Alzheimer’s disease: అల్జీమర్స్‌కు సరికొత్త చికిత్సను కనుగొన్న ఇండియన్‌ సైంటిస్టులు.. ఇక మతిమరుపుకు గుడ్‌బై చెప్పొచ్చు

మతిమరుపుతో ప్రారంభమై తీవ్రమైన డిమెన్షియాకు దారి తీసే అల్జీమర్స్ వ్యాధిని ఎట్టిపరిస్థితుల్లోనూ లైట్ తీసుకోకూడదు. అయితే ఈ వ్యాధి చికిత్సలో ఇండియన్ సైంటిస్టులు మరో మైలు రాయిని అధిగమించారు. ఇటీవల ఓ అధ్యయనం చేసిన వీరు సరికొత్త చికిత్సను కనుగొన్నట్లు ప్రకటించారు..

Alzheimer's disease: అల్జీమర్స్‌కు సరికొత్త చికిత్సను కనుగొన్న ఇండియన్‌ సైంటిస్టులు.. ఇక మతిమరుపుకు గుడ్‌బై చెప్పొచ్చు
Alzheimer's Disease
Follow us

|

Updated on: Oct 30, 2024 | 12:54 PM

ఒకప్పుడు అల్జీమర్స్ వ్యాధిని వృద్ధుల వ్యాధిగా పరిగణించే వారు. కానీ నేటి జీవనశైలి కారణంగా యువత కూడా ఈ వ్యాధి బారీన పడుతున్నారు. ప్రపంచవ్యాప్తంగా 30 నుంచి 64 ఏళ్ల మధ్య వయసున్న 39 లక్షల మంది ఈ వ్యాధితో బాధపడుతున్నారని పరిశోధనలో తేలింది. అంటే ఈ వ్యాధి 30 సంవత్సరాల వయస్సు ఉన్న యువకులకు వస్తుందన్నమాట. తాజా అధ్యయనం ప్రకారం అల్జీమర్స్ లక్షణాలు యువకులలో భిన్నంగా ఉన్నట్లు తేలింది. దీంతో వారి మానసిక, శారీరక సామర్థ్యాలు బలహీనపడుతున్నట్లు గుర్తించారు. అయితే దీనికి ఇటీవల భారతీయ శాస్త్రవేత్తలు మెడిసిన్‌ కనుగొన్నారు. ఈ కొత్త ట్రీట్‌మెంట్ ఏంటో, ఎలా చేస్తారో ఇక్కడ తెలుసుకుందాం..

అల్జీమర్స్ ఒక తీవ్రమైన న్యూరోడెజెనరేటివ్ వ్యాధి. ప్రపంచవ్యాప్తంగా 5.5 కోట్ల మందికి పైగా ప్రజలు అల్జీమర్స్, దాని సంబంధిత డిమెన్షియాతో బాధపడుతున్నారు. గణాంకాల ప్రకారం.. ప్రతి సంవత్సరం 1 కోటి మందికి పైగా అల్జీమర్స్ మరియు డిమెన్షియా బారిన పడుతున్నట్లు తెలిసింది.

అల్జీమర్స్ ఎందుకు ప్రమాదకరం?

అల్జీమర్స్ అనేది మెదడుకు సంబంధించిన రుగ్మత. దీనిలో మెదడు పరిమాణం తగ్గిపోవడం, కణాలు చనిపోవడం జరుగుతుంది. ఈ పరిస్థితి కారణంగా దేనినీ గుర్తుంచుకోలేకుండా రోగులు ఉంటారు. ఆలోచించలేరు కూడా. అల్జీమర్స్ తీవ్రమైతే చిత్తవైకల్యం వచ్చే ప్రమాదం కూడా ఉంది. దాని లక్షణాలను తగ్గించడానికి, దాని వల్ల కలిగే సమస్యలను నివారించడానికి కొన్ని మందులు డాక్టర్లు ఇస్తుంటారు. అయితే ఈ వ్యాధికి చికిత్స చేయడంలో భారతీయ శాస్త్రవేత్తలు మరో అడుగు ముందుకు వేశారు.

