Skin Glow: రాత్రి ముఖానికి ఇవి పెట్టారంటే.. ఉదయం వరకు అందంగా మెరిసిపోతారు..

అందమైన చర్మం కావాలని అనుకోని వారుండరు. అందం కోసం ఆడవారు, మగవారు తపిస్తూ ఉంటారు. అందమైన చర్మం కోసం ఎంతో ఖరీదైన అనేక రకాల బ్యూటీ ప్రాడెక్ట్స్‌ వాడుతూ ఉంటారు. బ్యూటీ పార్లర్స్‌కు కూడా వెళ్లి ఫేషియల్స్ చేయించుకుంటారు. అందంగా కనిపించాలంటే ఖరీదైన ఉత్పత్తులే అవసరం లేదు. మన ఇంట్లో ఉండే వాటితోనే మనం సహజమైన అందాన్ని పెంచుకోవచ్చు. కేవలం టిప్స్ పాటించినా సరిపోదు. మంచి ఆరోగ్యకరమైన ఆహాం కూడా తీసుకుంటూ..

Skin Glow: రాత్రి ముఖానికి ఇవి పెట్టారంటే.. ఉదయం వరకు అందంగా మెరిసిపోతారు..
Skin Care
Follow us

|

Updated on: Oct 05, 2024 | 2:24 PM

అందమైన చర్మం కావాలని అనుకోని వారుండరు. అందం కోసం ఆడవారు, మగవారు తపిస్తూ ఉంటారు. అందమైన చర్మం కోసం ఎంతో ఖరీదైన అనేక రకాల బ్యూటీ ప్రాడెక్ట్స్‌ వాడుతూ ఉంటారు. బ్యూటీ పార్లర్స్‌కు కూడా వెళ్లి ఫేషియల్స్ చేయించుకుంటారు. అందంగా కనిపించాలంటే ఖరీదైన ఉత్పత్తులే అవసరం లేదు. మన ఇంట్లో ఉండే వాటితోనే మనం సహజమైన అందాన్ని పెంచుకోవచ్చు. కేవలం టిప్స్ పాటించినా సరిపోదు. మంచి ఆరోగ్యకరమైన ఆహాం కూడా తీసుకుంటూ ఉండాలి. మంచి పోషకాహారం తీసుకుంటే మీ స్కిన్ టోన్ ఖచ్చితంగా మెరుగు పడుతుంది. రాత్రి పూట మీరు నిద్రించే ముందు కొన్ని రకాల పదార్థాలు రెగ్యులర్‌గా ఉపయోగిస్తూ ఖచ్చితంగా మీ ముఖంలోతేడాలు కనిపిస్తాయి. కొన్ని రోజుల్లోనే మీ అందం అనేది రెట్టింపు అవుతుంది. మరి అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం.

కొబ్బరి నూనె:

కొబ్బరి నూనె ఎప్పటినుంచే ఉపయోగిస్తున్నాం. ఇప్పుడంటే స్కిన్ ప్రాడెక్ట్స్ వచ్చాయి. కానీ పూర్వం చర్మానికి ఎక్కువగా కొబ్బరి నూనే రాసేవారు. ఇది చర్మాన్ని ఎంతో అందంగా మార్చడంలో చక్కగా సహాయ పడుతుంది. కొబ్బరి నూనె వల్ల కేవలం జుట్టు మాత్రమే కాదు చర్మానికి కూడా ఎంతో మేలు చేస్తుంది. ప్రతి రోజూ రాత్రి పడుకునే ముందు కొబ్బరి నూనె రాసి పడుకుంటే.. కొద్ది రోజుల్లోనే చర్మం ఎంతో గ్లోయింగ్‌గా తయారవుతుంది.

అలోవెరా జెల్:

కలబంద జెల్‌లో కూడా ఎన్నో ఔషధ గుణాలు ఉంటాయి. ఇవి జుట్టు ఆరోగ్యానికి, చర్మానికి కూడా ఎంతో చక్కగా ఉపయోగ పడుతుంది. ఇందులో యాంటీ ఇన్ ఫ్లమేటరీ గుణాలు, హైడ్రేటింగ్ లక్షణాలు ఉన్నాయి. కాబట్టి చర్మం కూడా షైనీగా మెరుస్తుంది. ప్రతి రోజూ రాత్రి మీరు పడుకునే ముందు కలబంద గుజ్జు రాసి మర్దనా చేసి పడుకోండి. ఇలా కొన్నిరోజుల్లో మీకు తేడా ఖచ్చితంగా కనిపిస్తుంది.

ఇవి కూడా చదవండి

తేనె:

తేనె కూడా చర్మానికి ఎంతో మేలు చేస్తుంది. ఇది చర్మానికి నేచురల్ మాయిశ్చరైజర్ అని చెప్పొచ్చు. తేనె రాయడం వల్ల చర్మం హైడ్రేట్‌గా మెరుస్తూ కాంతివంతంగా తయారువుతుంది. ప్రతి రోజూ రాత్రి పడుకునే ముందు ముఖానికి తేనె అప్లై చేసి 10 నిమిషాల తర్వాత కడిగేయండి.

రోజ్ వాటర్:

రోజ్‌ వాటర్‌ను చాలా మంది ఉపయోగిస్తూ ఉంటారు. రోజ్ వాటర్‌ రాయడం వల్ల చర్మం మాయిశ్చరైజింగ్ గా ఉంటుంది. చర్మాన్ని శుభ్రం చేయడంలో ఇది ఎంతో చక్కగా పనిచేస్తుంది. ప్రతి రోజూ రాత్రి పడుకునే ముందు రోజ్ వాటర్ రాసుకోండి. ఇలా కొద్ది రోజుల్లోనే మీకు మంచి తేడా కనిపిస్తుంది. అలాగే బాదం ఆయిల్, ఆలివ్ ఆయిల్‌ రాసుకున్నా మంచి ఫలితం ఉంటుంది.

(NOTE: ఇంటర్నెట్‌లో సేకరించిన సమాచారం ఆధారంగా ఈ వివరాలు మీకు అందించటం జరిగింది. ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. తదుపరి జరిగే ఎలాంటి పరిణామాలకు TV9 Telugu.com బాధ్యత వహించదు.)

మరిన్ని లైఫ్ స్టైల్ వార్తల కోసం క్లిక్ చేయండి..