AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

పునర్వైభవంపై పీతల నజర్.. యాక్షన్ ప్లాన్ అదుర్స్

రాజకీయాల్లో ఒకప్పుడు ఆమె చక్రం తిప్పారు. కీలకమైన రెండు శాఖను భుజాన వేసుకుని అప్పటి ప్రతిపక్షంపై విరుచుకుపడ్డారు. సొంత పార్టీ నేతలు ఇబ్బందులు పెట్టినా ధైర్యంగా నిలదొక్కుకున్నారు. సీన్‌ కట్‌ చేస్తే నమ్ముకున్న పార్టీ టికెట్‌ ఇవ్వకపోవడంతో ఇప్పుడు రాజకీయాల్లో తన స్థానం కోసం ఎదురుచూస్తున్నారు. మాటకు మాట సమాధానం చెప్పే మాజీ మంత్రి పీతల సుజాత దారెటు? చింతలపూడిలో మళ్లీ అడుగుపెడతారా? లేక మరేదైనా దారి వెతుక్కుంటారా? తెలుగు తమ్ముళ్ళలో ఇప్పుడిదే హాట్ టాపిక్. పీతల […]

పునర్వైభవంపై పీతల నజర్.. యాక్షన్ ప్లాన్ అదుర్స్
Rajesh Sharma
|

Updated on: Feb 12, 2020 | 1:20 PM

Share

రాజకీయాల్లో ఒకప్పుడు ఆమె చక్రం తిప్పారు. కీలకమైన రెండు శాఖను భుజాన వేసుకుని అప్పటి ప్రతిపక్షంపై విరుచుకుపడ్డారు. సొంత పార్టీ నేతలు ఇబ్బందులు పెట్టినా ధైర్యంగా నిలదొక్కుకున్నారు. సీన్‌ కట్‌ చేస్తే నమ్ముకున్న పార్టీ టికెట్‌ ఇవ్వకపోవడంతో ఇప్పుడు రాజకీయాల్లో తన స్థానం కోసం ఎదురుచూస్తున్నారు. మాటకు మాట సమాధానం చెప్పే మాజీ మంత్రి పీతల సుజాత దారెటు? చింతలపూడిలో మళ్లీ అడుగుపెడతారా? లేక మరేదైనా దారి వెతుక్కుంటారా? తెలుగు తమ్ముళ్ళలో ఇప్పుడిదే హాట్ టాపిక్.

పీతల సుజాత.. మాజీ మంత్రి.. టీచర్‌ వృత్తిని వదిలి రాజకీయాల్లోకి వచ్చారు. అచంట నుంచి తొలిసారి ఎమ్మెల్యేగా గెలిచారు. ఆ తర్వాత చింతలపూడి నుంచి 2014లో గెలుపొందారు. చంద్రబాబు కేబినెట్‌లో కీలకమైన శాఖల మంత్రిగా పనిచేశారు. అదే టైమ్‌లో అప్పటి వైసీపీ నేతల నుంచి ఎదురయ్యే విమర్శలకు స్ట్రాంగ్‌ రిప్లయ్‌ ఇచ్చేవారు. తన మాటలతో ప్రత్యర్థుల ఆరోపణలను తిప్పికొట్టేవారు.

మంత్రిగా ప్రతిపక్షాలకు దడ పుట్టించిన పీతల సుజాతకు తెలుగుదేశంలో సొంత కార్యకర్తల నుంచే నియోజకవర్గంలో ఆమెకు ఇంటి పోరు ఎదురైంది. ముఖ్యంగా మాగంటి బాబు వర్గం ఒక వైపు… చింతమనేని అనుచరులు మరోవైపు ఆధిపత్యం కోసం ప్రయత్నం చేసేవారు. ఆ రెండు వర్గాలకు చెక్‌పెడుతూ..తన వర్గం నేతలకు ప్రయారిటీ ఇస్తూ ముందుకువెళ్లారు. దీంతో చింతలపూడి మార్కెట్‌ యార్డు వివాదం మాగంటి బాబు వర్గానికి, పీతల వర్గానికి ప్రతిష్టాత్మకంగా మారింది. చివరి ఏడాదిలో మాగంటి వర్గం మార్కెట్‌ యార్డు ఛైర్మన్‌ పదవి దక్కించుకోవడంతో పాటు పీతల సుజాతకు వ్యతిరేకంగా పనిచేశారు. మధ్యలోనే తన మంత్రి పదవి పోయినా మాత్రం బాధపడకుండా రాజకీయాలు చేసిన పీతల సుజాతకు 2019లో చింతలపూడి టికెట్‌ దక్కలేదు. దీంతో ఆమె వర్గం చెల్లాచెదురైంది.

పీతల వర్గం కొంతమంది సైలెంట్‌ అయితే…మరికొంతమంది ఇప్పటికే వైసీపీలో చేరారు. అప్పుడప్పుడు జంగారెడ్డిగూడెం ప్రాంతంలో కార్యకర్తలను పీతల సుజాత కలుస్తున్నారు. వీరవాసరంలోని తన సొంత ఊర్లో ఉంటున్నారు. నియోజకవర్గాల్లో నాయకత్వాన్ని బలపరిచేందుకు ప్రస్తుతం టీడీపీ కీలక నిర్ణయాలు తీసుకుంటుంది. దీంతో మరోసారి పీతల సుజాత చింతలపూడిలో చక్రం తిప్పబోతున్నారనే ప్రచారం జోరుగా సాగుతోంది.

2019లో చింతలపూడి టికెట్‌ దక్కించుకున్న కర్రా రాజా రావు వయస్సు రీత్యా తగిన ప్రభావం చూపలేకపోతున్నారనే ప్రచారం నేపథ్యంలో పీతల అక్కడ యాక్టివ్‌ కాబోతున్నారని ఆమె వర్గ నేతలు చెబుతున్నారు. అయితే ఈ సారి మాగంటి బాబు, చింతమనేని వర్గాలు సపోర్టు చేస్తాయా?..ఓటమి తర్వాత నిరుత్సాహంలో ఉన్న చింతలపూడి కేడర్‌ను లీడ్‌ చేయటంత పీతల సక్సెస్‌ అవుతారా? లేదా అనే సందేహాలు ఇప్పుడు నియోజకవర్గంలో వినిపిస్తున్నాయి.