అమెరికా డిఫెన్స్ పాలసీ సెక్రటరీ జేమ్స్ అండర్సన్ రాజీనామా

అమెరికా అధ్యక్ష ఎన్నికల ఫలితాలు వెలువడిన వెంటనే ఆ దేశ అత్యున్నత శాఖల్లో కీలక మార్పులు చోటుచేసుకుంటున్నాయి.

అమెరికా డిఫెన్స్  పాలసీ సెక్రటరీ జేమ్స్ అండర్సన్ రాజీనామా
Follow us

|

Updated on: Nov 11, 2020 | 8:32 PM

అమెరికా అధ్యక్ష ఎన్నికల ఫలితాలు వెలువడిన వెంటనే ఆ దేశ అత్యున్నత శాఖల్లో కీలక మార్పులు చోటుచేసుకుంటున్నాయి. ఎన్నికల్లో ఓటమిపాలైన ప్రస్తుత అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ రక్షణ శాఖ కార్యదర్శి మార్క్ ఎస్పెర్ ను తొలగించిన మరుసటి రోజే పెంటగాన్ కీలక ఉన్నతాధికారి జేమ్సు అండర్సన్ తన పదవికి రాజీనామా చేశారు. డిఫెన్స్ పాలసీ సెక్రటరీ జేమ్స్ అండర్సన్ రక్షణ శాఖను విడిచిపెడుతున్నట్లు వార్తలు రావడంతో పెంటగాన్‌లో సంచలనం రేపింది. అండర్సన్ రాజీనామాతో వైట్ హౌస్ వివాదాస్పద మాజీ జనరల్ ఆంథోనిటాటాకు ఉన్నత స్థానంలోకి వెళ్లేందుకు లైన్ క్లియర్ అయ్యినట్లు అమెరికావర్గాలు భావిస్తున్నాయి.

అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తన రక్షణ కార్యదర్శిని అకస్మాత్తుగా తొలగించిన ఒక రోజు తర్వాత పెంటగాన్ ఉన్నతాధికారి రాజీనామా చేశారు. అండర్సన్ తన పదవికి రాజీనామా చేశారని అమెరికా రక్షణ శాఖ అధికారి ఒకరు ధ్రువీకరించారు. గొప్ప దేశానికి యూనిఫాంలో సేవ చేయడం గౌరవంగా భావిస్తున్నాను అంటూ మెరైన్ కార్ప్ మాజీ ఇంటలిజెన్స్ అధికారి తన రాజీనామా లేఖలో పేర్కొన్నారు.