Exit Poll Result 2021: బెంగాల్.. దంగల్.. మమతా వైపే మహిళలు, ముస్లింలు.. టీవీ9 ఎగ్జిట్ ఫలితాలు..
West Bengal Elections exit Poll Results 2021: దేశంలో ప్రస్తుతం ఐదు రాష్ట్రాల్లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల ఎగ్జిట్ పోల్స్‌పై ఉత్కంఠ నెలకొంది. ముఖ్యంగా పశ్చిమ బెంగాల్
West Bengal Elections exit Poll Results 2021: దేశంలో ప్రస్తుతం ఐదు రాష్ట్రాల్లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల ఎగ్జిట్ పోల్స్‌పై ఉత్కంఠ నెలకొంది. ముఖ్యంగా పశ్చిమ బెంగాల్ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలపైనే అందరి దృష్టి నెలకొంది. రెండు సార్లు వరుసగా అధికారాన్ని సొంతం చేసుకున్న తృణమూల్ కాంగ్రెస్ మరోసారి పీఠాన్ని దక్కించుకొని హ్యాట్రిక్ సాధిస్తుందా..? లేక బీజేపీ గెలుస్తుందా.? అనేది సర్వత్రా చర్చ జరుగుతోంది. ఎందుకంటే.. టీఎంసీ నుంచి అంతా తానై ముఖ్యమంత్రి మమతా బెనర్జీ చివరి వరకు ఒంటరి పోరాటం చేశారు. బీజేపీ నుంచి ప్రధానమంత్రి నరేంద్రమోదీ, హోంమంత్రి అమిత్ షా, బీజేపీ చీఫ్ నడ్డా, రాష్ట్ర నేతలు ముందుండి నడిపించారు. దీంతోపాటు కాంగ్రెస్-లెఫ్ట్ కూటమి కూడా బరిలో ఉంది. అయితే.. టీవీ9 నిర్వహించిన ఎగ్జిట్ పోల్స్‌లో పలు కీలక అంశాలు వెల్లడయ్యాయి. టీవీ9 సర్వేలో మళ్లీ దీదీ కే పట్టం కట్టేలా ఓటర్లు కనిపించారు. బీజేపీ ప్రధాన ప్రతిపక్షంగా వ్యవహరించనుందని తెలుస్తోంది. అయితే బీజేపీ నుంచి హేమాహేమీలు ప్రచారం నిర్వహించనప్పటికీ.. బెస్ట్ సీఎం మమతా బెనర్జీనే అంటూ చాలా మంది ఎన్నికలకు ముందే వెల్లడించడం విశేషం.
హేమాహేమీల లాంటి రాజకీయ నాయకులు ఎందరో ఉన్నా.. బెంగాల్ ప్రజలు మాత్రం మరోసారి తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి, ప్రస్తుత ముఖ్యమంత్రి మమతా బెనర్జీకే అధిక శాతంలో ఓటేశారు. ప్రజలకు ఇబ్బందులు తలెత్తకుండా దీదీ ప్రభుత్వం ఎన్నో రకాల పథకాలను అమలులోకి తీసుకొచ్చిందంటూ పేర్కొన్నారు. టీవీ9 ఎగ్జిట్ పోల్స్‌లో అత్యధిక మంది అధికార తృణముల్‌కే జై కొట్టారు. వారిలో అత్యధికమంది మహిళలు, ముస్లింలు టీఎంసీ వైపే మొగ్గు చూపారు. టీవీ9 నిర్వహించిన సీ ఓటర్ సర్వేలో 43.90 శాతం మంది టీఎంసీకి ఓటేశామని చెప్పగా.. బీజేపీ 40.50 శాతం, కాంగ్రెస్-లెఫ్ట్ కూటమికి 10.70శాతం, ఇతరులు 4.90 శాతం అవకాశముందని చెప్పారు.
టీవీ9 ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు..
టీఎంసీ: 142-152 బీజేపీ: 125-135 కాంగ్రెస్ – లెఫ్ట్ కూటమి:+- 16-26
టీవీ9 నిర్వహించిన సర్వేలో అత్యధిక మంది మహిళలు, ముస్లింలు టీఎంసీ వైపే మొగ్గు చూపారు. ఆ వివరాలు ఇలా..
మహిళలు బీజేపీ – 38.10% టీఎంసీ – 45.20% కాంగ్రెస్ – వామపక్షాలు -9.90% ఇతరులు- 6.80%
ముస్లింలు.. బీజేపీ – 14.00% టీఎంసీ – 70.00% కాంగ్రెస్ – వామపక్షాలు – 14.10% ఇతరులు- 1.90%
దీదీకి కలిసొచ్చిన అంశాలు..
➼ నందిగ్రామ్‌లో దీదీపై జరిగిన దాడి ఘటన బెంగాల్ అసెంబ్లీ ఎన్నికలపై ప్రభావం చూపిందని పేర్కొంటున్నారు. ఈ అంశం కూడా మహిళలపై అత్యధిక ప్రభావం చూపింది. ➼ తృణమూల్ కాంగ్రెస్ మొదటి నుంచి మహిళ పక్షాన ఉండటం, అత్యధిక సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టడం అత్యధిక ప్రభావం చూపింది. ➼ దీంతోపాటు మహిళలనే ప్రచార అస్త్రంగా మార్చుకొని మమతా ఓట్లను మరల్చుకోవడం సఫలికృతం అయ్యారని తెలుస్తోంది. ➼ అంతేకాకుండా ముస్లింల ఓట్లను టీఎంసీ వైపు మరల్చుకోవడంలో మమతా కీలకంగా వ్యవహరించారు. ➼ ముఖ్యంగా ఎంఐఎం పార్టీని మొదట్లోనే చెక్ పెట్టారు. బీజేపీ నుంచి ఎంఐఎం డబ్బు తీసుకోని పోటీ చేయడానికి వస్తుందంటూ పలు ఆరోపణలు సైతం చేశారు. ➼ దీంతోపాటు పలువురు ఎంఐఎం కీలక నేతలను కూడా పార్టీలోకి చేర్చుకున్నారు. తన ప్రసంగాలతో ముస్లింలను ఆకట్టుకునేలా చేశారు. ➼ కేంద్ర బలగాల ఆధ్వర్యంలో.. ఎనిమిది విడతల్లో ఎన్నికలను నిర్వహించడం కూడా దీదీకి కలిసి వచ్చింది. ➼ కరోనా సమయంలో కూడా ఎన్నికల సంఘం ప్రజల ఆరోగ్యాన్ని పట్టించుకోవడం లేదంటూ దీదీ చేసిన ప్రసంగాలు సక్సెస్ అయ్యాయని పేర్కొంటున్నారు. ➼ తానే బెంగాల్ టైగర్ అంటూ.. దీదీ స్థానికత విషయాలను ప్రచారస్త్రంగా మార్చుకున్నారు. ➼ ప్రతీ వేదికపై బీజేపీపై తనదైన శైలిలో విమర్శలు చేయడం కూడా మమతా బెనర్జీకి కలిసివచ్చిందని పలువురు రాజకీయ విశ్లేషకులు పేర్కొంటున్నారు.
మరిన్ని ఇక్కడ చూడండి: Exit Poll Result 2021 LIVE Streaming: నేటితో మినీ సంగ్రామానికి తెర.. సాయంత్రం వెలువడనున్న ఎగ్జిట్ పోల్స్.. టీవీ9లో ఇలా వీక్షించండి