దోచుకునేందుకే రాజధాని మార్పు: కన్నా
అమరావతి ప్రాంత రైతులు బుధవారం ఉదయం బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణతో సమావేశమై అమరావతి పోరుపై భవిష్యత్తు కార్యాచరణ, బీజేపీ మద్దతుపై సమాలోచనలు జరిపారు. సమావేశం అనంతరం కన్నా మాట్లాడుతూ.. దోచుకోవడానికి అమరావతిలో ఏమీ లేదని, విశాఖలో దోపిడీకి ఎక్కువ ఆస్కారం ఉందనే రాజధాని మార్చేందుకు సిద్ధమయ్యారని ఆరోపించారు. ప్రజా క్షేమం, రాష్ట్రాభివృద్ధి కోసం ఈ ప్రభుత్వం ఆలోచించడం లేదని, ఎంత సేపూ యథేచ్ఛగా దోచుకోవడం గురించే ఆలోచిస్తున్నారని మండిపడ్డారు. సంక్షేమ పథకాల రూపంలో ప్రజలకు […]
అమరావతి ప్రాంత రైతులు బుధవారం ఉదయం బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణతో సమావేశమై అమరావతి పోరుపై భవిష్యత్తు కార్యాచరణ, బీజేపీ మద్దతుపై సమాలోచనలు జరిపారు. సమావేశం అనంతరం కన్నా మాట్లాడుతూ.. దోచుకోవడానికి అమరావతిలో ఏమీ లేదని, విశాఖలో దోపిడీకి ఎక్కువ ఆస్కారం ఉందనే రాజధాని మార్చేందుకు సిద్ధమయ్యారని ఆరోపించారు. ప్రజా క్షేమం, రాష్ట్రాభివృద్ధి కోసం ఈ ప్రభుత్వం ఆలోచించడం లేదని, ఎంత సేపూ యథేచ్ఛగా దోచుకోవడం గురించే ఆలోచిస్తున్నారని మండిపడ్డారు. సంక్షేమ పథకాల రూపంలో ప్రజలకు కొన్ని తాయిలాలు ఇచ్చి మభ్యపెడుతున్నారని విమర్శించారు.
అధికార వికేంద్రీకరణ క్రమంలో మూడు రాజధానుల ఏర్పాటుపై కన్నా తీవ్రంగా మండిపడ్డారు. విశాఖలో రాజధాని ఏర్పాటు చేస్తే ప్రశాంతంగా ఉండలేమని అక్కడి ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నట్లు వెల్లడించారు. విజయనగరం జిల్లా ప్రజలు కూడా విశాఖలో రాజధాని వద్దంటున్నారని కన్నా వివరించారు. ప్రభుత్వ విధానాలతో రాష్ట్రం రావణ కాష్టంలా మారిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆర్టీసీ, విద్యుత్, పెట్రో ఛార్జీలు పెంచి… ప్రజల రక్తం పీల్చేలా వైకాపా పాలన కొనసాగుతోందని విమర్శించారు. అమరావతిలోనే రాజధాని ఉండేలా తాము పోరాడతామని స్పష్టం చేశారు.