Dry Fish Benefits: ఎండు చేపలతో ఈ వ్యాధులకు బైబై చెప్పొచ్చు..
చేపల కర్రీ అంటే ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి. నాన్ వెజ్ ప్రియులకు ఇష్టమైన వంటల్లో ఇది కూడా ఒకటి. చేపల్లో ఎన్నో రకాలు ఉంటాయి. పులస, చందమామ చేపలు, కొర్రమెనులు, పండు కప్ప వంటి వాటిని ఇష్టంగా తింటారు. చేపల్లో యాంటీ ఆక్సిడెంట్లు, ఓమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ ఉండటం వల్ల శరీరం, గుండె ఆరోగ్యం మెరుగు పడుతుంది. కాబట్టి అప్పుడప్పుడైనా చేపలు తింటూ ఉండాలి. చాలా రకాల లాభాలు..

చేపల కర్రీ అంటే ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి. నాన్ వెజ్ ప్రియులకు ఇష్టమైన వంటల్లో ఇది కూడా ఒకటి. చేపల్లో ఎన్నో రకాలు ఉంటాయి. పులస, చందమామ చేపలు, కొర్రమెనులు, పండు కప్ప వంటి వాటిని ఇష్టంగా తింటారు. చేపల్లో యాంటీ ఆక్సిడెంట్లు, ఓమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ ఉండటం వల్ల శరీరం, గుండె ఆరోగ్యం మెరుగు పడుతుంది. కాబట్టి అప్పుడప్పుడైనా చేపలు తింటూ ఉండాలి. చాలా రకాల లాభాలు పొందవచ్చని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. అదే విధంగా ఎండు చేపల్లో అనేక రకాల ఆయుర్వేద గుణాలు లభిస్తాయని నిపుణులు అంటున్నారు.
కాబట్టి వీటిని క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల కీళ్ల నొప్పులు, మోకాళ్ల నొప్పుల నుంచి కూడా సులభంగా ఉపశమనం కలుగుతుంది. కాబట్టి క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల మంచి ఫలితాలు పొందుతారు. దీంతో పాటు శరీరం కూడా ఆరోగ్యంగా ఉంటుంది. మరి ఎండు చేపలు తింటే ఎలాంటి హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయో ఇప్పుడు చూద్దాం.
క్యాల్షియం అధికం:
ఎండు చేపల్లో క్యాల్షియం అనేది అధికంగా ఉంటుంది. కాబట్టి రక్తపోటుతో బాధ పడేవారు వీటిని క్రమం తప్పకుండా తీసుకోవడం సులభంగా ఉపశమనం లభిస్తుంది. అంతే కాకుండా తీర్ఘకాలిక వ్యాధుల బారిన పడకుండా ఉంటారు.
ప్రోటీన్ లభిస్తుంది:
ఎండు చేపల్లో ప్రోటీన్ కూడా మెండుగా లభిస్తుంది. కాబట్టి ఎండు చేపలు తినడం వల్ల శరీరంలో దెబ్బతిన్న కణాజాలాన్ని నిర్మించేందుకు కీలక పాత్ర పోషిస్తుంది. దీంతో పాటు శరీరంలోని హార్మోన్లు, ఎంజైమ్‌లు ఇతర రసాయనాల సమతుల్యం చేసేందుకు ముఖ్య పాత్ర పోషిస్తుంది.
కీళ్ల నొప్పులు తగ్గుతాయి:
శరీరంలో యూరిక్ యాసిడ్ లెవల్స్‌ను కూడా తగ్గించే గుణాలు.. ఎండు చేపల్లో లభిస్తాయి. కాబట్టి క్రమం తప్పకుండా తీసుకుంటే కీళ్ల నొప్పుల సమస్య కూడా దూరం అవుతుంది.
గుండె ఆరోగ్యం మెరుగు పడుతుంది:
ఎండు చేపల్లో ఓమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ కూడా లభ్యమవుతాయి. వీటిని తీసుకుంటే రక్త నాళాలు శుభ్రం అవుతాయి. దీంతో గుండె ఆరోగ్యం కూడా మెరుగు పడుతుంది. వారానికి ఒకసారి అయినా ఎండు చేపల్ని తింటే.. రక్తం గడ్డ కట్టడం సమస్య నుంచి ఉపశమనం పొందవచ్చు.
మరిన్ని లైఫ్ స్టైల్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..
గమనిక: ఇది నిపుణులు, అధ్యయనాల నుంచి సేకరించిన సమాచారం. అవగాహన కోసం మాత్రమే ఈ కథనం. ఆరోగ్యానికి సంబంధించిన ఏ చిన్న సమస్య ఉన్నా నిపుణులను సంప్రదించడం మేలు.








