AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

అసోంలో ఘోర పడవ ప్రమాదం… పలువురు గల్లంతు

అసోంలోని సోనిత్‌పూర్‌ జిల్లాలో గురువారం సాయంత్రం ఘోర పడవ ప్రమాదం చోటు చేసుకుంది. అధికారులు  జియా భరలి నదిలో ప్రమాదం జరిగినట్లు అధికారులు గుర్తించారు. లాల్‌ తపూ సమీపంలోని బిహియా గావ్‌ నుంచి తేజ్‌పూర్‌లోని పంచ్‌ మైల్‌ ప్రాంతానికి వెళ్తుండగా పడవ బోల్తా పడినట్లు అధికారులు పేర్కొన్నారు. ప్రతి గురువారం ఏర్పాటు చేసే వారంతపు సంత కోసం స్థానికులు చి పంచ్‌ మైల్‌కు వెళ్తుంటారు. ప్రమాద సమయంలో పడవలో మోటారు వాహనాలు కూడా ఉన్నాయి. పడవలో ఎక్కువ […]

అసోంలో ఘోర పడవ ప్రమాదం... పలువురు గల్లంతు
TV9 Telugu Digital Desk
| Edited By: |

Updated on: Oct 17, 2019 | 7:45 PM

Share

అసోంలోని సోనిత్‌పూర్‌ జిల్లాలో గురువారం సాయంత్రం ఘోర పడవ ప్రమాదం చోటు చేసుకుంది. అధికారులు  జియా భరలి నదిలో ప్రమాదం జరిగినట్లు అధికారులు గుర్తించారు. లాల్‌ తపూ సమీపంలోని బిహియా గావ్‌ నుంచి తేజ్‌పూర్‌లోని పంచ్‌ మైల్‌ ప్రాంతానికి వెళ్తుండగా పడవ బోల్తా పడినట్లు అధికారులు పేర్కొన్నారు. ప్రతి గురువారం ఏర్పాటు చేసే వారంతపు సంత కోసం స్థానికులు చి పంచ్‌ మైల్‌కు వెళ్తుంటారు. ప్రమాద సమయంలో పడవలో మోటారు వాహనాలు కూడా ఉన్నాయి. పడవలో ఎక్కువ మంది ప్రయాణించడం వల్లే ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. ప్రమాద సమయంలో బోటులో సుమారు 70 నుంచి 80 మంది వరకు ఉండి ఉంటారని స్థానికులు పేర్కొన్నారు . వీరిలో కొందరు ఈదుకుంటూ ఒడ్డుకు వచ్చారు. సమాచారం అందుకున్న ఎస్‌డిఆర్‌ఎఫ్‌, జిల్లా అధికారులు అక్కడకు చేరుకొని సహాయ కార్యక్రమాలు చేపట్టారు. గల్లంతైన వారి కోసం గాలిస్తున్నారు.

Follow Us