5

పెళ్లి బరాత్ పై ఒడిశా సర్కార్ అంక్షలు..!

దేశ వ్యాప్తంగ కరోనా మహమ్మారి రెండో దశ మొదలైందన్న నిపుణుల హెచ్చరకలతో ఒడిశా ప్రభుత్వం అప్రమత్తమైంది.

పెళ్లి బరాత్ పై ఒడిశా సర్కార్ అంక్షలు..!
Follow us

|

Updated on: Nov 11, 2020 | 8:38 PM

దేశ వ్యాప్తంగ కరోనా మహమ్మారి రెండో దశ మొదలైందన్న నిపుణుల హెచ్చరకలతో ఒడిశా ప్రభుత్వం అప్రమత్తమైంది. కొవిడ్ నియంత్రణలో భాగంగా మరోసారి అంక్షలు అమలు చేసేందుకు సిద్ధమవుతోంది. చలికాలం ప్రారంభం కారణంగా ఒడిశా రాష్ట్ర రాజధాని భువనేశ్వర్ మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు సంచలన నిర్ణయం తీసుకున్నారు. భువనేశ్వరులో వివాహ ఊరేగింపులను నిషేధిస్తూ మున్సిపల్ కార్పొరేషన్ ఆదేశాలు జారీ చేసింది. కరోనా సెకండ్ వేవ్ కారణంగా వివాహ కార్యక్రమాల్లో 100మంది, అంత్యక్రియలకు 50 మంది మాత్రమే హాజరయ్యేలా మార్గదర్శకాలను జారీ చేసింది. వివాహ కార్యక్రమాలకు 10 సంవత్సరాల కంటే తక్కువ వయసున్న పిల్లలు, వృద్ధులు, గర్బిణులు, అనారోగ్యంతో ఉన్న వారు హాజరుకావద్దని కొవిడ్ మార్గదర్శకాల్లో అధికారులు పేర్కొన్నారు.

అలాగే తీవ్రమైన శ్వాసకోశ సమస్యలతో బాధపడుతున్న వారు శుభాకార్యాలకు హాజరు కాకపోవడమే మంచిదని సూచించారు. ఒడిశాలో మళ్లీ కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతుండటంతో మరోసారి నిబంధనలను కఠినతరం చేస్తున్నట్లు అధికారులు తెలిపారు. ఒడిశాలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 3.03 లక్షలకు చేరింది. ఇక, అలాగే ఒడిశాలో కరోనా వైరస్ వ్యాప్తితో నవంబరు చివరి వరకు పటాకులు కాల్చడాన్ని నిషేధించారు. డిసెంబరు చివరి వరకు పాఠశాలలను మూసివేయాలని సర్కారు నిర్ణయించింది. కరోనా వైరస్ ప్రబలుతుండటంతో కొవిడ్ పరీక్షల సంఖ్యను కూడా ఆ రాష్ట్ర ప్రభుత్వం పెంచింది.