AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

చింతమనేనిని ‘ఛీ’ కొట్టిన దెందులూరు ఓటర్లు..!

రాజకీయ నాయకులు కొంతమంది అధికారం తమ చేతుల్లో ఉందని చెలరేగిపోతుంటారు. ఏపీలో అలాంటి వారి జాబితాను తయారు చేస్తే.. పశ్చిమ గోదావరి జిల్లా దెందులూరు టీడీపీ నేత చింతమనేని ప్రభాకర్ ముందు వరుసలో ఉంటారు. గతంలో తన ఇసుక అక్రమాల్ని ప్రశ్నించిన మహిళా రెవెన్యూ అధికారి వనజాక్షిపై దాష్ఠీకంగా ప్రవర్తించి తీరు అందరికి తెలిసిందే. ఈ ఘటనపై చంద్రబాబు చింతమనేనిని మందలించాల్సింది పోయి ఉదాసీనంగా వ్యవహరించారు. ఇక ఆయనపై చర్యల విషయంలో కప్పదాటు వేసి చంద్రబాబు రాజకీయంగా […]

చింతమనేనిని 'ఛీ' కొట్టిన దెందులూరు ఓటర్లు..!
Ravi Kiran
|

Updated on: May 24, 2019 | 12:10 PM

Share

రాజకీయ నాయకులు కొంతమంది అధికారం తమ చేతుల్లో ఉందని చెలరేగిపోతుంటారు. ఏపీలో అలాంటి వారి జాబితాను తయారు చేస్తే.. పశ్చిమ గోదావరి జిల్లా దెందులూరు టీడీపీ నేత చింతమనేని ప్రభాకర్ ముందు వరుసలో ఉంటారు. గతంలో తన ఇసుక అక్రమాల్ని ప్రశ్నించిన మహిళా రెవెన్యూ అధికారి వనజాక్షిపై దాష్ఠీకంగా ప్రవర్తించి తీరు అందరికి తెలిసిందే. ఈ ఘటనపై చంద్రబాబు చింతమనేనిని మందలించాల్సింది పోయి ఉదాసీనంగా వ్యవహరించారు. ఇక ఆయనపై చర్యల విషయంలో కప్పదాటు వేసి చంద్రబాబు రాజకీయంగా కూడా నష్టపోయారనే చెప్పాలి.

దెందులూరులో ఎవరు పోటీ చేసినా తానే గెలుస్తానని ప్రగల్బాలు పలికిన చింతమనేనికి ప్రజలు భారీ షాక్ ఇచ్చారు. లండన్  కుర్రాడిగా పేరున్న వైఎస్ఆర్ కాంగ్రెస్ అభ్యర్థి కొఠారు అబ్బయ్య చౌదరి చింతమనేని ప్రభాకర్ పై దాదాపు 17 వేల ఓట్ల తేడాతో విజయం సాధించారు.

2009లో తొలిసారి దెందులూరు నుంచి పోటీ చేసిన చింతమనేని 14235 ఓట్లతో విజయం సాధిస్తే.. 2014లో జరిగిన ఎన్నికల్లో 17746 ఓట్లతో గెలుపొందారు. వరుసగా రెండుసార్లు విజయం సాధించినా తర్వాత చింతమనేని తన చర్యలతో అత్యంత వివాదాస్పదుడు అయ్యాడు. తాజా ఓటమితో దెందులూరు నియోజకవర్గంలో చింతమనేని అరాచకాలకు ఫుల్ స్టాప్ పడిందని చెప్పక తప్పదు.