ఇవి పిచ్చి ఆకులు కాదు దివ్యౌషధం.. రోజూ తింటే డయాబెటిస్‌కు ఛూమంత్రం వేసినట్లే.. దెబ్బకు రోగం పరార్

మారేడు ఆకులు (బిల్వపత్రం) మధుమేహ నియంత్రణలో అద్భుతమైన ప్రయోజనాలను కలిగి ఉంటాయి. రక్తంలో చక్కెర స్థాయిలను తగ్గించడంలో, రోగ నిరోధక శక్తిని పెంచడంలో, గుండె ఆరోగ్యాన్ని కాపాడటంలో, చర్మ సమస్యలను తగ్గించడంలో ఇవి సహాయపడతాయి. ఆయుర్వేదంలో దీనిని ఎక్కువగా ఉపయోగిస్తారు. కానీ, దీనిని సరైన విధంగా ఉపయోగించడం ముఖ్యం.

ఇవి పిచ్చి ఆకులు కాదు దివ్యౌషధం.. రోజూ తింటే డయాబెటిస్‌కు ఛూమంత్రం వేసినట్లే.. దెబ్బకు రోగం పరార్
Bilva Patra
Follow us
Shaik Madar Saheb

|

Updated on: Oct 24, 2024 | 2:41 PM

ప్రపంచవ్యాప్తంగా డయాబెటిస్ (మధుమేహం) బాధితుల సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది.. అందుకే.. ఆరోగ్యాన్ని కాపాడుకునేందుకు ఇప్పటి నుంచే చర్యలు తీసుకోవడం ఉత్తమం.. ఈ రోజుల్లో చాలా మంది అనారోగ్యకరమైన జీవనశైలి, చెడు ఆహారం కారణంగా మధుమేహం వంటి ప్రమాదకరమైన వ్యాధుల బారిన పడుతున్నారు. అలాంటి వ్యాధులకు దివ్యౌషధం మారేడు ఆకు (బిల్వపత్రం).. దీనిని పూజలో ఉపయోగిస్తారు.. అంతేకాకుండా ఆయుర్వేద వైద్యంలో కూడా ఎక్కువగా ఉపయోగిస్తారు. మధుమేహం – కొలెస్ట్రాల్ తగ్గించడానికి దీనిని తినవచ్చు. బిల్వపత్రాన్ని డైలీ తీసుకోవడం వల్ల అనేక రకాల వ్యాధులు నయమవుతాయి.

బిల్వపత్రంను మారేడు అంటారు. ఇది నీటిని శుద్ధి చేస్తుంది. కీళ్ల సంబంధవ్యాధులను, విరేచనాలను తగ్గిస్తుంది. రోగనిరోధకశక్తిని పెంచుతుంది. జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది.. శరీర దుర్వాసనను, డయాబెటిస్ ను తగ్గిస్తుంది. అందుకే.. అనేక ఔషధాల తయారీలో మారేడును ఉపయోగిస్తారు.

పూజలో ఉపయోగించే బిల్వపత్రంను తీసుకోవడం వల్ల మధుమేహం కొలెస్ట్రాల్‌ని నియంత్రించవచ్చని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు. బిల్వపత్రం వల్ల కలిగే లాభాలు – దానిని సరైన పద్ధతిలో తీసుకోవడం గురించి ఇప్పుడు తెలుసుకోండి..

మధుమేహంలో మేలు చేస్తుంది..

మధుమేహంలో బిల్వపత్రం చాలా మేలు చేస్తుంది. బిల్వపత్రం (మారేడు) కషాయాలను తాగడం ద్వారా లేదా నమలడం ద్వారా రక్తంలో చక్కెర స్థాయిలు అదుపులో ఉంటాయి. ఇంకా ఇది శరీరంలో రోగనిరోధక శక్తిని పెంచుతుంది.

గుండె సమస్యలు..

ఈరోజుల్లో చాలా మంది గుండె సంబంధిత సమస్యలతో బాధపడుతున్నారు. అలాంటివారికి బిల్వపత్రం చాలా మంచిది.. మారేడు తీసుకోవడం వల్ల రక్తపోటు, కొలెస్ట్రాల్ అదుపులో ఉంటుంది.

చర్మ సమస్యలు దూరం..

మారేడు చర్మానికి చాలా మేలు చేస్తుంది.. వాస్తవానికి మారేడు యాంటీఆక్సిడెంట్ లక్షణాలను కలిగి ఉంటుంది.. ఇవి చర్మ సమస్యలను దూరం చేసి ఆరోగ్యంగా ఉంచుతాయి.. మారేడు తీసుకోవడం వల్ల చర్మం మంట తగ్గుతుంది – ఇంకా మొటిమలను నయం చేస్తుంది.

(నోట్‌: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణుల సలహాలు, సూచనల మేరకు అందించడం జరిగింది. ఏవైనా సందేహాలు ఉంటే నిపుణులను సంప్రదించాలని సూచిస్తున్నాము.)

మరిన్ని హెల్త్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి