ప్రకారం యువత తమకు కాబోయే జీవిత భాగస్వామి గురించి ముందుగానే తెలుసుకోవచ్చు. కొన్ని ప్రత్యేక తేదీల్లో పుట్టిన అమ్మాయిలను పెళ్లి చేసుకుంటే.. జీవితంలో సుఖ సంతోషాలు, సంపద లభిస్తుందని పేర్కొంది.

Numerology:  ఈ తేదీల్లో పుట్టిన యువతులను పెళ్లి చేసుకుంటే.. లైఫ్ ని హ్యాపీగా గడిపేస్తారట
Numerology Facts
Surya Kala
|

Updated on: Sep 23, 2025 | 9:14 AM

Share

న్యూమరాలజీ ప్రకారం కొన్ని ప్రత్యేక తేదీల్లో జన్మించిన యువతులను పెళ్లి చేసుకోవడం వలన వైవాహిక జీవితం నిండునూరేళ్లు సుఖ సంతోషాలతో సాగుతుందని నమ్మకం. ఈ తేదీల్లో పుట్టిన అమ్మాయిలను పెళ్లి చేసుకుంటే.. సంపదకు లోటు ఉందని విశ్వాసం. అందుకనే సంఖ్యా శాస్త్రం ప్రకారం ఈ మూల సంఖ్యలో పుట్టిన యువతులను పెళ్లి చేసుకున్న యువకుల జీవితం చాలా శుభప్రదమని నిపుణులు చెబుతున్నారు. కనుక ఈ మూల సంఖ్య ఉన్న యుతులను పెళ్లి చేసుకుంటే జీవితంలో సమస్యలు తొలగిపోతాయట. అంతే కాదు జీవితాంతం ప్రశాంతగా ఉంటారు. ఆర్థికపరమైన ఇబ్బందుల నుంచి విముక్తి లభిస్తుంది.

సంఖ్యాశాస్త్రం ప్రకారం మూల సంఖ్య రెండు ఉన్న యువతులను పెళ్లి చేసుకుంటే అబ్బాయిలు నక్క తోక తోక్కినట్లే.. అంటే ఏ నెలలోనైనా 2, 11, 20 20తో పాటు 29 తేదీల్లో పుట్టిన యువతుల మూల సంఖ్య 2. కనుక ఈ తేదీల్లో పుట్టిన అమ్మాయిలు జీవితంలో ఉత్తమ భాగస్వాములని న్యూమరాలజీ నిపుణులు చెబుతున్నారు. వీరిని పెళ్లి చేసుకోవడం వల్ల జీవితంలో ప్రశాంతత, అదృష్టం, సంపద లభిస్తాయని పేర్కొన్నారు. అది ఒక నమ్మకం మాత్రమే.. ఖచ్చితమైన శాస్త్రీయ ఆధారం లేదు.

మూల సంఖ్య 2కి అధిపతి చంద్రుడు. ఈ మూల సంఖ్యని పాలిస్తాడు. కనుక ఈ యువతిని పెళ్లి చేసుకున్న యువకుడి వైవాహిక జీవితం చాలా అద్భుతంగా సాగుతుందట. అంతేకాదు అప్పటి వరకూ ఉన్న సమస్యల నుంచి కూడా ఉపశమనం లభిస్తుందట. చంద్రుడు వంటి ప్రశాంతమైన నేచర్ ని కలిగి ఉంటారు. జీవితాన్ని ప్రశాంతంగా గడిపడానికి ఇష్టపడతారు.

ఇవి కూడా చదవండి

అంతేకాదు వీరు ఎటువంటి కష్టాలు ఎదురైనా ప్రశాంతంగా జీవిస్తారు. ఉన్నత స్థాయికి ఎదుగడానికి ప్రయత్నం చేస్తారు. ముఖ్యంగా ఈ మూల సంఖ్య 2 ఉన్న యువతులు ఎవరినైనా ప్రేమిస్తే తమ భాగస్వామిని వదిలిపెట్టరని సంఖ్యాశాస్త్రం చెబుతోంది. కష్ట సమయాల్లో కూడా అండగా నిలబడతారు. తమ ప్రతిభతో అద్భుతంగా పని చేసి సమాజంలో కుటుంబంలో పేరు ప్రతిష్టలను సంపాదించుకుంటారు. వీరికి ఉత్తమ జంటగా యువకులు 1, 3, లేదా 5 పుట్టిన తేదీలు కలిగిన పురుషులు సరిపోతారట.

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

నోట్ : ఈ వార్తలలో ఇవ్వబడిన సమాచారం మత విశ్వాసాలపై ఆధారపడి ఉంది. పాఠకుల ఆసక్తి మేరకు.. పలువురు పండితుల సూచనలు, వారి తెలిపిన అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే.. వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవని పాఠకులు గమనించాలి. టీవీ9 తెలుగు దీనిని ధృవీకరించలేదు

బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం
వామ్మో.. కరోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్
వామ్మో.. కరోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
కారు స్టార్ట్‌ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్‌ చేసిన డ్రైవర్‌ షాక
కారు స్టార్ట్‌ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్‌ చేసిన డ్రైవర్‌ షాక
వేలల్లో పెట్టుబడి.. లక్షల్లో లాభాలు..! బిజినెస్ ఐడియా మీకోసం
వేలల్లో పెట్టుబడి.. లక్షల్లో లాభాలు..! బిజినెస్ ఐడియా మీకోసం
ఖతర్నాక్‌ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..
ఖతర్నాక్‌ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..
చిన్న పురుగే కానీ.. ప్రాణాలు తీస్తుంది! ఈ లక్షణాలు యమడేంజర్..
చిన్న పురుగే కానీ.. ప్రాణాలు తీస్తుంది! ఈ లక్షణాలు యమడేంజర్..
వైభవ్ సూర్యవంశీ బీభత్సం.! 7 ఫోర్లు, 7 సిక్సర్లతో సెంచరీ
వైభవ్ సూర్యవంశీ బీభత్సం.! 7 ఫోర్లు, 7 సిక్సర్లతో సెంచరీ
డ్రైవర్‌పై కోపంతో బస్సుకు నిప్పంటించిన క్లీనర్
డ్రైవర్‌పై కోపంతో బస్సుకు నిప్పంటించిన క్లీనర్
తల్లిపై కూతురు పోటీ.. ఆసక్తిగా మారిన పంచాయతీ పోరు..
తల్లిపై కూతురు పోటీ.. ఆసక్తిగా మారిన పంచాయతీ పోరు..