కోహ్లీని పొగడ్తలతో ముంచెత్తిన అమితాబ్!
బాలీవుడ్ స్టార్ అమితాబ్ బచ్చన్ టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీని పొగడ్తలతో ముంచెత్తారు. అమితాబ్ హిట్ మూవీ ‘అమర్ అక్బర్ ఆంథోని’ లోని డైలాగ్‌తో కొనియాడారు. ‘విరాట్‌ను విసిగించొద్దని చాలా సార్లు చెప్పాను. కానీ వారు వినలేదు. ఇప్పుడు కోహ్లీ చిట్టి రాసి వారి చేతిలో పెట్టాడు.. వెస్టిండీస్ ప్లేయర్ల ముఖాలు ఎలా మాడిపోయాయో చూడండి’ అని అమితాబ్ హిందీలో ట్వీట్ చేశారు. ఈ ట్వీట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తోంది. “హా హా డైలాగ్ […]
బాలీవుడ్ స్టార్ అమితాబ్ బచ్చన్ టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీని పొగడ్తలతో ముంచెత్తారు. అమితాబ్ హిట్ మూవీ ‘అమర్ అక్బర్ ఆంథోని’ లోని డైలాగ్‌తో కొనియాడారు. ‘విరాట్‌ను విసిగించొద్దని చాలా సార్లు చెప్పాను. కానీ వారు వినలేదు. ఇప్పుడు కోహ్లీ చిట్టి రాసి వారి చేతిలో పెట్టాడు.. వెస్టిండీస్ ప్లేయర్ల ముఖాలు ఎలా మాడిపోయాయో చూడండి’ అని అమితాబ్ హిందీలో ట్వీట్ చేశారు. ఈ ట్వీట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తోంది. “హా హా డైలాగ్ ను ప్రేమిస్తున్నాను సార్. మీరు ఎప్పుడూ నాకు స్ఫూర్తిదాయకం” అని కోహ్లీ స్పందించాడు.
వెస్టిండీస్ తో జరిగిన తోలి టీ20లో టీమిండియా ఘన విజయం సాధించింది. కోహ్లీ తన అద్భుత బ్యాటింగ్ తో 94 పరుగులు చేసి భారత్ ను విజయ తీరాలకు చేర్చాడు. కోహ్లీ విలియమ్స్ ను ఉద్దేశించి చేసిన సంజ్ఞ వైరల్ అయింది. వెస్టిండీస్ పర్యటనలో కోహ్లీని ఔట్ చేసినప్పుడు విలియమ్స్ చేసిన సంబరాలను దృష్టిలో పెట్టుకొని కోహ్లీ ఈ విధంగా బదులిచ్చాడు.
[svt-event date=”07/12/2019,3:13PM” class=”svt-cd-green” ]
Haha love the dialogue Sir. You’re always an inspiration. ??
— Virat Kohli (@imVkohli) December 7, 2019
[/svt-event]