AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Asafoetida: కూరల్లో దీనిని చిటికెడు కలిపి తింటే చాలు.. రుచితో పాటు జీర్ణ సమస్య నుంచి ఉపశమనం.. మరిన్ని ఆరోగ్య ప్రయోజనాలు..

కడుపులో గ్యాస్, జీర్ణక్రియ సంబంధిత సమస్యలను తగ్గించడానికి ఇంగువను ఉపయోగిస్తారు. అనేక రకాల పోషకాలు, యాంటీ ఆక్సిడెంట్లు ఇందులో ఉన్నాయి. ఇంగువ ఆరోగ్యానికి మేలు చేస్తుంది. పప్పులు, ముద్దకూరలు, రోటి పచ్చళ్ళు, పులిహోర వంటి వాటిల్లో కేవలం చిటికెడు ఇంగువను కలుపుతారు. ఇలా చేయడం వలన రుచికి రుచి ఆరోగ్యానికి ఆరోగ్యాన్ని ఇస్తుంది. ఇంగువ ఆరోగ్యానికి మేలు చేస్తుంది.

Asafoetida: కూరల్లో దీనిని చిటికెడు కలిపి తింటే చాలు.. రుచితో పాటు జీర్ణ సమస్య నుంచి ఉపశమనం.. మరిన్ని ఆరోగ్య ప్రయోజనాలు..
Hing Health Benefits
Surya Kala
|

Updated on: Sep 24, 2024 | 6:07 PM

Share

కూరలు తయారుచేసే సమయంలో రుచికరంగా ఉండడం కోసం రకరకాల మసాలా దినుసులు కలుపుతారు. ఇలా చేయడం వలన కూర రుచి రెట్టింపు అవుతుంది. అదే విధంగా కొన్ని రకాల కూరల్లో, పులిహోర వంటి వాటిల్లో ఇంగువ కూడా చేరుస్తారు. ఇంగువ సువాసన, ఔషధ గుణాలకు ప్రసిద్ధి చెందింది. మన దేశంలో చాలా మంది ఇంగువను కూరలు వండే సమయంలో రుచి కోసం ఉపయోగిస్తారు. ఇంకొందరు ఇంగువను చట్నీ వంటి వాటికి అదనపు రుచి కోసం పోపు దినుసుల్లో వేసుకుని తినడానికి ఇష్టపడతారు.

కడుపులో గ్యాస్, జీర్ణక్రియ సంబంధిత సమస్యలను తగ్గించడానికి ఇంగువను ఉపయోగిస్తారు. అనేక రకాల పోషకాలు, యాంటీ ఆక్సిడెంట్లు ఇందులో ఉన్నాయి. ఇంగువ ఆరోగ్యానికి మేలు చేస్తుంది. పప్పులు, ముద్దకూరలు, రోటి పచ్చళ్ళు, పులిహోర వంటి వాటిల్లో కేవలం చిటికెడు ఇంగువను కలుపుతారు. ఇలా చేయడం వలన రుచికి రుచి ఆరోగ్యానికి ఆరోగ్యాన్ని ఇస్తుంది. ఇంగువ ఆరోగ్యానికి మేలు చేస్తుంది.

జీర్ణక్రియకు ప్రయోజనకరం

ఆహారంలో చిటికెడు ఇంగువ జోడించడం జీర్ణక్రియకు ప్రయోజనకరంగా ఉంటుంది. దీంతో అజీర్ణం, పుల్లటి త్రేనుపు, కడుపునొప్పి, అజీర్తి వంటి సమస్యల నుంచి ఉపశమనం పొందవచ్చు. అయితే చిటికెడు ఇంగువ మాత్రమే వేయాలని గుర్తుంచుకోండి. ఎందుకంటే దీనిని ఎక్కువగా వినియోగించడం ఆరోగ్యానికి హానికలిగిస్తుంది.

ఇవి కూడా చదవండి

కడుపునొప్పి సమస్యలో ఇంగువ కూడా ప్రయోజనకరంగా ఉంటుంది. అటువంటి పరిస్థితిలో కడుపు నొప్పి సమస్యను వదిలించుకోవడానికి ఇది సహాయపడుతుంది. నూనె, మసాలాలు ఎక్కువగా ఉన్న ఆహారం తినడం వల్ల అజీర్తి వల్ల కడుపునొప్పి వస్తే గోరువెచ్చని నీళ్లలో వేయించి ఇంగువను లేదా ఇంగువ పొడిని కలుపుకుని తాగవచ్చు. కావాలంటే ఉప్పు కూడా వేసుకోవచ్చు.

ఆహారం రుచిని మెరుగుపరచడానికి ఇంగువను అనేక విధాలుగా ఉపయోగించవచ్చు. దీని కోసం తడ్కా ఇంగువను ఉపయోగించవచ్చు. అంతేకాదు ఇంగువ పొడిని సిద్ధం చేసి పప్పులు లేదా కూరగాయలలో కలపవచ్చు. తినడానికి రుచిగా ఉంటుంది.

ఇంగువ ఏ పరిమాణంలో ఉపయోగించాలంటే

వాపును తగ్గించడంలో సహాయపడే ఇంగువలో యాంటీ ఇన్‌ఫ్లమేటరీ లక్షణాలు కనిపిస్తాయి. ఇది చిటికెడు మాత్రమే ఉపయోగించాలి. ఎక్కువగా ఉపయోగిస్తే చాలా సమస్యలను కలిగిస్తుంది. దీనితో పాటు అధిక రక్తపోటు, గర్భం లేదా ఆరోగ్యానికి సంబంధించిన ఏదైనా సమస్య ఉంటే దానిని తీసుకునే ముందు తప్పనిసరిగా నిపుణుడిని సంప్రదించాలి.

మరిన్ని లైఫ్ స్టైల్ వార్తల కోసం క్లిక్ చేయండి..

(NOTE: ఇంటర్నెట్‌లో సేకరించిన సమాచారం ఆధారంగా ఈ వివరాలు మీకు అందించటం జరిగింది. ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. తదుపరి జరిగే ఎలాంటి పరిణామాలకు TV9 Telugu.com బాధ్యత వహించదు.)