AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Weight Loss Tips: తెలుగింటి వంటకాలతో 35 KGల బరువు తగ్గిన కుర్రోడు.. వీడియో చూశారా?

నేడు జీవితం ఒక దిశలో కదులుతుంటే, శరీరం మరో దిశలో కదులుతోంది. ఈ ఒత్తిడితో కూడిన జీవితంలో శరీర ఆరోగ్యం, ఫిట్‌నెస్‌ను జాగ్రత్తగా చూసుకోవడం అంత సులువుకాదు. ఈ రెండింటినీ సమతుల్యంగా ఉంచడం కష్టమని అనుకునేవారు లేకపోలేదు. కొంత మంది ప్రతిరోజూ గంటల తరబడి కసరత్తులు చేసినా..

Weight Loss Tips: తెలుగింటి వంటకాలతో 35 KGల బరువు తగ్గిన కుర్రోడు.. వీడియో చూశారా?
South Indian Food
Srilakshmi C
|

Updated on: Jun 25, 2025 | 9:22 AM

Share

నేటి కాలంలో యువత ఎదుర్కొంటున్నఅతి ముఖ్యమైన సమస్యల్లో ఉభకాయం ఒకటి. నేడు జీవితం ఒక దిశలో కదులుతుంటే, శరీరం మరో దిశలో కదులుతోంది. ఈ ఒత్తిడితో కూడిన జీవితంలో శరీర ఆరోగ్యం, ఫిట్‌నెస్‌ను జాగ్రత్తగా చూసుకోవడం అంత సులువుకాదు. ఈ రెండింటినీ సమతుల్యంగా ఉంచడం కష్టమని అనుకునేవారు లేకపోలేదు. కొంత మంది ప్రతిరోజూ గంటల తరబడి కసరత్తులు చేసినా.. ఎంత మాత్రం ప్రయోజనం ఉండదు. ఇలాంటి వారు తమ షెడ్యూల్‌లో కొన్ని మార్పులు చేసుకుంటే తేలికగా బరువు తగ్గొచ్చని ఓ యువకుడు చెబుతున్నాడు. సప్లిమెంట్లు, కఠినమైన ఆహార నియమాలు పాటించకుండానే సహజ పద్ధతుల్లో 35 కిలోగ్రాముల బరువు తగ్గి అందరినీ ఆశ్చర్యపరిచాడు. ఫిట్‌నెస్ బ్లాగర్ VSజితిన్ ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో షేర్‌ చేశాడు. తాను ఏ విధంగా బరువు తగ్గాడో ఆ వివరాలు ఇందులో నెటిజన్లతో పంచుకున్నాడు. ముఖ్యంగా ప్రోటీన్ అధికంగా ఉండే దక్షిణాది అల్పాహారాలను తీసుకోవడం ద్వారా బరువు తగ్గడం సాధ్యమైందని జితిన్‌ వివరించాడు.

సాధారణంగా ప్రతిరోజూ చేసే వంటలతో తన బరువు తగ్గే రహస్యాన్ని వెల్లడించాడు. అనవసరమైన పద్ధతులను ఉపయోగించకుండా సహజ ఆహారాలను ఉపయోగించడం ద్వారా అతను బరువు తగ్గాడట. ఈ వీడియో జితిన్‌ ఏడు శాఖాహార ఆహారాలను ప్రస్తావించాడు. రుచికరమైన, సులభంగా తయారు చేయగల వంట పద్ధతులను కూడా ఇందులో ప్రస్తావించాడు. దీని గురించి ఇక్కడ మరింత చూడండి.

ఇవి కూడా చదవండి

పనీర్ స్టఫ్డ్ గోధుమ దోస

మీరు ప్రతిరోజూ దోస తినే అలవాటు ఉంటే, బియ్యం పిండి దోసకు బదులుగా గోధుమ దోస తయారు చేసుకోండి. పనీర్ మసాలా, ఉల్లిపాయ, పచ్చిమిర్చి, కొత్తిమీర వేసి చట్నీ తయారు చేసుకుని, గోధుమ దోసతో దీన్ని తింటే, భలే రుచిగా ఉంటుంది. శరీరానికి కూడా మంచిది. ఇది దాదాపు 18 గ్రాముల ప్రోటీన్, 300 కేలరీలను అందిస్తుంది. బరువు తగ్గేటప్పుడు కండరాలు బాధపడకుండా కూడా ఇది నివారిస్తుంది.

