Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Alchol Effects: మద్యానికి బానిసయ్యారా? అలవాటు మానుకోకపోతే ఆ సమస్యతో ఇబ్బంది తప్పదు

తాజాగా యూనివర్శిటీ ఆఫ్ ఈస్ట్ ఆంగ్లియా తాజా అధ్యయనంలో అధికంగా మద్యపానం చేయడం వల్ల మీ కండరాలు వేగంగా తగ్గిపోతాయని తేలింది. ఆల్కహాల్ అధిక వినియోగం అస్తిపంజర కండరాలను దెబ్బతీస్తుందని, అకాల వృద్ధాప్య ప్రమాదాన్ని పెంచుతుందని తేలింది.

Alchol Effects: మద్యానికి బానిసయ్యారా? అలవాటు మానుకోకపోతే ఆ సమస్యతో ఇబ్బంది తప్పదు
Alcohol
Follow us
Srinu

|

Updated on: Jun 23, 2023 | 4:00 PM

ప్రస్తుతం కాలంలో యవత ఎక్కువగా మద్యానికి బానిసవుతున్నారు. మొదట్లో స్నేహితులతో సరదాగా మొదలయ్యే అలవాటు క్రమేపి దురలవాటుగా మారి జీవితాన్ని నాశనం చేస్తుంది. సాధారణంగా మద్యం బాటిళ్ల మీదే మద్యపానం ఆరోగ్యానికి హానికరమని ఉంటుంది. అయితే ముఖ్యంగా మద్యపానం వల్ల గుండె, మెదడు ఆరోగ్యంపై కలిగే దుష్ప్రభావాల గురించి అనేక అధ్యయనాలు జరిగాయి. తాజాగా యూనివర్శిటీ ఆఫ్ ఈస్ట్ ఆంగ్లియా తాజా అధ్యయనంలో అధికంగా మద్యపానం చేయడం వల్ల మీ కండరాలు వేగంగా తగ్గిపోతాయని తేలింది. ఆల్కహాల్ అధిక వినియోగం అస్తిపంజర కండరాలను దెబ్బతీస్తుందని, అకాల వృద్ధాప్య ప్రమాదాన్ని పెంచుతుందని తేలింది. ఈ అధ్యయనం మరిన్ని విషయాలు ఏంటో ఓ సారి తెలుసుకుందాం.

పెద్ద వ్యక్తులు ఎక్కువ కండర ద్రవ్యరాశిని కలిగి ఉంటారు. కాబట్టి పరిశోధకులు ప్రోటీన్ వినియోగం, శారీరక శ్రమ వంటి అంశాలను పరిగణనలోకి తీసుకోవడం ద్వారా శరీర పరిమాణాన్ని అంచనా వేశారు. పరిశోధకులు యూకే బయోబ్యాంక్ నుంచి 37 నుంచి 79 సంవత్సరాల ఉన్న రెండు లక్షల మందిపై పరిశోధన చేశారు. ముఖ్యంగా వారి శరీర పరిమాణాలు, ఇతర అంశాలను పరిగణనలోకి తీసుకున్న తర్వాత తక్కువ తాగే వ్యక్తులతో పోలిస్తే ఎక్కువగా మద్యం సేవించే వారిలో అస్తి పంజర కండరాలు తక్కువగా ఉన్నాయని కనుగొననారు. 

రోజుకు 10 లేదా అంతకంటే ఎక్కువ యూనిట్లు మద్యం తాగుతున్నప్పుడు అది సమస్యగా మారిందని పరిశోధనలో తేలింది. ఆల్కహాల్ వినియోగం, కండర ద్రవ్యరాశిని క్రాస్-సెక్షన్‌గా కొలుస్తారు. సాధారణంగా వయసు పెరిగే కొద్దీ కండరాలను కోల్పోవడం, బలహీనతతో సమస్యలకు దారితీస్తుంది. అయితే అలాంటి వారు మద్యం సేవిస్తే వేగంగా కండరాలను కోల్పోతారని తేలింది.కాబట్టి వృ‌ద్ధులు వీలైనంత మద్యానికి దూరంగా ఉండాలని తాజా అధ్యయనంలో తేలింది.

ఇవి కూడా చదవండి

మరిన్ని లైఫ్ స్టైల్ వార్తల కోసం క్లిక్ చేయండి..

పళ్లు ఊడిపోయినా బేఫికర్‌.. ఒరిజినల్‌వే మళ్లీ మొలిపిస్తరట..
పళ్లు ఊడిపోయినా బేఫికర్‌.. ఒరిజినల్‌వే మళ్లీ మొలిపిస్తరట..
ఒక్క రూపాయికే వైద్యం! ఈ డాక్టర్​ను అభినందించాల్సిందే
ఒక్క రూపాయికే వైద్యం! ఈ డాక్టర్​ను అభినందించాల్సిందే
ఏంటి మావా అదేమైనా పిల్లి అనుకున్నావా.. అలా ముద్దులు పెడుతున్నావ్
ఏంటి మావా అదేమైనా పిల్లి అనుకున్నావా.. అలా ముద్దులు పెడుతున్నావ్
షుగర్‌ పేషంట్స్‌ చెరుకు రసం తాగొచ్చా? నిపుణులు ఏమంటున్నారు?
షుగర్‌ పేషంట్స్‌ చెరుకు రసం తాగొచ్చా? నిపుణులు ఏమంటున్నారు?
బ్యాంక్‌లో మీకు రుణం ఉందా అయితే మీకో గుడ్‌ న్యూస్‌
బ్యాంక్‌లో మీకు రుణం ఉందా అయితే మీకో గుడ్‌ న్యూస్‌
గోల్కొండ బ్లూ డైమండ్ చరిత్ర ఏంటి..? దేశం దాటి ఎలా వెళ్లింది..?
గోల్కొండ బ్లూ డైమండ్ చరిత్ర ఏంటి..? దేశం దాటి ఎలా వెళ్లింది..?
సమంత షాకింగ్‌. భార్యలకు రోగాలు వస్తే, భర్తలు విడాకులు ఇస్తున్నారు
సమంత షాకింగ్‌. భార్యలకు రోగాలు వస్తే, భర్తలు విడాకులు ఇస్తున్నారు
మహేష్ బాబు మిస్సైన సినిమాతో.. రామ్ చరణ్ బ్లాక్ బస్టర్ హిట్
మహేష్ బాబు మిస్సైన సినిమాతో.. రామ్ చరణ్ బ్లాక్ బస్టర్ హిట్
తీవ్ర రక్త స్రావం.. ఆసుపత్రిలో ఆపరేషన్! ఇంతకీ రష్మీకి ఏమైంది?
తీవ్ర రక్త స్రావం.. ఆసుపత్రిలో ఆపరేషన్! ఇంతకీ రష్మీకి ఏమైంది?
అమర్‌దీప్‌ను అలా చూశాక.. బిగ్ బాస్‌కు వెళ్లడం వద్దనుకున్నా..
అమర్‌దీప్‌ను అలా చూశాక.. బిగ్ బాస్‌కు వెళ్లడం వద్దనుకున్నా..