ఇలా అయితే వాకౌట్ చేస్తాం.. సుప్రీం చీఫ్ జస్టిస్ స్ట్రాంగ్ వార్నింగ్ !

బుధవారం అయోధ్య కేసు విచారణ సందర్భంగా సుప్రీంకోర్టులో హైడ్రామా నడిచింది. విచారణ చివరి రోజున హిందూ మహాసభ.. ఇక్కడ రామ్ లాలా (రాముని జన్మ స్థలం) ఉండేదనడానికి సాక్ష్యా ధారాలు ఉన్నాయని చూపడానికి ప్రయత్నించగా.. ముస్లిం వక్ఫ్ బోర్డు తరఫు న్యాయవాది రాజీవ్ ధావన్ వాటిని చించి వేశారు. మొదట తాము కొత్త ఆధారాలు సమర్పిస్తామని, ఇందుకు సంబంధించిన పుస్తకాన్ని అందజేసేందుకు అనుమతించాలని హిందూ మహాసభ లాయర్ వికాస్ సింగ్.. కోర్టును కోరారు. (మాజీ ఐపీఎస్ అధికారి […]

ఇలా అయితే వాకౌట్ చేస్తాం.. సుప్రీం చీఫ్ జస్టిస్ స్ట్రాంగ్ వార్నింగ్ !
Follow us

| Edited By: Rajesh Sharma

Updated on: Oct 16, 2019 | 4:40 PM

బుధవారం అయోధ్య కేసు విచారణ సందర్భంగా సుప్రీంకోర్టులో హైడ్రామా నడిచింది. విచారణ చివరి రోజున హిందూ మహాసభ.. ఇక్కడ రామ్ లాలా (రాముని జన్మ స్థలం) ఉండేదనడానికి సాక్ష్యా ధారాలు ఉన్నాయని చూపడానికి ప్రయత్నించగా.. ముస్లిం వక్ఫ్ బోర్డు తరఫు న్యాయవాది రాజీవ్ ధావన్ వాటిని చించి వేశారు. మొదట తాము కొత్త ఆధారాలు సమర్పిస్తామని, ఇందుకు సంబంధించిన పుస్తకాన్ని అందజేసేందుకు అనుమతించాలని హిందూ మహాసభ లాయర్ వికాస్ సింగ్.. కోర్టును కోరారు. (మాజీ ఐపీఎస్ అధికారి కిషోర్ కునాల్ ఈ పుస్తకాన్ని రచించారు). అయితే దీనికి ధావన్ అభ్యంతరం చెప్పారు. ఇది కొత్త పుస్తకం.. దీన్ని రికార్డుల్లో పెట్టాలని చూస్తున్నారు అని ఆయన తీవ్ర నిరసన వ్యక్తం చేశారు. కానీ.. వికాస్ సింగ్ ఆయనతో విభేదిస్తూ.. ఈ బుక్ ని కోర్టుకు తీసుకువచ్చేందుకు న్యాయమూర్తులు అనుమతించారని, రాముడు వివాదాస్పద స్థలంలోనే జన్మించాడని చెబుతున్న ప్రదేశానికి సంబంధించిన ఆధారాలు ఇందులో ఉన్నాయని అన్నారు. దీంతో ఆగ్రహం చెందిన ధావన్ ఈ డాక్యుమెంటును చించివేస్తానన్నారు. రాముడి భార్య సీతాదేవి వంట చేసినట్టు చెబుతున్న వంటగృహం (కిచెన్) నిర్దేశిత స్థలంలో ఉన్నట్టు ఈ బుక్ లోని మ్యాప్ చూపుతోందని వికాస్ సింగ్ పేర్కొన్నారు.

