ముగిసిన ఎన్‌హెచ్ఆర్సీ విచారణ.. ఏం తేల్చబోతోంది..!

మహబూబ్‌నగర్ ఆసుపత్రిలో ఎన్‌హెచ్‌ఆర్సీ విచారణ ముగిసింది. ఢిల్లీ నుంచి వచ్చిన ఓ ప్రత్యేక బృందం మృతదేహాలను పరిశీలించి.. మూడు గంటల పాటు ఎన్‌కౌంటర్‌పై విచారణ చేసింది. ఈ సందర్భంగా నిందితుల కుటుంబ సభ్యుల స్టేట్‌మెంట్‌ను ఎన్‌హెచ్ఆర్సీ రికార్డు చేసింది. మరికాసేపట్లో చటాన్‌పల్లిలో ఎన్‌కౌంటర్ జరిగిన స్థలాన్ని బృందం పరిశీలించనుంది. కాగా నిందితుల మృతదేహాలకు శుక్రవారమే పోస్ట్‌మార్టం జరిగినప్పటికీ.. ఎన్‌హెచ్‌ఆర్సీ, హైకోర్టు విచారణ తరువాతే వీరి అంత్యక్రియలు నిర్వహించనున్నారు. దీంతో అప్పటి వరకు ఈ మృతదేహాలు మహబూబ్‌నగర్ ప్రభుత్వ […]

  • Tv9 Telugu
  • Publish Date - 6:15 pm, Sat, 7 December 19
ముగిసిన ఎన్‌హెచ్ఆర్సీ విచారణ.. ఏం తేల్చబోతోంది..!

మహబూబ్‌నగర్ ఆసుపత్రిలో ఎన్‌హెచ్‌ఆర్సీ విచారణ ముగిసింది. ఢిల్లీ నుంచి వచ్చిన ఓ ప్రత్యేక బృందం మృతదేహాలను పరిశీలించి.. మూడు గంటల పాటు ఎన్‌కౌంటర్‌పై విచారణ చేసింది. ఈ సందర్భంగా నిందితుల కుటుంబ సభ్యుల స్టేట్‌మెంట్‌ను ఎన్‌హెచ్ఆర్సీ రికార్డు చేసింది. మరికాసేపట్లో చటాన్‌పల్లిలో ఎన్‌కౌంటర్ జరిగిన స్థలాన్ని బృందం పరిశీలించనుంది. కాగా నిందితుల మృతదేహాలకు శుక్రవారమే పోస్ట్‌మార్టం జరిగినప్పటికీ.. ఎన్‌హెచ్‌ఆర్సీ, హైకోర్టు విచారణ తరువాతే వీరి అంత్యక్రియలు నిర్వహించనున్నారు. దీంతో అప్పటి వరకు ఈ మృతదేహాలు మహబూబ్‌నగర్ ప్రభుత్వ ఆసుపత్రిలోనే పోలీసులు భద్రపరచనున్నారు. మరోవైపు ఈ లోపు ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా నిందితుల గ్రామాల్లో, ఆసుపత్రి పరిసరాల్లో పోలీసులు పటిష్ట భద్రతను ఏర్పాటు చేశారు. ఇలాంటి నేపథ్యంలో ఎన్‌హెచ్‌ఆర్సీ విచారణ ఏం తేల్చబోతోంది..? హైకోర్టు ఏం తీర్పు ఇవ్వబోతోంది..? అన్నది ఇప్పుడు ఉత్కంఠగా మారింది.

ఇదిలా ఉంటే ఈ ఎన్‌కౌంటర్‌పై కేసు నమోదైంది. ఏసీపీ సురేందర్‌ రావు ఫిర్యాదు మేరకు పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదు చేశారు. దిశ హత్య కేసు విచారణాధికారిగా సురేందర్ రావు ఉన్న విషయం తెలిసిందే. మరోవైపు ఎన్‌కౌంటర్ జరిగిన ప్రాంతంలో క్లూస్‌టీం పర్యటించనుంది. కాల్పులు జరిపిన చోట బుల్లెట్ల కోసం మెటల్ డిటెక్టర్ ద్వారా టీం పరిశీలించనుంది.