Exit Poll Result 2021 LIVE Streaming: నేటితో మినీ సంగ్రామానికి తెర.. సాయంత్రం వెలువడనున్న ఎగ్జిట్ పోల్స్.. టీవీ9లో ఇలా వీక్షించండి

5 State elections’ exit Poll Results 2021 LIVE Streaming: దేశంలో ఐదు రాష్ట్రాల ఎన్నికల మినీ సంగ్రామానికి నేటితో తెరపడనుంది. గురువారంతో.. అస్సాం, కేరళ, తమిళనాడు, పుదుచ్చేరి, పశ్చిమ బెంగాల్

Exit Poll Result 2021 LIVE Streaming: నేటితో మినీ సంగ్రామానికి తెర.. సాయంత్రం వెలువడనున్న ఎగ్జిట్ పోల్స్.. టీవీ9లో ఇలా వీక్షించండి
Tv9 Exit Poll Result 2021
Follow us
Shaik Madar Saheb

| Edited By: Team Veegam

Updated on: Apr 29, 2021 | 6:59 PM

TV9 Exit Poll Result 2021 Today Time: దేశంలో ఐదు రాష్ట్రాల ఎన్నికల మినీ సంగ్రామానికి నేటితో తెరపడనుంది. గురువారంతో.. అస్సాం, కేరళ, తమిళనాడు, పుదుచ్చేరి, పశ్చిమ బెంగాల్ ఎన్నికలు ముగియనున్నాయి. ఇప్పటికే నాలుగు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు పూర్తవ్వగా.. పశ్చిమ బెంగాల్‌లో చివరి విడత ఎన్నికల పోలింగ్ ఈ రోజు ముగియనుంది. ఈ ఎనిమిదో విడత ఓటింగ్ ప్రక్రియ ముగిసిన వెంటనే అన్ని ఛానెళ్లల్లో ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు వెల్లడికానున్నాయి. అయితే మీరు వేగంగా.. ఖచ్చితమైన ఎగ్జిట్ పోల్స్ వివరాలను చూడాలనుకుంటే.. ఈ రోజు సాయంత్రం 6 గంటలకు టీవీ 9 తెలుగు ఛానెల్‌, టీవీ9 తెలుగు వెబ్‌సైట్‌ను ఫాలో అవ్వండి. ప్రతి అసెంబ్లీ సీటు గురించి ఖచ్చితమైన సమాచారాన్ని పొందుపరచనున్నాం. దీంతోపాటు అన్ని ఎజెన్సీలు, టీవీ ఛానెళ్ల ఎగ్జిట్ పోల్స్ ఫలితాలను కూడా టీవీ9లో వీక్షించవచ్చు. పశ్చిమ బెంగాల్‌లో సాయంత్రం 6 గంటలకు ఎనిమిదో దశ పోలింగ్ ముగిసిన వెంటనే ఈ ఎగ్జిట్ పోల్స్ పలితాలు ప్రారంభమవుతాయి.

టీవీ 9 లో బిగ్ ఫేసెస్ తోపాటు.. చిన్న సీట్ల గురించి కూడా పూర్తి సమాచారం ఇవ్వనున్నాం. సాయంత్రం 6 గంటల నుంచి టీవీ 9 తెలుగులో ఎగ్జిట్ పోల్స్ ఫలితాల వెల్లడి ప్రారంభమవుతుంది. కాగా.. ఈ ఐదు రాష్ట్రాల్లో ఎన్నికల ప్రక్రియ మార్చి 27 నుంచి ప్రారంభమైంది. మొదటి విడతలో పశ్చిమ బెంగాల్‌లో 30, అస్సాంలో 47 అసెంబ్లీ స్థానాల్లో ఓటింగ్ జరిగింది. అయితే ఏప్రిల్ 6 న కేరళ, తమిళనాడు, పుదుచ్చేరిలో ఓకేరోజు ఎన్నికలు పూర్తయ్యాయి. అస్సాంలో మూడు దశల్లో ఎన్నికలు పూర్తవ్వగా.. పశ్చిమ బెంగాల్‌లో ఎన్నికలను ఎనిమిది దశల్లో నిర్వహించారు.

