AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ప్యారడైజ్ బిర్యానీ గురించి షాకింగ్ న్యూస్ !

సికింద్రాబాద్‌కు వెళుతున్నారా ? ప్యారడైజ్ బిర్యానీ అంటే నోరూరుతోందా ? జర జాగ్రత్త.. అక్కడ బిర్యానీ తినే ముందు ఒక్కసారి ఆలోచించండి. ఈ మాట అంటున్ననది మేము కాదు.. సాక్షాత్తు జీహెచ్ఎంసీ అధికారులు. అసలేం జరిగిందంటే…? సికింద్రాబాద్ ప్యారడైజ్ హోటల్‌కు రూ.లక్ష జరిమానా పడింది. ఆహార పదార్థాల్లో నాణ్యత లేనట్లు గుర్తించిన జీహెచ్‌ఎంసీ అధికారులు జరిమానా విధించారు. వారం రోజుల్లో సరిచేసుకోకపోతే హోటల్ మూసేస్తామని అధికారులు హెచ్చరించారు. బిర్యానిలో వెంట్రుకలు వచ్చాయని వినియోగదారుడు ఫిర్యాదు చేశాడు. హోటల్ […]

ప్యారడైజ్ బిర్యానీ గురించి షాకింగ్ న్యూస్ !
Rajesh Sharma
| Edited By: |

Updated on: Oct 17, 2019 | 6:59 PM

Share

సికింద్రాబాద్‌కు వెళుతున్నారా ? ప్యారడైజ్ బిర్యానీ అంటే నోరూరుతోందా ? జర జాగ్రత్త.. అక్కడ బిర్యానీ తినే ముందు ఒక్కసారి ఆలోచించండి. ఈ మాట అంటున్ననది మేము కాదు.. సాక్షాత్తు జీహెచ్ఎంసీ అధికారులు. అసలేం జరిగిందంటే…?

సికింద్రాబాద్ ప్యారడైజ్ హోటల్‌కు రూ.లక్ష జరిమానా పడింది. ఆహార పదార్థాల్లో నాణ్యత లేనట్లు గుర్తించిన జీహెచ్‌ఎంసీ అధికారులు జరిమానా విధించారు. వారం రోజుల్లో సరిచేసుకోకపోతే హోటల్ మూసేస్తామని అధికారులు హెచ్చరించారు. బిర్యానిలో వెంట్రుకలు వచ్చాయని వినియోగదారుడు ఫిర్యాదు చేశాడు. హోటల్ వారు పట్టించుకోకపోవడంతో వినియోగదారుడు జీహెచ్‌ఎంసీ అధికారులకు ఫిర్యాదు ఇచ్చాడు. దాంతో  రంగంలోకి దిగిన జిహెచ్ఎంసీ అధికారులు హోటల్‌లో విస్తృతంగా తనిఖీలు నిర్వహించారు. హోటల్ క్యాంటీన్‌ను, ప్యాంట్రీని, వినియోగిస్తున్న వస్తువులను, నిల్వ వుంచిన పదార్థాలను పరిశీలించారు. వినియోగిస్తున్న స్టీల్ సామాగ్రి నాసిరకంగా వుండడంతోపాటు.. నిల్వ వుంచిన ఆహార పదార్థాలు నాణ్యతతో లేకపోవడంతో అధికారులు ఆగ్రహం వ్యక్తం చేశారు.

నిల్వ వుంచి మాంస పదార్థాల్లో తాజావి కావని కొందరు ఫిర్యాదు చేయడంతో ఫ్రీజర్లను తనిఖీ చేశారు అధికారులు. వంట సామాగ్రి చిలుము పట్టి వుండడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. నెల రోజుల్లో మరోసారి తనిఖీలకు వస్తామని హెచ్చరించారు. ప్రస్తుతానికి లక్ష రూపాయల జరిమానా విధిస్తున్నామని, పరిస్థితిలో మార్పు లేకపోతే హోటల్‌ని, అన్ని బ్రాంచీలను సీజ్ చేయాల్సి వుంటుందని వార్నింగ్ ఇచ్చి మరీ అక్కడ్నించి కదిలారు జిహెచ్ఎంసీ అధికారులు.

కోటి సంపాదిస్తూ పన్నులు కట్టే టెకీ కి భద్రత ఏది ?? పోస్ట్‌ వైరల్‌
కోటి సంపాదిస్తూ పన్నులు కట్టే టెకీ కి భద్రత ఏది ?? పోస్ట్‌ వైరల్‌
మినిమమ్ బ్యాలెన్స్ చార్జీలు బాది రూ. 8 వేల కోట్లు సంపాదన
మినిమమ్ బ్యాలెన్స్ చార్జీలు బాది రూ. 8 వేల కోట్లు సంపాదన
హెన్నా ఇక వదిలేయండి.. వీటితో మీ జుట్టును నల్లగా మార్చేయండి!
హెన్నా ఇక వదిలేయండి.. వీటితో మీ జుట్టును నల్లగా మార్చేయండి!
గ్లోబల్ తెలంగాణ అసోసియేషన్ నూతన కార్యవర్గం ప్రకటన.. కొత్త టీమ్..
గ్లోబల్ తెలంగాణ అసోసియేషన్ నూతన కార్యవర్గం ప్రకటన.. కొత్త టీమ్..
తనంతట తానుగా ఇంధనం'కటాఫ్' పొజిషన్‌.. తప్పిన పెను ప్రమాదం
తనంతట తానుగా ఇంధనం'కటాఫ్' పొజిషన్‌.. తప్పిన పెను ప్రమాదం
భారత్‌ను ఇరుకున పెట్టేందుకు పాక్ - బంగ్లా భారీ కుట్ర..!
భారత్‌ను ఇరుకున పెట్టేందుకు పాక్ - బంగ్లా భారీ కుట్ర..!
ఏపీ ప్రజలకు భారీ శుభవార్త.. మరోసారి కరెంట్ ఛార్జీలు తగ్గింపు
ఏపీ ప్రజలకు భారీ శుభవార్త.. మరోసారి కరెంట్ ఛార్జీలు తగ్గింపు
ఒకప్పుడు MBBS ఫెయిల్.. ఇండస్ట్రీనే అల్లాడిస్తున్నాడు..
ఒకప్పుడు MBBS ఫెయిల్.. ఇండస్ట్రీనే అల్లాడిస్తున్నాడు..
కేవలం 11 రోజులు మెంతి నీరు తాగితే శరీరంలో ఏం జరుగుతుందో తెలుసా?
కేవలం 11 రోజులు మెంతి నీరు తాగితే శరీరంలో ఏం జరుగుతుందో తెలుసా?
ఆర్సీబీ ప్రైజ్ మనీ ఎంతో తెలుసా.. ఆ స్పెషల్ అవార్డ్ ఎవరికంటే..?
ఆర్సీబీ ప్రైజ్ మనీ ఎంతో తెలుసా.. ఆ స్పెషల్ అవార్డ్ ఎవరికంటే..?