దిశ కేసు.. ఎన్‌కౌంటర్‌కు బాధ్యులైన పోలీసులపై’సుప్రీం’లో పిటిషన్

దిశకేసులో నలుగురు నిందితులను ఎన్ కౌంటర్ చేసిన పోలీసుల తీరుపై దర్యాప్తు జరిపించాలంటూ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలైంది. జీ.ఎస్.మణి, ప్రదీప్ కుమార్ యాదవ్ అనే ఇద్దరు ఇద్దరు అడ్వొకేట్లు ఈ పిటిషన్ వేశారు. ఎన్ కౌంటర్ చేసిన వారిపై ఎఫ్ ఐ ఆర్ నమోదు చేయాలని కూడా వారు కోరారు. ఈ కేసులో గతంలో సుప్రీంకోర్టు ఇఛ్చిన మార్గదర్శక సూత్రాలను పోలీసులు పాటించలేదని ఈ లాయర్లు ఆరోపించారు. ఎన్ కౌంటర్ల విషయంలో పోలీసు శాఖ 16 ‘ […]

దిశ కేసు.. ఎన్‌కౌంటర్‌కు బాధ్యులైన పోలీసులపై'సుప్రీం'లో పిటిషన్
Follow us
Pardhasaradhi Peri

| Edited By: Srinu

Updated on: Dec 07, 2019 | 5:35 PM

దిశకేసులో నలుగురు నిందితులను ఎన్ కౌంటర్ చేసిన పోలీసుల తీరుపై దర్యాప్తు జరిపించాలంటూ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలైంది. జీ.ఎస్.మణి, ప్రదీప్ కుమార్ యాదవ్ అనే ఇద్దరు ఇద్దరు అడ్వొకేట్లు ఈ పిటిషన్ వేశారు. ఎన్ కౌంటర్ చేసిన వారిపై ఎఫ్ ఐ ఆర్ నమోదు చేయాలని కూడా వారు కోరారు. ఈ కేసులో గతంలో సుప్రీంకోర్టు ఇఛ్చిన మార్గదర్శక సూత్రాలను పోలీసులు పాటించలేదని ఈ లాయర్లు ఆరోపించారు. ఎన్ కౌంటర్ల విషయంలో పోలీసు శాఖ 16 ‘ బాధ్యతలను ‘ పాటించవలసి ఉంటుందని 2014 లో కోర్టు పేర్కొందని వారు గుర్తు చేశారు. ఏ పోలీసు ఎన్ కౌంటర్ లో నైనా చట్ట బధ్ధత ఉందా అని నిర్ధారించడంలో ఇవి ముఖ్యపాత్ర వహిస్తాయని ఆ నాడు కోర్టు వ్యాఖ్యానించింది. ఈ కేసుకు సంబంధించి సిట్ ని నియమించాలని, ఆ విచారణను అత్యున్నత న్యాయస్థానం పర్యవేక్షించాలని ఎం.ఎల్. శర్మ అనే మరో లాయర్ కూడా పిటిషన్ వేశారు. ఎన్ కౌంటర్లను( ‘ ఎక్స్ ట్రా జుడిషియల్ కిల్లింగ్స్ ‘) ని సమర్థించిన రాజ్యసభ ఎంపీ జయబచ్చన్, ఢిల్లీ మహిళా కమిషన్ చైర్ పర్సన్ స్వాతి మలివాల్ పై చర్యలు తీసుకోవాలని ఆయన అభ్యర్థించారు. మరోవైపు-ముంబైకి చెందిన గుణరత్న సదావర్తె అనే లాయర్ సైతం మరో పిటిషన్ దాఖలు చేశారు. ఆయన సుప్రీంకోర్టుతో బాటు తెలంగాణ హైకోర్టులోను, జాతీయ మానవ హక్కుల కమిషన్ సహా తెలంగాణ డీజీపీ లకు పిటిషన్ లేఖలు పంపారు. తనతో బాటు ముంబైకి చెందిన మరికొందరు అడ్వొకేట్లు కూడా ఈ లేఖలు పంపినట్టు ఆయన పేర్కొన్నారు. ఎన్ కౌంటర్ కు బాధ్యులైన పోలీసులపై ఎఫ్ ఐ ఆర్ నమోదు చేయాలని తాను కోరినట్టు ఆయన చెప్పారు. ..