AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Black Salt: ఖాళీ కడుపుతో గ్లాసుడు నీళ్లలో ఇది చిటికెడు కలుపుకుని తాగితే… శరీరంలో జరిగే మ్యాజిక్‌..

ఇది కడుపును ఆరోగ్యంగా ఉంచడంతో పాటు, జీవక్రియ రేటును కూడా పెంచుతుంది. ఇందులో లాక్సేటివ్ గుణాలు ఎక్కువగా ఉండి, మెటబాలిక్ రేటును పెంచడంతో పాటు కడుపును క్లీన్ చేస్తుంది. గుండెల్లో మంట, ఉబ్బరాన్ని నల్ల ఉప్పు సులువుగా నివారిస్తుంది. నల్ల ఉప్పు జీర్ణాశయంను శుభ్రం చేయడంతో పాటు పైల్స్ ఉన్నవాళ్లకు ఆ సమస్యకు చెక్ పెట్టడంలో సహాయపడుతుంది.

Black Salt: ఖాళీ కడుపుతో గ్లాసుడు నీళ్లలో ఇది చిటికెడు కలుపుకుని తాగితే... శరీరంలో జరిగే మ్యాజిక్‌..
Black Salt Water
Jyothi Gadda
|

Updated on: Feb 08, 2025 | 1:43 PM

Share

నల్ల ఉప్పు చల్లదనాన్ని కలిగి ఉంటుంది. అందుకే ఇది కడుపుకు మంచిది. చలువ చేస్తుంది. అంతేకాదు.. నల్ల ఉప్పులో అనేక పోషకాలు నిండివున్నాయని నిపుణులు చెబుతున్నారు. నల్ల ఉప్పు మీ జీవక్రియ రేటును పెంచే భేదిమందు లక్షణాలను కలిగి ఉంటుంది. కాబట్టి దీనిని మీ రోజువారీ ఆహారంలో చేర్చుకోవడం వల్ల మీకు అనేక ప్రయోజనాలు లభిస్తాయి. మీ రోజును టీ లేదా కాఫీతో కాకుండా ఆరోగ్యకరమైన రీతిలో ప్రారంభించాలి. దీని కోసం, ప్రతి ఉదయం ఖాళీ కడుపుతో నల్ల ఉప్పు నీరు తాగటం వల్ల మీరు ఊహించని లాభాలు ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు. అవేంటో ఇక్కడ తెలుసుకుందాం..

కాలేయ నిర్విషీకరణకు నల్ల ఉప్పు చాలా ప్రయోజనకరంగా పనిచేస్తుంది. ఈ ఉప్పు ప్రత్యేకత ఏమిటంటే ఇది కాలేయ కణాలలో పేరుకుపోయిన మురికిని శుభ్రం చేయడంలో సహాయపడుతుంది. ఉదయాన్నే ఖాళీ కడుపుతో నల్ల ఉప్పు నీరు తాగడం వల్ల శరీరంలోని హానికరమైన విషాన్ని బయటకు పంపడంలో సహాయపడుతుంది. నల్ల ఉప్పు నీరు చర్మానికి కూడా మేలు చేస్తుంది. ఉదయాన్నే నల్ల ఉప్పు నీరు తాగడం వల్ల చర్మ రంధ్రాలను లోపలి నుండి శుభ్రపరచడంలో సహాయపడుతుంది.

నల్ల ఉప్పు నీరు తాగడం వల్ల మలబద్ధకం సమస్య నుండి కూడా బయటపడవచ్చు. ఇది కడుపును ఆరోగ్యంగా ఉంచడంతో పాటు, జీవక్రియ రేటును కూడా పెంచుతుంది. ఇందులో లాక్సేటివ్ గుణాలు ఎక్కువగా ఉండి, మెటబాలిక్ రేటును పెంచడంతో పాటు కడుపును క్లీన్ చేస్తుంది. గుండెల్లో మంట, ఉబ్బరాన్ని నల్ల ఉప్పు సులువుగా నివారిస్తుంది. నల్ల ఉప్పు జీర్ణాశయంను శుభ్రం చేయడంతో పాటు పైల్స్ ఉన్నవాళ్లకు ఆ సమస్యకు చెక్ పెట్టడంలో సహాయపడుతుంది.

ఇవి కూడా చదవండి

నల్ల ఉప్పు తీసుకోవడం వల్ల ఎసిడిటీ సమస్య సైతం సులువుగా తగ్గుతుంది. రక్తంలోని గ్లూకోజ్ స్థాయిలను సైతం కొంతమేర తగ్గించడంలో నల్ల ఉప్పు ఉపయోగపడుతుంది. సోడియం తక్కువగా ఉండే ఈ ఉప్పుని తీసుకోవడం వల్ల హైబీపి తగ్గుతుంది. ఈ ఉప్పులో ఎక్కువ ఖనిజాలు ఉంటాయి. ఈ నల్ల ఉప్పుని తింటే జీర్ణక్రియ మెరుగవుతుంది. ఎంత మంచిదైనా కూడా నల్ల ఉప్పుని తీసుకున్నప్పుడు బ్రాండ్‌ని అందులో ఉన్న గుణాలని చూసి కొనాలి. అదే విధంగా, తక్కువ మోతాదులోనే తీసుకోవాలని గుర్తుపెట్టుకోండి.

(NOTE: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణులు అందించిన సమాచారం ప్రకారం ఇక్కడ తెలియజేయడమైనది. ఆరోగ్యరీత్యా ఎలాంటి సమస్యలు ఉన్నానేరుగా వైద్య నిపుణులను సంప్రదించడం మంచిది)

మరిన్ని లైఫ్ స్టైల్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..