రోగనిరోధక శక్తిని పెంచడమే కాదు.. జలుబు, ఫ్లూను తగ్గించే టీ.. సులభంగా ఇంట్లోనే తయారు చేసుకోండిలా..

Healthy Food: ప్రస్తుతం కరోనా మహమ్మారి దేశవ్యాప్తం కల్లోలం సృష్టిస్తుంది. చిన్న చిన్న అజాగ్రత్తల వలన కోవిడ్ బారిన పడే

రోగనిరోధక శక్తిని పెంచడమే కాదు..  జలుబు, ఫ్లూను తగ్గించే టీ.. సులభంగా ఇంట్లోనే తయారు చేసుకోండిలా..
Cinnamon Honey Tea
Follow us
Rajitha Chanti

|

Updated on: Apr 25, 2021 | 1:40 PM

Healthy Food: ప్రస్తుతం కరోనా మహమ్మారి దేశవ్యాప్తం కల్లోలం సృష్టిస్తుంది. చిన్న చిన్న అజాగ్రత్తల వలన కోవిడ్ బారిన పడే అవకాశం ఉంది. ఇక ఈ మహమ్మారి బారిన పడకుండా ఉండేందుకు వ్యక్తిగత శుభ్రత మాత్రమే కాదు… రోగనిరోధక శక్తి కూడా ఎంతో అవసరం. అయితే మన వంటశాలలో ఉండే మసాలా దిసులకు ఎన్నో ఔషదగుణాలున్నాయన్న సంగతి తెలిసిందే. అందులో మరీ ముఖ్యంగా చెప్పుకోవాల్సింది.. దాల్చిన చెక్క. దీనితో ఎన్నో రకాల ప్రయోజనాలున్నాయి. ఇక ఈ దాల్చిన చెక్కకు, తేనెను కలిపి తీసుకోవడం వలన రోగనిరోధక శక్తిని పెంపోందించుకోవడమే కాకుండా.. జలుబు, ప్లూ నుంచి రక్షిస్తుంది.

దాల్చిన చెక్క, తేనె టీ ఎందుకు తీసుకోవాలంటే..

తేనె, దాల్చిన చెక్క రెండింటిలో ఔషదగుణాలు్న్నాయి. తేనెలోే యాంటీఆక్సిడెంట్స్, ఎంజైములు ఉంటాయి. ఇవి శరీరంలోని సమస్యలను తగ్గిస్తాయి. ఇది యాంటీ బాక్టీరియల్ గా పనిచేస్తుంది. ఇన్ఫెక్షన్లను నివారిస్తుంది. ఇక దాల్చిన చెక్క తేలికపాటి రోగాలతో పొరాడటానికి అలాగే శరీరానికి కావాల్సిన బలాన్ని అందిస్తుంది. తేనె, దాల్చిన చెక్క అలెర్జీలను తగ్గిస్తాయి. అలాగే చర్మం పై ఉన్న గాయాలను తగ్గిస్తాయి. న్యూట్రిషనిస్ట్, మాక్రోబయెటిక్ హెల్త్ కోచ్ శిల్పా అరోరాను మాట్లాడుతూ.. తేనె, దాల్చిన చెక్క రెండూ యాంటీ ఇన్ఫ్లమేటరీ, అలెర్జీని ఎదుర్కోవడమే కాకుండా.. రోగనిరోధక శక్తిని పెంచుతాయి. అలాగే మలబద్దకాన్ని నివారిస్తుంది.

దాల్చిన చెక్క, తేనె టీ తయారు చేయు విధానం..

కావలసినవి:

1/4 స్పూన్ సిన్నమోన్ పౌడర్ 1 స్పూన్ తేనె 1 కప్పు నీరు

తయారీ విధానం..

ముందుగా నీరు వేడి చేసి.. అందులో దాల్చిన చెక్క పొడి వేసి కలపాలి. ఆ నీటిని అలాగే 2-3 నిమిషాలు చల్లార్చాలి. దానిని ఒక కప్పులోకి తీసుకొని తేనె కలపాలి. అంతే ఇలా చేయడం వలన రోగనిరోధక శక్తిని పెంచడమే కాదు.. జలుబు, ప్లూ నుంచి రక్షించుకోవచ్చు.

Also Read: PM Kisan: రైతుల అకౌంట్లోకి రూ.2 వేలు.. మీకు వస్తాయో లేదో తెలుసుకోండి.. ఎలా చెక్ చెయాలంటే..

HDFC ఖాతాదారులకు గుడ్ న్యూస్.. కీలక నిర్ణయం తీసుకున్న బ్యాంక్.. మళ్లీ ఆ సర్వీసులు అందుబాటులోకి..