AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

కాళేశ్వరం ప్రాజెక్టు ప్రారంభోత్సవానికి జగన్!

తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్మించిన‌ కాళేశ్వరం ప్రాజెక్టు ప్రారంభోత్సవానికి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ హాజరుకానున్నారు. సోమవారం తెలంగాణ సీఎం కేసీఆర్ స్వయంగా ఇంటికెళ్లి జగన్‌ను ఆహ్వానించారు. దీనిపై వైఎస్ జగన్ సానుకూలంగా స్పందించారు. ఏపీ సీఎం క్యాంప్ కార్యాయంలో రెండు గంటలకు పైగా సమావేశమైన ఇరువురు నేతలు ఇరు రాష్ట్రాల విభజన సమస్యలపై సుదీర్ఘంగా చర్చించినట్లు సమాచారం. రికార్డు సమయంలో ప్రాజెక్టు పూర్తైన సందర్భంగా ఘనంగా జాతికి అంకితం చేయాలని సీఎం కేసీఆర్ నిర్ణయించారు. రెండు రాష్ట్రాల్లో […]

కాళేశ్వరం ప్రాజెక్టు ప్రారంభోత్సవానికి జగన్!
TV9 Telugu Digital Desk
| Edited By: |

Updated on: Jun 17, 2019 | 8:59 PM

Share

తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్మించిన‌ కాళేశ్వరం ప్రాజెక్టు ప్రారంభోత్సవానికి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ హాజరుకానున్నారు. సోమవారం తెలంగాణ సీఎం కేసీఆర్ స్వయంగా ఇంటికెళ్లి జగన్‌ను ఆహ్వానించారు. దీనిపై వైఎస్ జగన్ సానుకూలంగా స్పందించారు. ఏపీ సీఎం క్యాంప్ కార్యాయంలో రెండు గంటలకు పైగా సమావేశమైన ఇరువురు నేతలు ఇరు రాష్ట్రాల విభజన సమస్యలపై సుదీర్ఘంగా చర్చించినట్లు సమాచారం. రికార్డు సమయంలో ప్రాజెక్టు పూర్తైన సందర్భంగా ఘనంగా జాతికి అంకితం చేయాలని సీఎం కేసీఆర్ నిర్ణయించారు. రెండు రాష్ట్రాల్లో ఉన్న సాగునీటి సమస్యలపై తనకున్న అనుభవాన్ని జగన్‌తో పంచుకున్నారు. రెండు ప్రభుత్వాలు కలిసి పని చేస్తే కృష్ణా, గోదావరి నీటిని సమర్థవంతంగా వాడుకోవచ్చని ఇద్దరి నేతల మధ్య ఏకాభిప్రాయం కుదిరింది.

Follow Us