5

ప్రయత్నాలు ఆపం.. 14 రోజులపాటు చేసే కృషి ఫలిస్తుంది.. శివన్

  చంద్రునిపై విక్రమ్ లాండర్ ఆచూకీ కనుగొనే విషయంలో తమ ప్రయత్నాలు విరమించలేదని ఇస్రో చీఫ్ శివన్ ప్రకటించారు. ఆ వ్యోమనౌకతో కాంటాక్ట్ ఏర్పరచుకోవడానికి 14 రోజులపాటు కృషి చేస్తామని, ఇది ఫలిస్తుందని ఆశిస్తున్నామని ఆయన చెప్పారు. మిషన్ చివర్లో నిర్వహించిన పవర్ డిసెంట్ అంచెలో నాలుగు దశలున్నాయి. మొదటి మూడు దశలూ సవ్యంగా సాగాయి. అయితే చివరి దశ సజావుగా జరగనందునే లాండర్ తో కాంటాక్ట్ తెగిపోయింది అని ఆయన వివరించారు. భవిష్యత్తులో ఇస్రో చేపట్టే […]

ప్రయత్నాలు ఆపం.. 14 రోజులపాటు చేసే కృషి ఫలిస్తుంది.. శివన్
Follow us

|

Updated on: Sep 08, 2019 | 2:26 PM

చంద్రునిపై విక్రమ్ లాండర్ ఆచూకీ కనుగొనే విషయంలో తమ ప్రయత్నాలు విరమించలేదని ఇస్రో చీఫ్ శివన్ ప్రకటించారు. ఆ వ్యోమనౌకతో కాంటాక్ట్ ఏర్పరచుకోవడానికి 14 రోజులపాటు కృషి చేస్తామని, ఇది ఫలిస్తుందని ఆశిస్తున్నామని ఆయన చెప్పారు. మిషన్ చివర్లో నిర్వహించిన పవర్ డిసెంట్ అంచెలో నాలుగు దశలున్నాయి. మొదటి మూడు దశలూ సవ్యంగా సాగాయి. అయితే చివరి దశ సజావుగా జరగనందునే లాండర్ తో కాంటాక్ట్ తెగిపోయింది అని ఆయన వివరించారు. భవిష్యత్తులో ఇస్రో చేపట్టే ఏ ప్రయోగంపైనా ఈ స్వల్ప వైఫల్య ప్రభావం ఉండబోదన్నారు. 2022 లో మెం భారత తొలి మానవ సహిత అంతరిక్ష యాత్ర గగన్ యాన్ సహా మరే ఇతర కార్యక్రమం మీదా దీని ఎఫెక్ట్ ఉండబోదు.. అని శివన్ స్పష్టం చేశారు. లాండర్, రోవర్ల సాంకేతిక సత్తాను అధ్యయనం చేశాకే ప్రయోగించినట్టు ఆయన పేర్కొన్నారు. ఆర్బిటర్ లోని డ్యూయెల్ బాండ్ సింథటెక్ అపెర్చర్ రాడార్ కు చంద్రుని ఉపరితలానికి కింద 10 కి.మీ. లోతులోని అంశాలను పరిశోధించే సామర్థ్యం ఉందని, దాని సాయంతో ఐస్ రూపంలో ఉన్న నీటి జాడలను కనుగొనవచ్చునని ఆయన తెలిపారు. ఆర్బిటర్ లోని హై రిజల్యూషన్ కెమెరాకు 30 సెం. మీ. వరకు జూమ్ అయ్యే సత్తా ఉందని, ఇది ప్రపంచంలోనే మొట్టమొదటిదని అన్నారు. ఆ వ్యోమనౌకలోని ఐ ఆర్ స్పెక్ట్రో మీటర్ కూడా శక్తిమంతమైనదే. ఆర్బిటర్ లో ఇంధనం చాలావరకు మిగిలి ఉండడంవల్ల అది దాదాపు ఏడున్నర ఏళ్ళ పాటు పని చేస్తుంది అని శివన్ తెలిపారు. ఇలా ఉండగా.. చంద్రయాన్-2 మిషన్ కు సంబంధించి ఇస్రోను అమెరికా ప్రశంసలతో ముంచెత్తింది. భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ చేసిన ప్రయత్నాలను అభినందిస్తున్నామని, ఈ మిషన్ ఇండియా కృషిలో అత్యద్భుతమైన ముందడుగని యుఎస్.. సౌత్ అండ్ సెంట్రల్ ఆసియా తాత్కాలిక కార్యదర్శి అలీస్ జి.వెల్స్ శనివారం రాత్రి ట్వీట్ చేశారు. వ్యాల్యుబుల్ డేటా సేకరణను ఇండియా కొనసాగిస్తుందని ఆశిస్తున్నామని ఆయన పేర్కొన్నారు. తన అంతరిక్ష ఆశయాలను భారత్ సాధించగలదు. ఇందులో అనుమానం లేదు అని వెల్స్ ట్వీటించారు. మరోవైపు నాసా కూడా ఇస్రోను అభినందించింది. భారత అంతరిక్ష కార్యక్రమాలు కొనసాగగలవని, ఇది నిస్సందేహమని పేర్కొంది.

.