జెఠ్మలానీ మృతిపై ప్రముఖుల సంతాపం
కేంద్ర మాజీ మంత్రి, సుప్రీం కోర్టు న్యాయవాది రామ్ జెఠ్మలానీ( 95) మృతిపై పలువురు తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. ఈ మేరకు రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్, ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయడు, ప్రధాని మోదీ, కేంద్ర మంత్రులు అమిత్‌షా, రవిశంకర్ ప్రసాద్ ట్విట్టర్ ద్వారా సంతాపం తెలిపారు. కేంద్ర మంత్రిగా, న్యాయవాదిగా ఎన్నో సేవలందించిన రామ్ జెఠ్మలానీ మరణవార్త విని చింతిస్తున్నాను. సమాజంలో జరిగే సమస్యలపై ఆయన తాను చెప్పాలనుకున్న వాటిని ఖచ్చితంగా చెప్పగల మంచి మేథావిని కోల్పోవడం […]

కేంద్ర మాజీ మంత్రి, సుప్రీం కోర్టు న్యాయవాది రామ్ జెఠ్మలానీ( 95) మృతిపై పలువురు తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. ఈ మేరకు రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్, ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయడు, ప్రధాని మోదీ, కేంద్ర మంత్రులు అమిత్‌షా, రవిశంకర్ ప్రసాద్ ట్విట్టర్ ద్వారా సంతాపం తెలిపారు.
కేంద్ర మంత్రిగా, న్యాయవాదిగా ఎన్నో సేవలందించిన రామ్ జెఠ్మలానీ మరణవార్త విని చింతిస్తున్నాను. సమాజంలో జరిగే సమస్యలపై ఆయన తాను చెప్పాలనుకున్న వాటిని ఖచ్చితంగా చెప్పగల మంచి మేథావిని కోల్పోవడం బాధాకరం అంటూ వ్యాఖ్యానించారు రాష్ట్రపతి కోవింద్. అదే విధంగా ప్రధాని నరేంద్రమోదీ తన సంతాపాన్ని తెలియజేస్తూ రామ్ జెఠ్మలానీ మనసుతో మాట్లాడే వ్యక్తి అని, ఆయన ఏదైనా నిర్భయంగా మాట్లాడగలరని, ఎమర్జెన్సీ వంటి రోజుల్లో ప్రజల స్వేచ్ఛకోసం ఆయన ఎంతోగానో పోరాడారన్నారు. ఆయనతో ఎన్నోసార్లు మాట్లాడే అవకాశ కలిగింది. ఈ బాధకరమైన సందర్భంలో ఆయన కుటుంబానికి ప్రగాడ సానుభూతిని వ్యక్తం చేస్తున్నాను .. ఓం శాంతి అన్నారు అంటూ ట్వీట్ చేశారు. రామ్ జెఠ్మలానీతో తనకు ఎంతో అనుబంధముందని, రాజ్యసభ సభ్యులుగా తమ మధ్య కొన్ని సంవత్సరాలు కలిసి ప్రయాణం చేశామని, ఆయన లేకపోవడం బాధకరంగా ఉందంటూ జెఠ్మలానీ ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటున్నట్టు ట్వీట్ చేశారు ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు.
వీరితో పాటు అభిషేక్ సింఘ్వీ, డిల్లీ సీఎం కేజ్రీవాల్, సీపీఎం ప్రధాన కార్యదర్శి సీతారామ్ ఏచూరి, తదితరులు జెఠ్మలానీ మరణంపై తమ సంతాపాన్ని తెలిపారు.