5

యూపీ, బెంగాల్ రాష్ట్రాల్లోనూ పోటీ చేస్తాం, అసదుద్దీన్ ఒవైసీ

బీహార్ ఎన్నికల్లో 5 సీట్లను గెలుచుకున్న తాము యూపీ, పశ్చిమ బెంగాల్ రాష్టాల్లోనూ పోటీ చేస్తామని ఎం ఐ ఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ తెలిపారు. బీజేపీ వ్యతిరేక ఓట్లను మేము చీలుస్తున్నామన్న ఆరోపణ సరికాదని ఆయన చెప్పారు.  తాము స్వతంత్రంగా ఎన్నికల్లో పోటీ చేస్తామని, తమకు ఆ హక్కు ఉందని ఒవైసీ అన్నారు. 2022 లో యూపీ అసెంబ్లీకి జరిగే ఎలెక్షన్స్ లో తప్పకుండా పోటీ చేస్తాం. ఎవరితో పొత్తు పెట్టుకోవాలో కాలమే నిర్ణయిస్తుంది అని […]

యూపీ, బెంగాల్ రాష్ట్రాల్లోనూ పోటీ చేస్తాం, అసదుద్దీన్ ఒవైసీ
Follow us

| Edited By: Pardhasaradhi Peri

Updated on: Nov 11, 2020 | 8:23 PM

బీహార్ ఎన్నికల్లో 5 సీట్లను గెలుచుకున్న తాము యూపీ, పశ్చిమ బెంగాల్ రాష్టాల్లోనూ పోటీ చేస్తామని ఎం ఐ ఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ తెలిపారు. బీజేపీ వ్యతిరేక ఓట్లను మేము చీలుస్తున్నామన్న ఆరోపణ సరికాదని ఆయన చెప్పారు.  తాము స్వతంత్రంగా ఎన్నికల్లో పోటీ చేస్తామని, తమకు ఆ హక్కు ఉందని ఒవైసీ అన్నారు. 2022 లో యూపీ అసెంబ్లీకి జరిగే ఎలెక్షన్స్ లో తప్పకుండా పోటీ చేస్తాం. ఎవరితో పొత్తు పెట్టుకోవాలో కాలమే నిర్ణయిస్తుంది అని అన్నారు. బీహార్ ఎన్నికల్లో ఈయన పార్టీ 20 సీట్లకు పోటీ చేసింది. పోలైన 4 కోట్ల ఓట్లలో ఎం ఐ ఎం 1.24 శాతం ఓట్లను దక్కించుకుందని ఈసీ వెల్లడించింది. 2015 లో బీహార్ లో ఈ శాతం 0.5 శాతం కన్నా తక్కువే అని ఈసీ స్పష్టం చేసింది. అంటే మెల్లగా తన పరిస్థితిని మెరుగుపరచుకుంటోందని విశ్లేషకులు భావిస్తున్నారు.