బియ్యంలో నీళ్లుపోసి పచ్చపార్టీ క్షుద్రదాడి.. ఎంపీ విజయసాయి ట్వీట్
టీడీపీ నేత నారా లోకేశ్‌పై మరోసారి ట్వీట్ల రూపంలో వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి విమర్శలు చేశారు. సీఎం జగన్ శ్రీకాకుళంలో నాణ్యమైన బియ్యాన్ని పంపిణీ చేస్తూ పైలట్ ప్రాజెక్టును ప్రారంభిస్తే.. బియ్యం బస్తాల్లో నీళ్ళుపోసి గడ్డ కట్టిన బియ్యాన్ని ఇచ్చారంటూ ప్రభుత్వంపై విమర్శలు చేయడాన్ని విజయసాయిరెడ్డి దుయ్యబట్టారు. సీఎం జగన్ ఈ పథకాన్ని ప్రారంభించిన గంటలోనే పచ్చపార్టీ నేతలు క్షుద్రదాడిని ప్రారంభించాయంటూ ట్వీట్ చేశారు. “మాలోకం , ఆయన టీమ్, ఉన్మాదంతో రెచ్చిపోతున్నారు.పేదలకు నాణ్యమైన బియ్యం ఇవ్వాలనే […]

టీడీపీ నేత నారా లోకేశ్‌పై మరోసారి ట్వీట్ల రూపంలో వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి విమర్శలు చేశారు. సీఎం జగన్ శ్రీకాకుళంలో నాణ్యమైన బియ్యాన్ని పంపిణీ చేస్తూ పైలట్ ప్రాజెక్టును ప్రారంభిస్తే.. బియ్యం బస్తాల్లో నీళ్ళుపోసి గడ్డ కట్టిన బియ్యాన్ని ఇచ్చారంటూ ప్రభుత్వంపై విమర్శలు చేయడాన్ని విజయసాయిరెడ్డి దుయ్యబట్టారు.
సీఎం జగన్ ఈ పథకాన్ని ప్రారంభించిన గంటలోనే పచ్చపార్టీ నేతలు క్షుద్రదాడిని ప్రారంభించాయంటూ ట్వీట్ చేశారు. “మాలోకం , ఆయన టీమ్, ఉన్మాదంతో రెచ్చిపోతున్నారు.పేదలకు నాణ్యమైన బియ్యం ఇవ్వాలనే ఆశయంతో పైలట్ ప్రాజెక్టును సీఎం జగన్ శ్రీకాకుళం నుంచి ప్రారంభించారు. పచ్చపార్టీ దొంగలు ఆ బియ్యంలో నీళ్లుపోసి గడ్డకట్టిన బియ్యం ఇస్తారా అంటూ గంటలోపలే క్షుద్రదాడి మొదలుపెట్టారంటూ” ఎంపీ విజయసాయి ట్వీట్ చేశారు.
పేదలకు మంచి బియ్యాన్ని అందించాలనే ఉద్దేశంతో ఏపీ ప్రభుత్వం శుక్రవారం శ్రీకాకుళంలో మొట్టమొదటిసారిగ ఈ కార్యక్రమాన్ని ప్రారంభించింది. అయితే ఈ పథకంపై టీడీపీ తీవ్రమైన విమర్శలు చేస్తూ బూజుపట్టిన బియ్యాన్ని, తడిసిన బియ్యాన్ని సరఫరా చేస్తున్నారంటూ మండిపడింది.
మాలోకం, ఆయన టీం ఉన్మాదంతో రెచ్చిపోతున్నారు. పేదలకు నాణ్యమైన బియ్యం ఇవ్వాలనే ఆశయంతో పైలట్ ప్రాజెక్టును శ్రీకాకుళం నుంచి ప్రారంభించారు @AndhraPradeshCM గారు.ఆ బియ్యం బస్తాల్లో నీళ్లు పోసి గడ్డకట్టిన బియ్యం ఇస్తారా అంటూ గంట లోపలే క్షుద్ర దాడి మొదలు పెట్టారు పచ్చ దొంగలు. @naralokesh
— Vijayasai Reddy V (@VSReddy_MP) September 8, 2019
బాసేమో 18 కేసుల్లో స్టే తెచ్చుకుని తాను పత్తిగింజనని చెప్పుకుంటారు. బానిసలేమో పోలీసులకు దొరక్కుండా తప్పించుకు తిరుగుతున్నారు. పేదలకు నాణ్యమైన బియ్యాన్నిపంపిణీ చేస్తే కూడా జీర్ణించుకోలేక పోతున్నారు. మూడు పూటలా ఇసుక బొక్కినోళ్లకు రేషన్ బియ్యం నాణ్యత ఏం తెలుసు? @ncbn @JaiTDP
— Vijayasai Reddy V (@VSReddy_MP) September 8, 2019