పశ్చిమ బెంగాల్‌లో 294 సీట్లు.. 292 సీట్లల్లోనే పోలింగ్..

పశ్చిమ బెంగాల్‌లో మొత్తం ఎనిమిది దశల్లో ఎన్నికలు జరిగాయి. మొత్తం 294 అసెంబ్లీ స్థానాల్లో 292 సీట్లలో పోలింగ్ నిర్వహించారు. అయితే కరోనా సోకి ఇద్దరు అభ్యర్థులు మరణించడంతో ఆ ప్రాంతాల్లో ఎన్నికలను వాయిదా వేశారు.య ముర్షిదాబాద్ జిల్లాలోని జంగీపూర్, శంషర్‌గంజ్ అసెంబ్లీ స్థానాలకు మే 16 న ఓటింగ్ జరుగనుంది. బెంగాల్‌లో మొదటి దశ ఎన్నికలు మార్చి 27 న జరిగాయి, రెండవ దశ ఏప్రిల్ 1 న, మూడవ దశ ఏప్రిల్ 6 న, నాలుగవ దశ ఏప్రిల్ 10 న, ఐదవ దశ ఏప్రిల్ 17 న, ఆరవ దశ ఏప్రిల్ 22 న, ఏవో దశ 26న పూర్తవ్వగా.. ఎనిమిదో దశను 29న గురువారం నిర్వహిస్తున్నారు.

అస్సాంలో 126 అసెంబ్లీ స్థానాలు..

అస్సాంలోని 126 అసెంబ్లీ స్థానాల్లో ఎన్నికలు ఏప్రిల్ 6న ముగిశాయి. మొత్తం మూడు దశల్లో ఎన్నికల ప్రక్రియ ముగిసింది. మొదటి దశ ఓటింగ్ మార్చి 27న, రెండో దశ ఏప్రిల్ 1న, మూడో దశ 6న జరిగింది. ఇక్కడ అధికార పార్టీ బీజేపీ, కాంగ్రెస్ + ఎఐయూడీఎఫ్ కూటమి మధ్య హోరాహోరీ పోరు నెలకొంది.

తమిళనాడులో 232 స్థానాలు..

ఏప్రిల్ 6 న తమిళనాడులోని 232 అసెంబ్లీ స్థానాల్లో ఏకకాలంలో ఓటింగ్ ప్రక్రియ ముగిసింది. ఈసారి ఇక్కడ ఎన్నికలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. ఎందుకంటే ఎఐఏడీఎంకె, డీఎంకే పార్టీలకు సారధ్యం వహించిన హేమాహేమీలు.. దివంగత నేతలు జయలలిత, ఎం కరుణానిధి లేకుండానే బరిలోకి దిగాయి. ఎప్పటిలాగానే.. ఇక్కడ ఏఐడీఎంకే, డీఎంకే మధ్య పోటీ నెలకొంది. బీజేపీ ఏఐడీఎంకే జట్టుకట్టగా.. కాంగ్రెస్, డీఎంకే కలిసి పోటీచేశాయి.

కేరళలోని 140 స్థానాలు..

కేరళలో కూడా ఏప్రిల్ 6న 140 అసెంబ్లీ స్థానాల్లో ఓటింగ్ ప్రక్రియ ముగిసింది. ఇక్కడ కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా (మార్క్సిస్ట్) ఎల్‌డిఎఫ్ కూటమి… కాంగ్రెస్ మద్దతు గల యూడీఎఫ్ మధ్య గట్టి పోటీ నెలకొంది. భారతీయ జనతా పార్టీ కూటమి కూడా గట్టి పోటీనిచ్చింది.

పుదుచ్చేరిలో 30 స్థానాలు..

కేంద్ర పాలిత ప్రాంతమైన పుదుచ్చేరిలోని 30 అసెంబ్లీ స్థానాలకు ఏప్రిల్ 6న పోలింగ్ ముగిసింది. ఈసారి బీజేపీ.. కాంగ్రెస్ మధ్య హోరాహోరీ పోరు జరిగింది. కాగా.. ఈ ఎన్నికలకు ముందు.. కాంగ్రెస్ వి నారాయణస్వామి ప్రభుత్వం పడిపోయింది. అప్పటి నుంచి ఇక్కడ గవర్నర్ పాలన కొనసాగుతోంది.

Also Read:

Bengal Elections Phase-8 Voting LIVE: ప్రశాంతంగా సాగుతోన్న బెంగాల్ చివరి దశ ఓటింగ్.. బారులు తీరిన ఓటర్లు..

Covid-19 Second Wave: భారత్ నుంచి త్వరగా వచ్చేయండి.. దేశస్థులకు అలర్ట్ జారీ చేసిన అమెరికా

ఉద్యోగం కోసం వెతుకుతున్నారా..? మేనేజర్‌ పోస్ట్‌ ఖాళీ.. దరఖాస్తులు
ఉద్యోగం కోసం వెతుకుతున్నారా..? మేనేజర్‌ పోస్ట్‌ ఖాళీ.. దరఖాస్తులు
మీ కారు టైర్లు త్వరగా అగిరిపోతున్నాయా? అసలు కారణాలు ఇవే..!
మీ కారు టైర్లు త్వరగా అగిరిపోతున్నాయా? అసలు కారణాలు ఇవే..!
హలో దీదీ..మీరు సూపరహే..!ఇల్లూడ్చే చీపురుతో ఇలాంటి స్టంట్ చెయొచ్చా
హలో దీదీ..మీరు సూపరహే..!ఇల్లూడ్చే చీపురుతో ఇలాంటి స్టంట్ చెయొచ్చా
ఇది పండు కాదు.. అమృతఫలం.. రోజుకొకటి తింటే.. మీరు సేఫ్ అంతే.!
ఇది పండు కాదు.. అమృతఫలం.. రోజుకొకటి తింటే.. మీరు సేఫ్ అంతే.!
మీ వాహనంపై చలాన్‌ విధించారో.. లేదో తెలుసుకోవడం ఎలా?
మీ వాహనంపై చలాన్‌ విధించారో.. లేదో తెలుసుకోవడం ఎలా?
అరెరే ఎంతపనైపాయే.. గూగుల్ తల్లి కొంప కొల్లేరు చేసిందిగా.. పాపం.!
అరెరే ఎంతపనైపాయే.. గూగుల్ తల్లి కొంప కొల్లేరు చేసిందిగా.. పాపం.!
ఒకే ఓవర్‌లో 4,4,4,4,4,4.. వామ్మో ఇలా ఉన్నావ్ ఏంది సామీ..!
ఒకే ఓవర్‌లో 4,4,4,4,4,4.. వామ్మో ఇలా ఉన్నావ్ ఏంది సామీ..!
రూ.2 కోట్ల యాడ్ రిజెక్ట్ చేసింది.. ఆమె పేరు చెబితే పూనకాలే..
రూ.2 కోట్ల యాడ్ రిజెక్ట్ చేసింది.. ఆమె పేరు చెబితే పూనకాలే..
హిట్‌మ్యాన్, ట్రావిస్ హెడ్ కాదు.. 23 సిక్సర్లతో ఆ క్రికెటర్ తోపు
హిట్‌మ్యాన్, ట్రావిస్ హెడ్ కాదు.. 23 సిక్సర్లతో ఆ క్రికెటర్ తోపు
ఫాదర్ అఫ్ ట్రావిస్ హెడ్ అంటూ ఫుల్లు ట్రోలింగ్..
ఫాదర్ అఫ్ ట్రావిస్ హెడ్ అంటూ ఫుల్లు ట్రోలింగ్..