AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

అరగంటలో పేషెంట్ అడ్మిట్ కావాలి.. సీఎం జగన్ సీరియస్ వార్నింగ్

కరోనా రోగికి ఖచ్చితంగా 30 నిమిషాల్లో బెడ్ కేటాయించాలని.. రాష్ట్రంలో ఉన్న 138 కోవిడ్ ఆసుపత్రుల్లో ఎక్కడా కూడా బెడ్ దొరకలేదన్న మాట రాకూడదని జగన్ తెలిపారు.

అరగంటలో పేషెంట్ అడ్మిట్ కావాలి.. సీఎం జగన్ సీరియస్ వార్నింగ్
Ravi Kiran
|

Updated on: Jul 29, 2020 | 2:41 PM

Share

Within 30 Minutes Provide Bed To Corona Patient: కరోనా వైరస్‌పై ఏపీ ప్రభుత్వం యుద్ధం ప్రకటించింది. పాజిటివ్ కేసులతో పాటు మరణాల రేటును కూడా తగ్గించే దిశగా కట్టుదిట్టమైన చర్యలు చేపడుతోంది. ఇందులో భాగంగానే సీఎం జగన్ అధికారులకు కీలక ఆదేశాలు జారీ చేశారు. కరోనా రోగికి ఖచ్చితంగా 30 నిమిషాల్లో బెడ్ కేటాయించాలని.. రాష్ట్రంలో ఉన్న 138 కోవిడ్ ఆసుపత్రుల్లో ఎక్కడా కూడా బెడ్ దొరకలేదన్న మాట రాకూడదని జగన్ తెలిపారు. పేషెంట్ ఎవరైనా కూడా తనకు బెడ్ దొరకలేదంటే అది మానవత్వం మీదే మాట వస్తుందని ఆయన అన్నారు. దీనికి కలెక్టర్లు, జేసీలు తప్పనిసరిగా బాధ్యత వహించాల్సి ఉంటుందని హెచ్చరించారు. అంతేకాకుండా ఏ ఆసుపత్రీ కూడా వైద్యం నిరాకరించకూడదని.. ఒకవేళ నిరాకరిస్తే కఠిన చర్యలు తప్పవని సీరియస్ వార్నింగ్ ఇచ్చారు.

రాష్ట్రంలో కేసులు ఎక్కువగా నమోదవుతున్నప్పుడు ప్రజలు సహజంగా భయపడతారు. వారిలో భయాందోళనలు తగ్గించే దిశగా పెద్ద ఎత్తున ప్రచారం నిర్వహించాలన్నారు. ఫ్లెక్సీలు, హోర్డింగ్స్‌తో పాటు గ్రామ సచివాలయాల్లో కోవిడ్ కాల్ సెంటర్ల నెంబర్లతో కూడిన పోస్టర్లను ఉంచాలి. 104, 14410 టోల్ ఫ్రీ నెంబర్లతో పాటు జిల్లాల్లోని కోవిడ్ కంట్రోల్ రూమ్ కాల్ సెంటర్ నెంబర్ కూడా ఎలప్పుడూ అందుబాటులో ఉండాలని సీఎం జగన్ తెలిపారు.

కోవిడ్ కేర్ సెంటర్లు, కోవిడ్ ఆసుపత్రులు, రాష్ట్రస్థాయి కోవిడ్ ఆసుపత్రులలో చికిత్స, సదుపాయాలు, పారిశుధ్యం, భోజనం వంటి అంశాలను ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని సీఎం జగన్ సూచించారు. ఫిర్యాదుల కోసం 1902 నెంబర్‌ను ప్రదర్శించాలని.. వచ్చిన ఫిర్యాదులకు వెంటనే స్పందించాలని సీఎం అధికారులకు చెప్పారు. కాగా, కరోనా బాధితుల అంత్యక్రియలకు బంధువులు ఎవరూ రాకపోతే ప్రభుత్వమే దగ్గరుండి అంత్యక్రియలు నిర్వహిస్తుందని సీఎం జగన్ వెల్లడించారు.

Also Read:

కోవిడ్ మరణాలు తగ్గించేందుకు.. ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం..

బియ్యం కార్డుదారులకు గుడ్ న్యూస్ చెప్పిన ఏపీ ప్రభుత్వం..

ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం.. కరోనా కోసం ప్రత్యేక యాప్..!