ముంచుకొస్తున్న మాంద్యం… ఆర్థిక వ్యవస్థ కుదేలు!

దేశ ఆర్థిక వ్యవస్థను మాంద్యం కమ్మేస్తున్నది. 2019వ సంవత్సరం ప్రారంభం నుండి వివిధ రంగాలకు సంబంధించి ఉత్పత్తి తగ్గటంపై వెల్లడౌతున్న అంశాలను జులై నెలకు విడుదల చేసిన అంకెలు స్థిరపరిచాయి. అన్ని రంగాలలో అభివృద్ధి తగ్గింది. కార్ల పరిశ్రమ మాంద్యాన్ని ఎదుర్కొంటున్నది. ఈ రంగంలో నెలకొన్న పరిస్థితులు క్రమంగా అన్ని రంగాలలోకి విస్తరించే అవకాశాలు కనిపిస్తున్నాయి. అదే జరిగితే ఆర్థిక వ్యవస్థ తీవ్రమైన సంక్షోభంలోకి జారిపోతుంది. మన్మోహన్ సింగ్ ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు ప్రపంచంలో చాలా దేశాలు ఆర్థిక […]

ముంచుకొస్తున్న మాంద్యం... ఆర్థిక వ్యవస్థ కుదేలు!
Follow us

| Edited By: Anil kumar poka

Updated on: Oct 17, 2019 | 7:14 PM

దేశ ఆర్థిక వ్యవస్థను మాంద్యం కమ్మేస్తున్నది. 2019వ సంవత్సరం ప్రారంభం నుండి వివిధ రంగాలకు సంబంధించి ఉత్పత్తి తగ్గటంపై వెల్లడౌతున్న అంశాలను జులై నెలకు విడుదల చేసిన అంకెలు స్థిరపరిచాయి. అన్ని రంగాలలో అభివృద్ధి తగ్గింది. కార్ల పరిశ్రమ మాంద్యాన్ని ఎదుర్కొంటున్నది. ఈ రంగంలో నెలకొన్న పరిస్థితులు క్రమంగా అన్ని రంగాలలోకి విస్తరించే అవకాశాలు కనిపిస్తున్నాయి. అదే జరిగితే ఆర్థిక వ్యవస్థ తీవ్రమైన సంక్షోభంలోకి జారిపోతుంది.

మన్మోహన్ సింగ్ ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు ప్రపంచంలో చాలా దేశాలు ఆర్థిక మాంద్యంలో కూరుకుపోయాయి. అమెరికా కూడా చాలా ఇబ్బందుల్లో కూరుకుపోయింది. యూరప్ లో ఎన్నో పేరెన్నిక గల సంస్థలు మూతబడ్డాయి. అయితే ఇండియా మాత్రం అప్పుడు కూడా ఠీవీగా కనిపించింది. భారత మార్కెట్లు ఉరకలెత్తాయి. దేశీయ పరిశ్రమ అప్పుడు దేశాన్ని నిలబెట్టింది. అమెరికా లాంటి దేశాలే ఇబ్బందులు పడినా ఇండియా మాత్రం అప్పుడు మాంద్యం ప్రభావానికి లోను కాలేదు!

ఇక ఇప్పుడు  మోడీ జమానా. మొన్నేమో బంగ్లాదేశ్ ఆర్థిక ప్రగతి భారత దేశానికన్నా చాలా బాగుందని అంతర్జాతీయ సంస్థలు చెప్పాయి. ఇండియా కన్నా బంగ్లాదేశ్ ముందుకు దూసుకపోతోందని తేల్చాయి. తాజాగా హంగర్ ఇండెక్స్ లో ఇండియా కన్నా  శ్రీలంక – పాకిస్తాన్ వంటి దేశాలు మెరుగైన స్థానాల్లో ఉన్నాయి. ఆ దేశాల్లో పిల్లలకు మనదేశంలో  కన్నా మంచి ఆహారం అందుతూ ఉంది. వారిలో పెరుగుదల స్థాయి బాగుంది.

ఆఖరికి టూరిజం మీద ఆధారపడి బతికే శ్రీలంక వంటి దేశం కూడా ఆర్థిక మాంద్యం ప్రభావంలోకి పడటం లేదు. మన దేశంలో పరిస్థితి తీవ్ర స్థాయికి చేరుతూ ఉంది. ఇప్పటికే కార్ల అమ్మకాలు చాలా వరకూ ఆగిపోయాయని ఆ సంస్థలు ప్రకటించాయి. ఒక్క ఏడాదిలోనే లక్షకు పైగా కార్ల అమ్మకాలు తగ్గిపోయాయి. దీంతో కార్ల కంపెనీలు నష్టాల్లోకి పోయే పరిస్థితి వచ్చింది.