ఇవి కూడా చదవండి

అల్జీమర్స్‌కి సైంటిస్టులు కనిపెట్టిన కొత్త చికిత్స ఏమిటంటే

పుణెలోని అఘార్కర్ రీసెర్చ్ సెంటర్‌లోని శాస్త్రవేత్తలు అల్జీమర్స్ వ్యాధికి కొత్త చికిత్స విధానం కనుగొన్నారు. ఇందు కోసం కొత్త అణువులను అభివృద్ధి చేశారు. ప్రసాద్ కులకర్ణి, వినోద్ ఉగ్లే అనే ఇద్దరు శాస్త్రవేత్తలు సింథటిక్, కంప్యూటేషనల్ అండ్‌ ఇన్-విట్రో అధ్యయనాల సహాయంతో కొత్త అణువులను రూపొందించారు. ఈ అణువులు విషపూరితం కానివి. అల్జీమర్స్ చికిత్సలో ఇవి ప్రభావవంతంగా పని చేస్తాయని చెప్పారు. కోలినెస్టరేస్ ఎంజైమ్‌లకు వ్యతిరేకంగా ఈ అణువులు ప్రభావవంతంగా పనిచేస్తున్నట్లు శాస్త్రవేత్తలు తమ పరిశోధనల్లో కనుగొన్నారు. వీటిని ఉపయోగించి మందులు తయారు చేయవచ్చు. ఇవి ఈ వ్యాధిని నయం చేయడంలో ప్రభావవంతంగా పనిచేస్తున్నట్లు కనుగొన్నారు.

అల్జీమర్స్ నయం చేయడానికి జీవనశైలిలో మార్పులు ఈ మార్పులు చేసుకోవాలి

ఆస్ట్రేలియాలో నిర్వహించిన మరో అధ్యయనంలో అల్జీమర్స్ రోగులు తమ ఆహార, జీవనశైలిని మెరుగుపరచడంపై దృష్టి పెట్టాలని కనుగొన్నారు. ఈ వ్యాధితో బాధపడేవారు క్రమం తప్పకుండా వ్యాయామం చేయాలి. అంతేకాకుండా సామాజికంగా ఉండటం, చదవడం, నృత్యం చేయడం, ఆటలు ఆడటం, ఏదైనా సంగీత వాయిద్యం వాయించడం వంటివి నేర్చుకోవాలి. ఇవి ఈ తీవ్రమైన వ్యాధి ప్రమాదాన్ని తగ్గించడంలో సహాయపడతాయి.

మరిన్ని ఆరోగ్య వార్తల కోసం క్లిక్‌ చేయండి.

ఆర్మీ యూనిఫాంలో ప్రధాని మోదీ దీపావళి..!
ఆర్మీ యూనిఫాంలో ప్రధాని మోదీ దీపావళి..!
ముచ్చింతల్‌లో అంబరాన్నంటిన దీపావళి సంబరాలు.. సమతామూర్తి ప్రాంగణం
ముచ్చింతల్‌లో అంబరాన్నంటిన దీపావళి సంబరాలు.. సమతామూర్తి ప్రాంగణం
మేం ముంబైకి వెళ్లిపోయింది అందుకే.! జ్యోతిక పై సూర్య కామెంట్స్.
మేం ముంబైకి వెళ్లిపోయింది అందుకే.! జ్యోతిక పై సూర్య కామెంట్స్.
మతిపోయే థ్రిల్లర్ మూవీ.! శవంతో రొమాన్స్.! ఇదేం అరాచకం..
మతిపోయే థ్రిల్లర్ మూవీ.! శవంతో రొమాన్స్.! ఇదేం అరాచకం..
తప్పుడు కేసులో దొరికి.. చేజేతులారా కెరీర్‌ను నాశనం చేసుకుంది.!
తప్పుడు కేసులో దొరికి.. చేజేతులారా కెరీర్‌ను నాశనం చేసుకుంది.!
నాదే లేట్‌.! అయినా ప్రభాస్‌ అర్థరాత్రి వరకు నా కోసం వెయిట్ చేశాడు
నాదే లేట్‌.! అయినా ప్రభాస్‌ అర్థరాత్రి వరకు నా కోసం వెయిట్ చేశాడు
బంగారం.. ఎప్పుడు కొంటే మంచిది.? పక్క దేశాల ప్రభావం మన దగ్గర కూడా.
బంగారం.. ఎప్పుడు కొంటే మంచిది.? పక్క దేశాల ప్రభావం మన దగ్గర కూడా.
హీరో 100 కోట్ల కల.. నెరవేరితే ఆ తెలుగు ప్రొడ్యూసర్ ఫోటో ఆయన ఇంట్ల
హీరో 100 కోట్ల కల.. నెరవేరితే ఆ తెలుగు ప్రొడ్యూసర్ ఫోటో ఆయన ఇంట్ల
AA చేతిలో చరణ్ గేమ్‌ ఛేంజర్‌ మూవీ.! చెర్రీ కెరియర్ లో హయ్యస్ట్..
AA చేతిలో చరణ్ గేమ్‌ ఛేంజర్‌ మూవీ.! చెర్రీ కెరియర్ లో హయ్యస్ట్..
దర్శన్‌కు బెయిల్‌.! రేణుకా స్వామి తండ్రి షాకింగ్ రియాక్షన్..
దర్శన్‌కు బెయిల్‌.! రేణుకా స్వామి తండ్రి షాకింగ్ రియాక్షన్..