పెరుగుతున్న గోదావరి ఉధృతి.. మొదటి ప్రమాద హెచ్చరిక జారీ
గోదావరి నది వరద నీటితో పొంగుతోంది. భద్రాచలం వద్ద వరదనీరు ఉధృతంగా ప్రవహిస్తోంది. ప్రస్తుతం 46.7 అడుగులకు చేరింది. పెరుగుతున్న ప్రవాహంతో గోదావరి పరిసర ప్రాంతాల్లో మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. అదేవిధంగా రాజమహేంద్రవరం వద్ద కూడా గోదావరి నది పొంగి ప్రవహిస్తోంది. దవళేశ్వరం కాటన్ బ్యారేజీ వద్ద నీటిమట్టం 11.8 అడుగులకు చేరింది. అక్కడకూడ ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. వరద ప్రవాహం పెరగడంతో దేవీపట్నం మండలంలో వాగుల్లోకి, రహదారులపైకి నీరు వచ్చి చేరింది. […]

గోదావరి నది వరద నీటితో పొంగుతోంది. భద్రాచలం వద్ద వరదనీరు ఉధృతంగా ప్రవహిస్తోంది. ప్రస్తుతం 46.7 అడుగులకు చేరింది. పెరుగుతున్న ప్రవాహంతో గోదావరి పరిసర ప్రాంతాల్లో మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. అదేవిధంగా రాజమహేంద్రవరం వద్ద కూడా గోదావరి నది పొంగి ప్రవహిస్తోంది. దవళేశ్వరం కాటన్ బ్యారేజీ వద్ద నీటిమట్టం 11.8 అడుగులకు చేరింది. అక్కడకూడ ప్రమాద హెచ్చరిక జారీ చేశారు.
వరద ప్రవాహం పెరగడంతో దేవీపట్నం మండలంలో వాగుల్లోకి, రహదారులపైకి నీరు వచ్చి చేరింది. దీంతో పలు ప్రాంతాలకు రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. గోదావరి ఒడ్డున ఉన్న 36 గ్రామాలకు బాహ్యప్రపంచంతో సంబంధాలు తెగిపోయాయి. పూడిపల్లి వద్ద వరదనీరు ఇళ్లలోకి చేరడంతో గ్రామస్థులు ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని ఎత్తయిన ప్రదేశానికి చేరుకుంటున్నారు. మరోవైపు గండిపోశమ్మ ఆవరణలోకి నీరు చేరడంతో ఆలయాన్ని మూసివేశారు. ఎగువన కురుస్తున్న భారీ వర్షాలకు గోదావరిలో వరద పెరగడంతో పరిసర ప్రాంతాల ప్రజలకు మళ్లీ కునుకు కరవైంది. పెరగతున్న వరద ఉధృతి నుంచి ప్రజలను కాపాడేందుకు సహయక చర్యల్ని ముమ్మరం చేశారు. ఇప్పటికే లోతట్ట ప్రాంతాల ప్రజలకు సురక్షిత ప్రాంతాలకు తరలించారు. ఎప్పటికప్పుడు అధికారులు వరదలపై సమీక్ష చేస్తూ పరిస్థితిని పర్యవేక్షిస్తున్నారు.