గుడ్డు మసాలాతో రాగి రోటీ

ఈ వంటకం మాంసాహారులకు మంచిది. ఉల్లిపాయ, టమోటా, గుడ్డు మసాలాతో రెండు ఉడికించిన గుడ్లు వేసి తయారు చేసుకోవాలి. అలాగే రాగి, బజ్రా లేదా జోవర్‌తో తయారు చేసిన రాగి రోటీ కూడా ఆరోగ్యానికి మంచిది. ఇందులో 18 గ్రాముల ప్రోటీన్, 230 కేలరీలు మాత్రమే ఉంటాయి. రాగిలోని అధిక ఫైబర్ కంటెంట్ జీర్ణ ప్రయోజనాలను పెంచుతుంది.

శనగ పిండి దోస విత్ పుదీనా చట్నీ

శనగ పిండి (బేసన్) తో తయారుచేసిన క్రిస్పీ దోస రుచికరమైన అల్పాహారం. అల్లం, పచ్చిమిర్చి, కొత్తిమీరను పిండిలో కలిపి తయారు చేసుకోవాలి. పెరుగుతో చేసిన పుదీనా చట్నీ శనగపిండి దోసతో కలిపి తినవచ్చు. ఇందులో 12 గ్రాముల ప్రోటీన్, 240 కేలరీలు ఉంటాయి. ఇది బరువు తగ్గడానికి ఉపయోగపడుతుంది.

View this post on Instagram

A post shared by Jithin VS (@jithin_vsuresh)

తొగరి పప్పు వెజిటబుల్ కిచిడి

పప్పు, క్యారెట్, బీన్స్ వంటి కూరగాయల మిశ్రమంతో తయారు చేసిన కిచిడి తింటే చాలా రుచిగా ఉంటుంది. ఆవాలు, కరివేపాకు, అల్లంతో రుచికరంగా ఉంటుంది. ఇది శరీరానికి 14 గ్రాముల ప్రోటీన్, 350 కేలరీలను అందిస్తుంది.

ఓట్స్ పొంగల్

ఇది సాంప్రదాయ దక్షిణ భారత పొంగల్. ఓట్స్‌ను పప్పు పిండితో కలపాలి. మిరియాలు, జీలకర్ర, కరివేపాకు, ఒక టేబుల్ స్పూన్ నెయ్యి వేసి తయారు చేసుకోవచ్చు. ఇది 250 కేలరీలు, 11 గ్రాముల ప్రోటీన్‌ను అందిస్తుంది.

రాగి దోసతో వేరుశనగ చట్నీ

ఈ వంటకంలో ప్రోటీన్ అధికంగా ఉంటుంది. ఇది 30 గ్రాముల ప్రోటీన్‌ను అందిస్తుంది. రాగి పిండితో చేసిన రాగి దోసతో దీన్ని తయారు చేస్తారు. వేయించిన వేరుశనగలు, కొబ్బరి, పచ్చిమిర్చి వేసి చట్నీని తయారు చేసుకోవాలి. ఈ కాంబినేషన్‌ అద్భుతంగా ఉంటుంది.

పెరుగుతో మూంగ్ దాల్ చీలా

నానబెట్టి మెత్తగా రుబ్బుకున్న పెసల పిండితో ఈ దోసను తయారు చేస్తారు. అల్లం, మిరపకాయలతో రుచికరంగా ఉంటుంది. ఇది జీర్ణక్రియను సులభతరం చేస్తుంది. ఇందులో 14 గ్రాముల ప్రోటీన్, 230 కేలరీలు ఉంటాయి.

మరిన్ని ఆరోగ్య కథనాల కోసం క్లిక్‌ చేయండి.