ఇక నోట్ల రద్దు అప్పుడు పడిపోయిన చిన్నాచితక పరిశ్రమలు మళ్లీ కోలుకోలేదని తెలుస్తోంది. మరోవైపు మోడీ ప్రభుత్వం నోట్లతో ప్రయోగాలు చేస్తూ ఉంది. ఆర్థిక మంత్రేమో మన్మోహన్ ను – కాంగ్రెస్ వాళ్లను విమర్శించే పనిలో ఉన్నారు. మూడు వంద కోట్ల రూపాయల సినిమాలు వచ్చాయి.. ఆర్థిక వ్యవస్థకు అంతకన్నా ఇంకేం కావాలన్నట్టుగా ఒక కేంద్రమంత్రి మాట్లాడారు. ఇదీ మోడీ జమానాలో జరుగుతున్నది. మాంద్యం ప్రభావం సామాన్యులపై పూర్తి స్థాయిలో పడితే పరిస్థితులు తీవ్ర స్థాయికి వెళ్లే అవకాశం ఉంది.

మాంద్యాన్ని నివారించాలన్నా, ప్రపంచాన్ని కమ్ముకుంటున్న సంక్షోభం నుండి మనం తక్కువ నష్టంతో బయట పడాలన్నా నయా ఉదారవాద సంస్కరణలను పక్కన పెట్టి, ప్రజలకు ఉపాధిని, ఉద్యోగాలను కల్పించే విధానాలను అమలు జరపాలి. అపుడు మాత్రమే మాంద్యాన్ని అధిగమించటంతో పాటు సంక్షోభం నుండి కూడా తక్కువ నష్టంతో బయటపడగలం.

SRH vs RCB: చెల్లుకు చెల్లు.. ప్రతీకారం తీర్చుకున్న బెంగళూరు..
SRH vs RCB: చెల్లుకు చెల్లు.. ప్రతీకారం తీర్చుకున్న బెంగళూరు..
మిచెల్ మార్ష్ స్థానంలో సీమ్ బౌలర్ ఆగయా.. ఢిల్లీ భారీ స్కెచ్..
మిచెల్ మార్ష్ స్థానంలో సీమ్ బౌలర్ ఆగయా.. ఢిల్లీ భారీ స్కెచ్..
అందం ఈమెతో పోటీకి రావడానికి కూడా భయపడుతుంది.. ఓడిపోతానేమో అని..
అందం ఈమెతో పోటీకి రావడానికి కూడా భయపడుతుంది.. ఓడిపోతానేమో అని..
ఆస్ట్రేలియా క్రికెటర్‌ను డామినేట్ చేసిన మహేష్‌..
ఆస్ట్రేలియా క్రికెటర్‌ను డామినేట్ చేసిన మహేష్‌..
పోకిరి సినిమాలో నటించిన ఈ అమ్మడు.. ఇప్పుడు అందాలతో..
పోకిరి సినిమాలో నటించిన ఈ అమ్మడు.. ఇప్పుడు అందాలతో..
తెలంగాణలో మరో ఎమ్మెల్సీ ఎన్నికకు గ్రీన్ సిగ్నల్.. పూర్తి షెడ్యూల్
తెలంగాణలో మరో ఎమ్మెల్సీ ఎన్నికకు గ్రీన్ సిగ్నల్.. పూర్తి షెడ్యూల్
ఈ వయ్యారి కట్టడం వల్ల ఆ చీరకె అందం వచ్చిందేమో.. తాజా లుక్స్ వైరల్
ఈ వయ్యారి కట్టడం వల్ల ఆ చీరకె అందం వచ్చిందేమో.. తాజా లుక్స్ వైరల్
రోజూ ఉదయాన్ని ఈ వాటర్‌ తాగండి.. ప్రయోజనాలు తెలిస్తే షాకవుతారు
రోజూ ఉదయాన్ని ఈ వాటర్‌ తాగండి.. ప్రయోజనాలు తెలిస్తే షాకవుతారు
ఇటలీ ప్రధాని జార్జియా మొలోనీకి పీఎం మోదీ ఫోన్.. ఈ ఆంశాలపై చర్చ
ఇటలీ ప్రధాని జార్జియా మొలోనీకి పీఎం మోదీ ఫోన్.. ఈ ఆంశాలపై చర్చ
పిల్లల్ని కనడం పై షాకింగ్ కామెంట్స్ చేసిన మృణాల్ ఠాకూర్..
పిల్లల్ని కనడం పై షాకింగ్ కామెంట్స్ చేసిన మృణాల్ ఠాకూర్..