Weight Loss Tips: బరువు తగ్గేందుకు ట్రై చేస్తున్నారా ? ఈ ఫుడ్ తీసుకుంటే మీకు నష్టమే.. అవెంటంటే..
బరువు తగ్గేందుకు చాలా మంది అనేక రకాలుగా ప్రయత్నాలు చేస్తుంటారు. ఎక్కువగా ఆహారం తీసుకోకపోవడం, జాగింగ్ అంటూ ప్రయాత్నిస్తుంటారు.
బరువు తగ్గేందుకు చాలా మంది అనేక రకాలుగా ప్రయత్నాలు చేస్తుంటారు. ఎక్కువగా ఆహారం తీసుకోకపోవడం, జాగింగ్ అంటూ ప్రయాత్నిస్తుంటారు. అయితే ఇలా చేస్తూ చేస్తూ.. చాలా మంది ఆరోగ్య సమస్యలను తెచ్చుకుంటుంటారు. సరైన అవగాహన లేకుండా.. సరైన సమయానికి ఆహారం తీసుకోకుండా ఉండడం, ఎలాంటి ఫుడ్ తీసుకోవాలి.. ఏ ఫుడ్ తీసుకోకుడదు అనేవి తెలుసుకోకుండా.. పప్పులో కాలేస్తుంటారు. దీనివల్ల బరువు తగ్గడం కాదు..కదా. ఇంకా ఎక్కువ లావు అయ్యే అవకాశాలు ఉన్నాయి. అయితే బరువు తగ్గేందుకు ఎలాంటి ఫుడ్ తీసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.
మారుతున్న కాలానుగుణంగా.. నిద్ర వేళల్లో మార్పులు చోటుచేసుకుంటున్నాయి. ఉద్యోగాలు చేసేవారిలో ఈ మార్పు స్పష్టంగా కనిపిస్తుంటుంది. సరైన నిద్ర లేకపోవడం వలన బరువు పెరిగే అవకాశం ఉంది. సరైన సమయానికి తగినంత్ర నిద్ర ఉంటే బరువు పెరగకుండా ఉంటారు. అలాగే ఐస్ క్రీములు, డార్క్ చాకెట్లు, సాస్‌లు, కూల్ డ్రింక్స్ వంటివి తీసుకోకపోవడం ఉత్తమం. వీటిని దాదాపు తగ్గిస్తే బరువు పెరగకుండా ఉంటారు. వీటితోపాటు బరువు తగ్గాలనుకునే వారు కాఫీ, టీలలో చక్కెర శాతాన్ని తగ్గించుకోవాలి. విటమిన్లు, ఖనిజాలు, యాంటీ ఆక్సిడెంట్లు ఎక్కువగా ఉండే కూరగాయలు, తృణధాన్యాల్ని తీసుకోవాలి. ముఖ్యంగా బయటి ఫుడ్‌ను దాదాపు తీసుకోకుడదు. వీటికి బదులుగా ఇంట్లో చేసిన వంటలకు ప్రాధాన్యత ఇవ్వాలి. అలాగే రాత్రి సమయంలో తక్కువగా కేలరీలు ఉన్న ఆహారాన్ని తీసుకోవాలి. ఇక రోజులో ఏ సమయంలోనైనా ఆహారం తీసుకోకుండా ఉండకూడదు. బ్రేక్ ఫాస్ట్, లంచ్, డిన్నర్ అన్ని సరైన సమయానికి చేయాలి. ఇలా చేస్తే.. బరువు క్రమంగా తగ్గుతారు.
Also Read: