AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Anirudh – Kavya Maran: మొదలైన కావ్య, అనిరుధ్ పెళ్లి సంబరాలు.. గ్రీస్‏లో డెస్టినేషన్ వెడ్డింగ్.. వివరాలు ఇవే..

సినీరంగంలో మరో జంట పెళ్లి పీటలు ఎక్కెందుకు రెడీ అయ్యింది. స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ రవిచందర్, సన్ రైజర్స్ హైదరాబాద్ సీఈవో కావ్య మారన్ ఇప్పుడు వివాహ బంధంతో కొత్త జీవితం స్టార్ట్ చేయబోతున్నారు. వీరిద్దరి వివాహం నవంబర్ 10, 11 తేదీలలో గ్రీస్ వేదికగా డెస్టినేషన్ వెడ్డింగ్ జరగనుంది. ఆ తర్వాత నవంబర్ 21న చెన్నైలోని ఐటీసీ గ్రాండ్ చోళాలో గ్రాండ్ రిసెప్షన్ నిర్వహించనున్నారు.

Anirudh - Kavya Maran: మొదలైన కావ్య, అనిరుధ్ పెళ్లి సంబరాలు.. గ్రీస్‏లో డెస్టినేషన్ వెడ్డింగ్.. వివరాలు ఇవే..
Kavya Maran, Anirudh Weddin
Rajitha Chanti
|

Updated on: Oct 31, 2026 | 5:00 PM

Share

భారతీయ సినీ, వ్యాపార , రాజకీయ రంగాలు ఒక్కటై సంబరాలు చేసుకునే అరుదైన అంబరానికి వేళయైంది. సౌత్ ఇండియా టాప్ మ్యూజిక్ డైరెక్టర్, రాక్‌స్టార్ అనిరుధ్ రవిచందర్ , ఐపీఎల్ ఫ్రాంచైజీ సన్‌రైజర్స్ హైదరాబాద్ యజమాని, వ్యాపారవేత్త కావ్యా మారన్ త్వరలోనే వివాహ బంధంతో ఒక్కటి కానున్నారు. వీరిద్దరి రాయల్ డెస్టినేషన్ వెడ్డింగ్ నవంబర్ 10, 11 తేదీల్లో ఐరోపా దేశమైన గ్రీస్‌లో అత్యంత వైభవంగా జరగనుంది. అనంతరం నవంబర్ 21న చెన్నైలోని ఐటీసీ గ్రాండ్ చోళా హోటల్‌లో కళ్లుచెదిరే రీతిలో స్టార్-స్టడెడ్ గ్రాండ్ వెడ్డింగ్ రిసెప్షన్ నిర్వహించనున్నారు. ఇప్పటికే యావత్ దేశవ్యాప్తంగా ఉన్న సినీ, రాజకీయ రంగాలతోపాటు బిజినెస్ రంగంలోని ప్రముఖులకు వీరి వివాహ ఆహ్వానపత్రికలు అందించారు. ఇక ఇప్పుడు వివాహ వేడుకల సమయం దగ్గరపడుతుండటంతో తమిళనాడులోని అనిరుధ్ నివాసంలో ముందస్తు పెళ్లి సందడి అప్పుడే మొదలైంది. కుటుంబ సభ్యులు, అత్యంత ఆప్తుల సమక్షంలో సంప్రదాయబద్ధంగా జరుగుతున్న ఈ ప్రీ-వెడ్డింగ్ సెలబ్రేషన్స్ దృశ్యాలు ప్రస్తుతం సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతున్నాయి.

ముఖ్యంగా అనిరుధ్ డప్పు వాయిస్తూ సందడి చేస్తున్న వీడియోలు, అత్యంత ఖరీదైన రాయల్ ఇన్విటేషన్ కార్డ్‌ల వీడియోలు నెట్టింట ట్రెండ్ అవుతున్నాయి. గ్రీస్‌లో జరిగే డెస్టినేషన్ వెడ్డింగ్‌కు సూపర్ స్టార్ రజనీకాంత్ తో పాటు తమిళనాడు ముఖ్యమంత్రి సీఎం విజయ్ కుటుంబాలు హాజరుకానుండగా, చెన్నై రిసెప్షన్‌కు తెలుగు, తమిళనాడు రాజకీయ నాయకులు , అల్లు అర్జున్ వంటి పలువురు స్టార్ హీరోలు హాజరుకానున్నారు.

ఈ రెండు కుటుంబాల నేపథ్యం చూస్తే సినీ, రాజకీయ రంగాలు కలగలిసి ఉన్నాయి. అనిరుధ్ తండ్రి రవి రాఘవేంద్ర నటుడు కాగా, తల్లి లక్ష్మి శాస్త్రీయ నృత్య కళాకారిణి. లక్ష్మి స్వయానా రజనీకాంత్ భార్య లతకు సోదరి కావడంతో అనిరుధ్ రజనీకాంత్‌కు కొడుకు వరసవుతారు. ‘కొలవెరి డి’ పాటతో సెన్సేషన్ క్రియేట్ చేసిన ఆయన లండన్ ట్రినిటీ కాలేజ్ లో మ్యూజిక్ నేర్చుకుని ప్రస్తుతం భారతీయ సినిమాలో హయ్యెస్ట్ పెయిడ్ మ్యూజిక్ డైరెక్టర్‌గా కొనసాగుతున్నారు. మరోవైపు కావ్యా మారన్ సన్ గ్రూప్ అధినేత కళానిధి మారన్ ఏకైక కుమార్తె. యూకేలోని వార్విక్ బిజినెస్ స్కూల్ నుంచి ఎంబీఏ చేసిన కావ్య, ఐపీఎల్‌లో సన్‌రైజర్స్ టీమ్‌ను నడిపిస్తూ బిజినెస్ ఉమెన్‌గా మంచి పేరు తెచ్చుకున్నారు. ఎంతో క్రేజ్ ఉన్న ఈ ఇద్దరు ప్రముఖుల పెళ్లి వార్త ప్రస్తుతం దేశవ్యాప్తంగా హాట్ టాపిక్‌గా మారింది.

ఎక్కువ మంది చదివినవి : Soundarya : సౌందర్యతో 3 బ్లాక్ బస్టర్స్ చేశా.. ఆమె భర్త ఇప్పుడు ఏం చేస్తున్నారంటే.. టాలీవుడ్ హీరో కామెంట్స్..

అనిరుధ్ రవిచందర్..

ఎక్కువ మంది చదివినవి : ఏముంటది మావ ఈ పాట.. 32 ఏళ్లుగా యూట్యూబ్‏ను షేక్ చేస్తున్న లవ్ సాంగ్.. అప్పట్లో లవర్ కోసం తెగ పాడేవారు..

Follow Us