రామజన్మ స్థలానికి ఆధారం కూడా ఈ మ్యాపేనని కూడా ఆయన చెప్పారు.దీంతో రాజీవ్ ధావన్ మళ్ళీ అడ్డు తగిలారు. ఇద్దరు లాయర్లూ గొంతెత్తి వాదులాడుకున్నారు. ఒక దశలో కోపం పట్టలేని రాజీవ్ ధావన్.. ఆ మ్యాప్ ను చించివేశారు. ఈ దృశ్యం చూసిన చీఫ్ జస్టిస్ రంజన్ గొగోయ్… విచారణ ఇలాగే కొనసాగితే.. దీన్ని ముగించి లేచి వెళ్లిపోతామని ఆవేశంగా పేర్కొన్నారు. అసలు ఈ వ్యవస్థే భ్రష్టు పట్టింది.. మేం వాకౌట్ చేస్తాం అని తీవ్ర స్వరంతో అన్నారు. కాస్త శాంతించిన ఆయన.. ఈ పుస్తకాన్ని తాను చదువుతానని చెప్పారు. అసలు నవంబరు వరకూ చదువుతూనే ఉంటా అని కూడా అన్నారు. (నవంబరు 17 న ఆయన రిటైర్ కానున్నారు). కాగా- అయిదుగురు జడ్జీల ధర్మాసనం…. ఈ కేసుకు సంబంధించి పిటిషనర్ల తరఫు లాయర్లు తమ వాదనలను ఈ సాయంత్రం 5 గంటలకల్లా ముగించాలని ఉత్తర్వులిచ్చింది.

సముద్ర తీరంలో డజన్ల కొద్దీ తిమింగలాలు.. ఆశ్చర్యపోయిన సందర్శకులు
సముద్ర తీరంలో డజన్ల కొద్దీ తిమింగలాలు.. ఆశ్చర్యపోయిన సందర్శకులు
ఫోన్ రిపేర్ షాపులోకి దూసుకొచ్చిన అనుకోని అతిథి.. ఆ తర్వాత..
ఫోన్ రిపేర్ షాపులోకి దూసుకొచ్చిన అనుకోని అతిథి.. ఆ తర్వాత..
మహాదేవ్ బెట్టింగ్ యాప్‌ ప్రమోషన్‌ చేసినందుకు తమన్నకు నోటీసులు
మహాదేవ్ బెట్టింగ్ యాప్‌ ప్రమోషన్‌ చేసినందుకు తమన్నకు నోటీసులు
ఉచిత ఫుడ్ కోసం కక్కుర్తి.. కెనెడాలో ఊడిన భారతీయుడి ఉద్యోగం
ఉచిత ఫుడ్ కోసం కక్కుర్తి.. కెనెడాలో ఊడిన భారతీయుడి ఉద్యోగం
ప్రియుడిని పక్కన పెట్టిన శృతి.. మరోసారి బ్రేకప్.?
ప్రియుడిని పక్కన పెట్టిన శృతి.. మరోసారి బ్రేకప్.?
అటు జాన్వీ ఇటు కియారా..! ముద్దుల హీరోగా డార్లింగ్
అటు జాన్వీ ఇటు కియారా..! ముద్దుల హీరోగా డార్లింగ్
కాలేజీ మాటున చాటుమాటు యవ్వారం.. ఓ వాహనాన్ని ఆపి చెక్ చేయగా.!
కాలేజీ మాటున చాటుమాటు యవ్వారం.. ఓ వాహనాన్ని ఆపి చెక్ చేయగా.!
ముస్లిం రిజర్వేషన్లపై కాంగ్రెస్ పార్టీకి కిషన్ రెడ్డి కౌంటర్..
ముస్లిం రిజర్వేషన్లపై కాంగ్రెస్ పార్టీకి కిషన్ రెడ్డి కౌంటర్..
మహిళా టెకీ వర్క్‌ ఫ్రం ట్రాఫిక్.. వైరల్ అవుతున్న వీడియో
మహిళా టెకీ వర్క్‌ ఫ్రం ట్రాఫిక్.. వైరల్ అవుతున్న వీడియో
హైదరాబాద్ లో ఆ మార్గంలో మెట్రో రైళ్ల సమయం పొడిగింపు
హైదరాబాద్ లో ఆ మార్గంలో మెట్రో రైళ్ల సమయం పొడిగింపు